Home /News /business /

IT COMPANIES LIKE TCS INFOSYS AND WIPRO HIKED SALARIES THIS YEAR TO AVOID ATTRITION AK GH

Salary Hike: ఐటీ ఉద్యోగుల జీతాలు పెంచిన ప్రముఖ ఐటీ కంపెనీలు.. అసలు కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత కొన్ని నెలలుగా ఐటీ రంగంలో అధిక అట్రిషన్ రేట్‌ (ఉద్యోగ వలసలు) నమోదవుతూ వస్తుంది. ఇది టెక్ కంపెనీలకు తలనొప్పిగా మారింది. దీంతో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల వలసలను అరికట్టడానికి విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కంపెనీలకు జీతాల పెంపు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ప్రకటించాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
గత కొన్ని నెలలుగా ఐటీ రంగంలో అధిక అట్రిషన్ రేట్‌ (ఉద్యోగ వలసలు) నమోదవుతూ వస్తుంది. ఇది టెక్ కంపెనీలకు తలనొప్పిగా మారింది. దీంతో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల వలసలను అరికట్టడానికి విప్రో,(Wipro) ఇన్ఫోసిస్,(infosys) టీసీఎస్(TCS) వంటి కంపెనీలకు జీతాల పెంపు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ప్రకటించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు కంపెనీలో కొనసాగేందుకు ఐటీ సంస్థలు అందిస్తున్న ప్లాన్‌లను పరిశీలిద్దాం.

* విప్రో
మింట్ రిపోర్ట్ ప్రకారం.. విప్రోలో జీతాల పెంపు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానుంది. ‘వేతనాల పెంపుపై మా మునుపటి ప్రకటనలో ఎటువంటి మార్పు లేదు. మా ఉద్యోగుల జీతాల పెంపు సెప్టెంబర్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తుంది. మా ఉద్యోగుల కోసం జులై ప్రారంభం నుంచే అనేక ప్రమోషన్లు కల్పించాం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి మిడ్-మేనేజ్‌మెంట్ స్థాయి వరకు త్రైమాసిక ప్రమోషన్లను అందించాలని నిర్ణయించాం.’ అని విప్రో పేర్కొంది. కొన్ని బ్యాండ్‌ల ఉద్యోగులకు జీతాల పెంపు వర్తించదని పలు రిపోర్ట్స్ వెల్లడించడంతో విప్రో ఇలా స్పందించింది.

* ఇన్ఫోసిస్
అట్రిషన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, మరోక ఐటీ మేజర్ కంపెనీ ఇన్ఫోసిస్ జీతాలను పెంచుతోంది. ఇది సంస్థ సమీప-టైమ్ మార్జిన్‌లను ప్రభావితం చేస్తుంది. గత త్రైమాసికంలో 27.7 శాతంతో పోలిస్తే జూన్ 2022 త్రైమాసికంలో 28.4 శాతానికి పెరిగిన అట్రిషన్ రేటును తగ్గిస్తామని కంపెనీ విశ్వసిస్తోంది.



క్యూ1 ఫలితాలను ప్రకటిస్తూ, ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ ఇలా స్పందించారు. “మేము హైరింగ్, కాంపిటేటివ్ కాంపెన్సేటివ్ రివిజన్‌ల ద్వారా ప్రతిభావంతులలో వ్యూహాత్మక పెట్టుబడులతో బలమైన వృద్ధి నమోదు చేస్తున్నాం. ఇది తక్షణ కాలంలో మార్జిన్‌లపై ప్రభావం చూపినప్పటికీ, అట్రిషన్ స్థాయిలను తగ్గించి, భవిష్యత్తు వృద్ధికి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. కంపెనీ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడం కోసం మేం వివిధ కాస్ట్ లివర్లను ఆప్టిమైజ్ చేస్తూనే ఉంటాం.’’ అని రాయ్ తెలిపారు.

ITR Filling: రివైజ్డ్‌, అప్‌డేటెడ్, బిలేటెడ్‌ రిటర్న్‌ అంటే ఏంటి? వాటి మధ్య తేడాలు ఏంటి..?

Railway: చిన్న పిల్లలకు రైలులో టికెట్ తీసుకోవాలా ?.. క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

* టీసీఎస్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టీసీఎస్ 19.7 శాతం అధిక అట్రిషన్ రేటును నమోదు చేసింది. దీంతో తన ఉద్యోగులకు 5-8 శాతం మధ్య జీతాలను పెంచుతున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఉద్యోగులకు 8 శాతం వరకు జీతం పెంచినట్లు టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీస్ మిలింద్ లక్కడ్ తెలిపారు. “మా వార్షిక పరిహారం సమీక్షను అనుసరించి, ఉద్యోగులకు 5 నుంచి 8 శాతం వరకు జీతాలను పెంచాం. అగ్రశ్రేణి పనితీరు చూపినవారు జీతంలో మరింత పెరుగుదల పొందారు. సంస్థ సాధికారత, పనితీరు-ఆధారిత పని సంస్కృతి కీలక మార్కెట్‌లలో స్థానిక ప్రతిభను ఆకర్షించడంలో మాకు సహాయపడుతుంది.’’ అని మిలింద్ పేర్కొన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: IT Employees, Salary Hike

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు