టాలెంట్ ఉంటే పండగే... సీనియర్ ఉద్యోగులను కాపాడుకుంటున్న ఐటీ కంపెనీలు

IT companies offer better hikes : అన్ని ఐటీ కంపెనీలూ... ఉన్న ఉద్యోగుల్లో టాలెంట్ పెంచేందుకే ప్రయత్నిస్తున్నాయి. జూనియర్ లెవెల్ ఉద్యోగులకు రిటెన్షన్ బోనస్ కింద రూ.లక్ష ఇస్తోంది విప్రో కంపెనీ. వారిలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 17, 2019, 8:24 AM IST
టాలెంట్ ఉంటే పండగే... సీనియర్ ఉద్యోగులను కాపాడుకుంటున్న ఐటీ కంపెనీలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏప్రిల్ నుంచీ జూన్ మధ్య మొదటి క్వార్టర్‌లో ఐటీ కంపెనీలు మంచి పెర్ఫార్మెన్స్ చూపించాయి. మంచి ఉద్యోగులు, టాలెంట్ ఉన్న వాళ్లూ... కంపెనీని వదిలి వెళ్లిపోతే... వారి స్థానంలో వచ్చే కొత్త వారిని... తమకు అనుకూలంగా మార్చుకోవడానికీ, ట్రైనింగ్ ఇవ్వడానికీ చాలా ఎక్కువ ఖర్చు అవుతోందనీ, టైమ్ కూడా చాలా వేస్ట్ అవుతుందనీ, ఆ ప్రభావం కంపెనీ పెర్ఫార్మెన్స్‌పై పడుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఎక్కువ అట్రిషన్ రేటు సాధించేందుకు ఇన్ఫోసిస్... చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు నేతృత్వంలో... ఓ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. ఇలా హై అట్రిషన్ రేటు సాధిస్తున్న కంపెనీలు... తమ సంస్థలో హై-పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఉద్యోగులను బయటకు వెళ్లకుండా కాపాడుకుంటున్నాయి. అలాగే... కొత్తగా వచ్చే యంగ్ ఉద్యోగులను సంస్థలోకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే... కొత్తవారు వస్తే... వాళ్లకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్లు సంస్థకు అలవాటు పడేలా చెయ్యాలి... ఇదంతా టైమ్ వేస్ట్ అని సంస్థలు భావిస్తున్నాయి.

ఉద్యోగులు కంపెనీ వీడకుండా ఉండేందుకు యాజమాన్యాలు... టాప్ టాలెంటీర్లకు శాలరీలను పెంచుతున్నాయి. ప్రమోషన్లు, బోనస్‌లూ ఇస్తున్నాయి. ఓవరాల్‌గా ఉద్యోగుల వాల్యూ పెరిగేలా చేస్తున్నాయి. వారి కెరీర్ మెరుగయ్యేందుకు... ఎప్పటికప్పుడు వారికే రీస్కిల్లింగ్ అవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తంగా ఐటీ పరిశ్రమ మొదటి క్వార్టర్‌లో 1 శాతం ఎక్కువ అట్రిషన్ రేటు చూపించింది. ఇందుకు కారణం ఉన్న ఉద్యోగులు కొత్త స్కిల్స్ నేర్చుకొని టాలెంట్ పెంచుకోవడం, ఐటీ సంస్థలు... టైయర్ 2 సిటీలకు కూడా విస్తరిస్తుండటమే.

3 నుంచీ 7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. వారికి ఎక్స్‌పీరియన్స్‌తోపాటూ... ప్రీమియం స్కిల్స్ ఉంటున్నాయి. టాప్ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్... మొదటి క్వార్టర్‌లో ఎక్కువ అట్రిషన్ రేటు కలిగివున్నాయి. కాగ్నిజెంట్ అట్రిషన్ రేటు 19 శాతం నుంచీ 23 శాతానికి పెరిగింది. ఇన్ఫోసిస్ రేటు 20.4 నుంచీ 23.4 శాతానికి పెరిగింది. విప్రో రేటు 16 నుంచీ ఒక శాతం పెరిగి... 17.6 శాతానికి చేరింది. ఇలాంటి పరిస్థితుల మధ్య హై పెర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ల శాలరీలు 30 నుంచీ 40 శాతం దాకా పెరుగుతున్నాయి. ఇది ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు కలిసొచ్చే అంశం.
First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading