డేంజర్ బెల్స్...4.5 కోట్ల ఐటీ ఉద్యోగాలు హుష్ కాకి...

రానున్న 6 సంవత్సరాల్లో పెరుగుతున్న టెక్నాలజీ దెబ్బకు 4.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఊడిపోనున్నాయని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ సంచలన రిపోర్టు విడుదల చేసింది.

news18-telugu
Updated: March 31, 2019, 5:41 PM IST
డేంజర్ బెల్స్...4.5 కోట్ల ఐటీ ఉద్యోగాలు హుష్ కాకి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 31, 2019, 5:41 PM IST
రానున్న 6 సంవత్సరాల్లో పెరుగుతున్న టెక్నాలజీ దెబ్బకు 4.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఊడిపోనున్నాయని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ సంచలన రిపోర్టు విడుదల చేసింది. 2025 నాటికి ఈ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని మెకిన్సె సంస్థ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలతో పాటు, ఐటీ ఆధారిత సంస్థల్లో ఈ ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. మారుతున్న టెక్నాలజీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల ఈ ప్రమాదం ముంచుకొస్తుందని రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఉద్యోగాలు కోల్పోయేవారు, ఇతర రంగాలకు వలస వెళ్లడంతో పాటు స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చని సూచనలు చేశారు.

ముఖ్యంగా ఇండియన్ టెకీల సామర్థ్యంపై దిగ్గజ ఐటీ కంపెనీల కోసం ఈ రిపోర్టు తయారు చేసినట్లు మెకిన్సీ తెలిపింది. తద్వారా ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ అధ్యయనం తోడ్పడనుందని మెకిన్సీ సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉంటే గ్లోబల్ స్థాయిలో జీడీపీలో ఐటీ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువ 2025 నాటికి రూ.30 లక్షల కోట్లకు చేరనుందని రిపోర్టులో ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ఉద్యోగులు తమ స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటే ఉద్యోగాలు ఉంటాయని లేకపోతే డేంజర్ జోన్ లో పడినట్లే మెకిన్సీ రిపోర్టు తేలుస్తోంది.

First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...