Home /News /business /

IT IS TIME TO STOP THE DEMONISATION OF BIG BUSINESS BA

పెద్ద సంస్థలను దెబ్బతీసే పనులు ఆపేయాలి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు పంజాబ్‌లో ఇప్పటి వరకు సుమారు 1500 సెల్ టవర్లను ధ్వంసం చేశారు. ఈ విషయంలో ఒక్క మాట చెప్పాలి. ప్రైవేట్ ప్రాపర్టీని రక్షించాల్సిన బాధ్యత పంజాబ్ ప్రభుత్వంపై ఉంది.

  (మానస్ చక్రవర్తి, మనీకంట్రోల్ కోసం రాసిన వ్యాసం)

  కేంద్ర వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు పంజాబ్‌లో ఇప్పటి వరకు సుమారు 1500 సెల్ టవర్లను ధ్వంసం చేశారు. ఈ విషయంలో ఒక్క మాట చెప్పాలి. ప్రైవేట్ ప్రాపర్టీని రక్షించాల్సిన బాధ్యత పంజాబ్ ప్రభుత్వంపై ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఇంకో విషయం ఏంటంటే, టెలికం టవర్లు అనేవి సామాజిక ఉపయోగకరమైనవి. ప్రస్తుతం కరోనా సమయంలో ఇవి అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయి. చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని కచ్చితంగా ఖండించాలి. ఇది ప్రజల జీవితాలపై చెడు ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. కరోనా నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా చేస్తుంది. అలాగే, పెట్టుబడిదారులకు చెడు సంకేతాలు పంపుతుంది. ఇక్కడ సెల్ టవర్లు కూల్చడం ఒక్కటే కాదు. ఇంకా చాలా పెద్ద సమస్య ఉంది. కొందరు విలన్లు రైతుల ఆందోళనలను ఆసరాగా చేసుకుని తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. కొందరి నోటి కాడి కూడు లాగేసుకుంటున్నారు. సోవియట్ యూనియన్‌లో కొందరు చూపిన క్యారికేచర్లు ఎలా ఉండేవంటే, కొందరు సూటు బూటు వేసుకుని, పెద్ద పెద్ద సిగరెట్లు నోట్లో పెట్టుకుని ఉన్న వ్యాపారులు పేద ప్రజలను కాళ్ల కింద వేసి తొక్కుతున్నట్టుగా చూపించేవి. అవి ఎంత చెడు ప్రభావాన్ని చూపించాయో మనకు తెలుసు.

  మన దేశంలో ఆందోళనలు కొత్తకాదు. కానీ, అధికారంలో ఉన్న అన్ని పార్టీలు వాస్తవంలో అయినా, కాకపోయినా తాము పేదల పక్షపాతం వహిస్తామని, పెద్ద వ్యాపారులకు వ్యతిరేకం అని ప్రకటించుకుంటున్నాయి. ఒక ప్రభుత్వాన్ని ‘సూట్ బూట్ సర్కారు’ అని పిలవడం కూడా పొలిటికల్ కిస్ ఆఫ్ డెత్ లాంటిది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చైనా తమ ‘మావో జాకెట్‌’ను వదిలేసి బిజినెస్ సూట్ వేసుకున్న తర్వాత ఆ దేశం ఉవ్వెత్తున ఎగిసింది. కొన్ని కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తుల్ని చేసింది.

  పెద్ద వ్యాపారాల మీద దాడులు చేయడం ద్వారా ఆందోళనకారులు ఏం చేయాలనుకుంటున్నారు? వారు అత్యాధునిక, అత్యున్నత సాంకేతికతను దెబ్బతీయడం లేదా? దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు దోహదం చేస్తున్న కంపెనీలకు నష్టంచేయడం లేదా? రిలయన్స్ జియో దేశంలో టెలికం విప్లవం తీసుకురాలేదా? జియో వల్ల ఎందరో పేద పిల్లలు ఈ రోజు ఆన్ లైన్ క్లాసులు హాజరుకాగలుగుతున్నారు. ఎందరో చిన్న వ్యాపారులకు, రైతులకు కూడా అది ఊతంగా నిలవడం లేదా?

  అక్కడ టెలికం ఒక్కటే కాదు. దూరదృష్టితో చూడాలి. పెద్ద పెద్ద సంస్థలే ఈ కామర్స్ ద్వారా ఎన్నో లక్సల మందికి ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ఎందరికో లైఫ్ లైన్ లాగా ఉపయోగపడుతున్నాయి. పెద్ద ఆర్థిక వ్యవస్థను, పెద్ద పెద్ద టెక్నాలజీని తీసుకురాగల శక్తి పెద్ద సంస్థలకే ఉంది. అది ధరలను కూడా తక్కువ చేస్తాయి. దీని వల్ల వినియోగదారులకు లాభం జరుగుతుంది.

