Home /News /business /

IT MAN WHO AUTOMATED HIS JOB ONE YEAR AGO IN PANDEMIC STILL EARNS RS 66 LAKH HERE FULL DETAILS NS GH

Money Making: ఆన్​లైన్ పోస్టులతో ఏకంగా రూ.66 లక్షల సంపాదన.. ఎలానో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తన కంప్యూటర్​ ముందు రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే గడుపుతూ సంవత్సరానికి 66 లక్షల రూపాయలు(90 వేల డాలర్లు) సంపాదిస్తున్న ఓ ఐటీ స్పెషలిస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్​లో సెలబ్రిటీగా మారాడు.

కరోనా (Corona) మహమ్మారి మానవ జీవితాలను తలకిందులు చేసింది. ఉద్యోగ జీవితం గురించి చెప్పనక్కరలేదు. చాలామంది తమ ఇంటినే ఆఫీసుగా మార్చుకున్నారు. జూమ్(Zoom) మీటింగ్‌ల్లో గంటల తరబడి చర్చలు జరపడం సర్వసాధారణమైంది. మనలో చాలామంది అంత ఈ కొత్త జీవితానికి అలవాటు పడలేకపోయారనేది కాదనలేని నిజం. అయితే కొందరు మాత్రం దీనిని ఓ అవకాశంగా మార్చుకున్నారు. తమకు అప్పగించిన కష్టమైన పనిని కూడా తెలివిగా, సింపుల్‌గా చేయడం ప్రారంభించారు. అలాంటి ఓ వ్యక్తి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది.. తన కంప్యూటర్​ ముందు రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే గడుపుతూ సంవత్సరానికి 66 లక్షల రూపాయలు(90 వేల డాలర్లు) సంపాదిస్తున్న ఓ ఐటీ స్పెషలిస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్​లో సెలబ్రిటీగా మారాడు. మానవ మెదడుతో చేసే పనిని ఆటోమెటిక్ ప్రక్రియ ద్వారా చేపడుతున్నాడీ ఐటీ ప్రొఫెషనల్. అయితే ప్రస్తుతానికి అతనికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ.. ఐటీ వర్గాల్లో ఈ వార్త ట్రెండ్ అవుతోంది.

చేసింది ఇంతేనా?
నిర్ణీత సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన కమాండ్స్​ను అందించడం అతని పని. కాబట్టి ల్యాప్​టాప్ ముందు గంటలు గంటలు గడపాల్సి వచ్చేది. ఈ క్రమంలో పనిభారాన్ని తగ్గించుకునేందుకు వర్క్ ఆటోమేట్ చేశానని చెబుతున్న ఈ ఉద్యోగి.. ఈ విషయం గురించి తాను పనిచేస్తున్న కంపెనీకి తెలియదని చెబుతున్నాడు. రెడ్డిట్​లో పోస్ట్‌లు(Reddit post) పెడుతూ ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నాడు.
Business Idea: ఈ బిజినెస్‌తో ఇంత లాభం ఉంటుందా? ఇలా చేస్తే రూ.15 లక్షల ప్రాఫిట్

ఇక వర్క్ ఆటోమేషన్ వల్ల మిగిలిన సమయాన్ని వీడియో గేమ్‌లు ఆడటం, ఇంటి పనులు చేసుకోవడంతో పాటు మరింత డబ్బు సంపాదించే మార్గాలను వెతకడానికి కేటాయిస్తున్నట్లు తెలిపాడు. వీటన్నింటినీ పని వేళల్లోనే చేస్తున్నాడంటే అతని ప్రతిభను అభినందించాల్సిందే. తన పనుల నిర్వహణ కోసం అతను ఓ ఆటోమెటిక్ వర్క్ స్క్రిప్ట్​ను రూపొందించుకున్నాడు. డిజిటల్, క్లౌడ్‌ డేటా అప్‌లోడింగ్, న్యాయ సంస్థల డేటా నిర్వహణ అతనికి అప్పగించిన పనులు.
Business Idea: చీప్‌గా చూడొద్దు... నెలకు రూ.40,000 లాభం ఇచ్చే బిజినెస్ ఐడియా ఇది

కరోనా ప్రారంభానికి ముందు కూడా 8 గంటల షిఫ్ట్‌ ఉండేదని.. అయితే టీమ్​తో కలిసి పనిచేయడం వల్ల వర్క్ ప్రెషర్​ ఉండేది కాదని చెబుతున్నాడు. అదీగాక తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టేది కాదని.. అదయ్యాక 'ఏదో పని ఉన్నట్లు నటిస్తూ' ఉండేవాడినని నవ్వుతూ చెప్పాడు. అయితే కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేయడం ప్రారంభించిన తర్వాత పనిభారాన్ని మరింత తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగానే రిమోట్ వర్క్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు.

అనంతరం వారం రోజుల పాటు కష్టపడి ఓ స్క్రిప్ట్‌ను డెవలప్ చేశాడు. కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి ఆన్ సైట్ డ్రైవ్‌ను స్కాన్ చేసే ఓ సాఫ్ట్​వేర్​ ద్వారా.. వాటిని క్లౌడ్‌కు బదిలీ చేసేలా రూపొందించాడు. ఉదాహరణకు కోర్టులో డిజిటల్ సాక్ష్యం తారుమారు చేయలేదని నిరూపించాలనే టాస్క్​ ఇవ్వగా.. దాన్ని రాశాడు కూడా!! ఈ రకంగా రోజంతా వీడియో గేమ్‌లు ఆడుకుంటూ, ఇతర పనులు చేసుకుంటూ.. పర్​ఫెక్ట్​గా తన పనిని చేసుకుంటున్నాడు. దీన్ని నిర్ధారించుకునేందుకు రోజు చివరిలో ఓ 10 నిమిషాలు చెక్​ చేసుకుని లాగౌట్​ అవుతాడు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Earn money, Money making

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు