IT AMENDMENTS THESE ARE THE TOP INCOME TAX AMENDMENTS IN BUDGET 2022 MUST KNOW ABOUT THAT GH VB
IT Amendments: బడ్జెట్ 2022లో చేసిన టాప్ ఇన్‌కమ్ ట్యాక్స్ సవరణలు ఇవే.. వీటి గురించి తప్పక తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2022ని లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రభుత్వం ఈ బడ్జెట్‌కి కొన్ని సవరణలను లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2022ని లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రభుత్వం(Government) ఈ బడ్జెట్‌కి కొన్ని సవరణలను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సాధారణంగా ప్రజల, నిపుణుల అభిప్రాయాన్ని అనుసరించి, ప్రభుత్వం తన బడ్జెట్(Budget) ప్రతిపాదనల్లో సవరణలను ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా ఈరోజు లోక్‌సభలో సవరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్(Tax Experts) అభిప్రాయం ప్రకారం, ఈ సవరణల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కి(Income Tax) సంబంధించి కొన్ని ముఖ్య సవరణలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. లాస్ రిటర్న్‌ను కూడా అప్‌డేట్ చేయొచ్చు
అప్‌డేటెడ్ రిటర్న్ అనేది బడ్జెట్ 2022లో ప్రవేశపెట్టబడిన ఒక నిబంధన. ఇది కొంతమేర ఆదాయాన్ని ప్రకటించడం మిస్సయిన వ్యక్తులకు అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన 2 సంవత్సరాలలోపు అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి అనుమతిస్తుంది. ఈరోజు ప్రవేశపెట్టిన సవరణలు ఈ ఫెసిలిటీని లాస్ రిటర్న్ కు కూడా విస్తరించాయి. లాస్ రిటర్న్ అంటే నికర నష్టాన్ని (Net Loss) ప్రకటించడం. అప్‌డేటెడ్ రిటర్న్‌లో మీరు అనుకోకుండా మిస్సయిన ఆదాయాన్ని చేర్చవచ్చు.
దానిపై పన్ను, పెనాల్టీని చెల్లించవచ్చు. అయితే సవరించిన ఫైనాన్స్ బిల్లు అనేది లాస్ రిటర్న్‌ను దాఖలు చేసిన వ్యక్తులు కూడా లాస్ అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఫిల్ చేయడానికి అనుమతిస్తుంది. ఐతే అప్‌డేటెడ్ రిటర్న్‌లో పాజిటివ్ ఇన్‌కమ్ ప్రకటిస్తేనే.. లాస్ రిటర్న్‌ను అప్‌డేట్ చేయడం కుదురుతుంది.
2. అసెస్‌మెంట్‌ల టైం లిమిట్ పొడగింపు
అసెస్‌మెంట్‌లను పూర్తి చేసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన టైం లిమిట్ ను ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. AY 2020-21కి సంబంధించిన అసెస్‌మెంట్‌లను అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 1 సంవత్సరంలోపు పూర్తి చేయాలి. అది మార్చి 31, 2022 అవుతుంది. అయితే AY 2021-22 నుంచి టైం లిమిట్ ను 9 నెలలకు కుదించారు. అయితే, ఈరోజు సమర్పించిన సవరణలలో AY 2020-21 కోసం అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను పూర్తి చేయడానికి టైం లిమిట్ ను పొడిగించారు.
AY 2020-21 (FY 2019-20) కోసం అసెస్‌మెంట్‌లను 31 మార్చి 2022 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కాగా సవరించిన ఫైనాన్స్ బిల్లు టైం లిమిట్ ను సెప్టెంబర్ 30, 2022కి పెంచింది.
3. క్రిప్టో లాభాలు లేదా నష్టాలనుచూపడానికి వీలు లేదు
ఒక క్రిప్టోకరెన్సీలో వచ్చే నష్టాలను మరొకదానిలో లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయలేమని ఈ రోజు లోక్ సభలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక క్రిప్టోకరెన్సీలో మీకు బాగా లాభాలు వస్తే వాటిపై ట్యాక్స్ కట్టడం తప్పనిసరి. ఒకవేళ వేరే క్రిప్టోకరెన్సీలో మీకు నష్టాలు వచ్చినా.. ఆ నష్టాలను మైనస్ చేసి మిగిలిన లాభాలపై మాత్రమే పన్ను చెల్లిస్తామంటే కుదరదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.