  దేశ ఆర్థిక వ్యవస్థను నడపడంలో అవి మెయిన్ ఇంజిన్ లాంటివి. దేశం అభివృద్ధి చెందడానికి చమురును అందిస్తాయి. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు అవే పెట్టగలవు. పెద్ద పెద్ద సాంకేతికతను తీసుకురాగలవు. ఒక పెద్ద కంపెనీ ఉంటే, దానికి అనుబంధంగా ఎన్నో చిన్న చిన్న కంపెనీలు వస్తాయి. ఆ చిన్న కంపెనీలే మెల్ల మెల్లగా పెద్ద సంస్థలుగా ఎదుగుతాయి. అయితే, ఈ ప్రక్రియను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉంది. భారత్ అభివృద్ధి చెందాలంటే చిన్న చిన్న ఉత్పత్తిదారుల కంటే కూడా భారీ సంస్థలను కాపాడాలి. పెద్ద సంస్థలకు థాంక్స్ చెప్పాలి.

  భారత్ లో చిన్న చిన్న సంస్థలు పెద్దగా ఎదిగేంత వరకు ఉండాలంటే, ముందు పెద్ద సంస్థలను ఆ పని చేయనివ్వాలి. అన్ని ప్రభుత్వాలకు ఈ విషయం తెలుసు. అందుకే వారు అవలంభించే పాపులర్ ప్రసంగాలకూ, వాస్తవంలో పాలసీలకు మధ్య అంతరం ఉంటుంది. ప్రసంగాల వల్ల సమస్యలు కూడా సమస్యలు వస్తాయి. ఇది పెద్ద సంస్థలను దెబ్బతీయడం ఆపాల్సిన సమయం.

  కొత్త వ్యవసాయ సంస్కరణల చట్టాలు సహజంగా పెద్ద సంస్థలు రైతులతో జట్టు కట్టడానికి దోహదపడతాయి. గతంలో కూడా చైనా, మరికొన్ని దేశాల్లో విజయవంతంగా జరిగింది. భారీ పెట్టుబడులు, అత్యాధునిక తయారీ అనేవి అందుబాటులో లేకపోవడం వల్ల నిరుద్యోగులకు సమస్యగా మారుతోంది. వ్యవసాయంలో పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పేదల విషయంలో అహంభావం, మొసలి కన్నీళ్లు కార్చడం మానాలని కూడా మరికొందరు చెబుతారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఒకటే మార్గం. అది క్యాపిటలిస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్. అదే మాస్‌కు ముఖ్యమైంది. మిగిలిన ప్రత్యామ్నాయాలు ఏవీ విజయవంతం కాలేదు. మనం ఉత్తర కొరియా లాగా ముగియకూడదు.

  మన యాటిట్యూడ్ అర్జంటుగా మార్చుకోవాల్సిన పని లేదు. లక్షలు ఖర్చు పెట్టి రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రపంచ ఉత్పత్తి కర్మాగారంగా భారత్‌ను మార్చాలంటే ఒక తలుపు తెరిచి ఉంది. ప్రస్తుతం చైనాతో ఉన్న విబేధాల పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం. అయితే, అది విజయవంతం అవుతుందని గ్యారెంటీ ఇవ్వలేం. అయితే, అభివృద్ధి అనేది పెద్ద ప్రక్రియ. అభివృద్ధికి సంబంధించిన సంక్లిష్టతలను నిర్వహించడం క్లిష్టమైనది. అందులో చాలా విషయాలు తప్పు పోవచ్చు. కానీ, మన పాలసీల ద్వారా ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలి.

  ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విధి ఏంటంటే, క్యాపిటల్ డెవలప్‌మెంట్ చేయాలి. క్యాపిటలిస్ట్ విధానాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులు వారి కమ్యూనిస్టు మేనిఫెస్టో పదాలు చదువుకోవాలి. దీని వల్ల పేదలకు కూడా వెంటనే లబ్ధి జరుగుతుంది. పెద్ద సంస్థలే పెద్ద పెట్టుబడులు పెట్టి, ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి. అదే సమయంలో రాష్ట్రాలు సామాజిక భద్రత కోసం కావాల్సినంత కొనుగోలు చేయవచ్చు.

  ఆసియాలో అది పెద్ద బిజినెస్ మోడల్స్ ఏం ఉన్నాయి? జపాన్‌లో జియాబట్సు, దక్షిణ కొరియాలో చావోబోల్స్, ఎయిర్ బస్, మెక్ లీన్, హుందై, ఎన్ఈసీ, సాంసంగ్, సింగపూర్ ఎయిర్ లైన్స్, ఫోక్స్ వ్యాగన్, ఎల్‌జీ అన్నీ నేషనల్ ఛాంపియన్స్. నేషనల్ ఛాంపియన్స్‌ను తయారు చేసేందుకు 1990ల్లోనే చైనా తమ పాలసీలను మార్చుకుంది. దాని ఫలితమే హువాయ్. వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన సమయం.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Farmers Protest, New Agriculture Acts

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు