ITC: ఆశీర్వాద్ పిండి, ఇతర సరుకుల్ని మీ ఇంటికే డెలివరీ చేయనున్న ఐటీసీ

Coronavirus pandemic | లాక్‌డౌన్ కాలంలో మీరు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఐటీసీ కంపెనీ మీ ఇంటికే సరుకుల్ని డెలివరీ చేయనుంది.

news18-telugu
Updated: April 16, 2020, 3:51 PM IST
ITC: ఆశీర్వాద్ పిండి, ఇతర సరుకుల్ని మీ ఇంటికే డెలివరీ చేయనున్న ఐటీసీ
ITC: ఆశీర్వాద్ పిండి, ఇతర సరుకుల్ని మీ ఇంటికే డెలివరీ చేయనున్న ఐటీసీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో దిగ్గజ సంస్థ అయిన ఐటీసీ ఇంటింటికీ సరుకుల్ని డెలివరీ చేయనుంది. ఇందుకోసం స్విగ్గీ, జొమాటో, డొమినోస్‌తో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఆశీర్వాద్ పిండి, ఇప్పీ నూడుల్స్, సన్‌ఫీస్ట్ బిస్కిట్లు, బీ-నేచురల్ జ్యూస్, సావలాన్ సబ్బులు, హ్యాండ్‌వాష్ లాంటి ప్రొడక్ట్స్‌ని ఇంటింటికీ డెలివరీ చేసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్‌డౌన్ ఉంటుంది. ఆ తర్వాత దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశముంది. ప్రస్తుతం డోర్ డెలివరీకి డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఐటీసీ. నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, హైజీన్ ప్రొడక్ట్స్‌ని ఇంటింటికే డెలివరీ చేయాలని భావిస్తోంది.

డొమినోస్, స్విగ్గీ, జొమాటో మాత్రమే కాదు మెట్రోలోని హౌజింగ్ సొసైటీల్లో డెలివరీ చేస్తున్న అప్నా కాంప్లెక్స్, మైగేట్, నోబ్రోకర్, అజ్గో లాంటి కమ్యూనిటీ సెంట్రిక్ యాప్స్‌తో కూడా ఒప్పందం చేసుకుంటోంది. https://itcstore.in/ పోర్టల్‌లో ఆర్డర్లు చేసే వినియోగదారులకు సరుకులు డెలివరీ చేసేందుకు డుంజో లాంటి లాజిస్టిక్స్ సంస్థలతో చేతులు కలుపుతోంది. కరోనా వైరస్ సంక్షోభం తొలగిపోయిన తర్వాత కూడా ఈ డెలివరీ విధానాన్ని కొనసాగించాలని ఐటీసీ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Airtel: ఎయిర్‌టెల్ నుంచి ఆల్ ఇన్ వన్ హోమ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి
First published: April 16, 2020, 3:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading