IT WILL BE THE MOTHER OF ALL FESTIVE SEASONS TATA MOTORS ON DIWALI SALES GH VB
Tata Motors : పండుగ సీజన్‌కు టాటా మోటార్స్ అద్భుత ఆఫర్లు.. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కొనసాగింపు..
ప్రతీకాత్మక చిత్రం
Tata Motors : దేశీయ ఆటోమొబైల్ విభాగంలో మూడో స్థానంలో ఉన్న టాటా మోటార్స్.. కరోనా ప్రభావంతో సేల్స్ లేక చాలా ఇబ్బంది పడింది. ఆగస్టులో ఓనంతో ప్రారంభమయ్యే ఈ పండుగల సీజన్ డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సీజన్ కోసం కొత్త కార్లను కూడా విడుదల చేయనుంది టాటా మోటార్స్.
దేశీయ ఆటోమొబైల్ విభాగంలో మూడో స్థానంలో ఉన్న టాటా మోటార్స్.. కరోనా ప్రభావంతో సేల్స్ లేక చాలా ఇబ్బంది పడింది. అయితే రాబోయే దీపావళి పండగ సీజన్లో మామూలు నెలవారీ సేల్స్ కంటే సుమారు 25 నుంచి 30 శాతం వరకు అమ్మకాలు పెరుగుతాయని సంస్థ ఆశిస్తోంది. గత రెండేళ్లుగా సేల్స్ సరిగ్గా లేకపోయినా ప్రస్తుతం పరిస్థితులు మారుతుండడం, చాలామంది వ్యక్తిగత వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో అమ్మకాలపై ఆశలు పెట్టుకుంది. ఇందుకు తగ్గట్లు ఆఫర్లను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆగస్టులో ఓనంతో ప్రారంభమయ్యే ఈ పండుగల సీజన్ డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సీజన్ కోసం కొత్త కార్లను కూడా విడుదల చేయనుంది టాటా మోటార్స్. టియాగో ఎన్ఆర్ జీ, మినీ ఎస్ యూవీ (ప్రస్తుతానికి హార్న్ బిల్ అని పిలుస్తున్నారు) వంటి కార్లను విడుదల చేయనుంది. అంతే కాదు.. నిక్సాన్, హారియర్, సఫారీ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను కూడా విడుదల చేయనుంది.
దీని గురించి టాటా మోటార్స్ సేల్స్ వీపీ రాజన్ అంబా మాట్లాడుతూ.. ‘ఈ పండగ సీజన్ మాకు అన్నింటి కంటే స్పెషల్‌గా ఉండబోతోంది. కస్టమర్ ఫ్లో, బుకింగ్స్, ఎంక్వైరీలు, వెబ్ సైట్ విజిట్స్ అన్నింట్లోనూ ఎంతో పెరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరగనుంది. కరోనా రెండో వేవ్ తర్వాత ఇప్పుడే అంతా సాధారణంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది’ అని వెల్లడించారు. హార్న్ బిల్ మోడల్ విడుదల కాగానే నెలకు సుమారు 40 వేలకు పైగా వాహనాలు రోడ్డు పైకి తీసుకురావాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తమ మోడల్స్ కి డిమాండ్ పెంచుకుంటూ ఈ సంస్థ పది శాతం మార్కెట్ షేర్ సాధించింది. గత ఎనిమిది సంవత్సరాల్లో ఈ రికార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. జులైలో నిక్సాన్ ఎస్ యూవీ పదివేల మోడల్స్ అమ్ముడయ్యాయి.
వచ్చే నెలల్లో మరో పది నుంచి పన్నెండు వేల కార్లు అమ్మాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సంస్థ ఒకే డిజిటల్ కీని అందించడం, టియాగో హాచ్ బ్యాక్‌లో మ్యూజిక్ సిస్టమ్ ఉపయోగించకపోవడం వంటి మార్చితే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. ఈ ఫెస్టివల్ సీజన్లో హారియర్, ఎస్ యూవీ, సఫారీ వాహనాలను అమ్ముతూ మంత్లీ సేల్స్ కనీసం నాలుగు వేల కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ఈ సంస్థ భావిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.