హోమ్ /వార్తలు /బిజినెస్ /

RIL AGM 2020 | అదే నా కల అంటున్న నీతా అంబానీ...

RIL AGM 2020 | అదే నా కల అంటున్న నీతా అంబానీ...

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ

Nita Ambani | రాబోయేరోజుల్లో ఈషా అంబానీ, ఆమె టీమ్ రిలయన్స్ ఫౌండేషన్ సేవలను పదింతలు పెంచాలని నీతా అంబానీ ఆకాంక్షించారు.

  ఒలింపిక్స్‌ను భారత్‌కు తీసుకురావడం తన కల అని ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎం సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ మీటింగ్‌ను వర్చువల్‌గా నిర్వహించారు. వర్చువల్ మీటింగ్‌లో షేర్ హోల్డర్లతో మాట్లాడిన ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఒలింపిక్స్‌ను భారత్‌కు తీసుకురావడం తన కల అని అన్నారు. ఆమె ప్రసంగంలో హైలైట్స్..

  కరోనా ప్రబలిన తర్వాత మన మొట్టమొదటి ఛాలెంజ్ పీపీఈ కిట్లు. రికార్డు సమయంలో వాటిని తయారు చేశాం. రోజుకు లక్ష పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు తయారు చేశాం.

  భారతీయుల సేవలో రిలయన్స్ ఫౌండేషన్ ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకోబోతోంది. ఈ దశాబ్దంలో గ్రామీణ ప్రాంతాల్లోని 36 మిలియన్ల మందికి సేవలు అందించింది.

  రాబోయేరోజుల్లో ఈషా అంబానీ, ఆమె టీమ్ కలసి దీన్ని పదింతలు వృద్ధి చేయాలని కోరుకుంటున్నా.

  కరోనా సమయంలో ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న వాహనాలకు రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో ఉచిత చమురు కూడా అందించాం. ఇది మాకు వ్యాపారం కాదు. దేశానికి మా బాధ్యత. మా ధర్మం. మా సేవ

  కరోనా వైరస్ ప్రబలిన వెంటనే కేవలం రెండు వారాల్లో భారత్‌లో 100 పడకల ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రిని ముంబైలో ఏర్పాటు చేశాం. మా ధైర్యవంతులైన డాక్టర్లు, నర్సులు కోవిడ్ పేషెంట్లకు నిరంతరం సేవలు అందిస్తున్నారు.

  కరోనా మీద యుద్ధం కొనసాగుతుంది. జియో డిజిటల్ మౌలిక సదుపాయాల సాయంతో కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రభుత్వం, లోకల్ మున్సిపాలిటీలతో రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం అవుతుంది.

  కరోనాకి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అదే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సాయంతో దేశంలోని ప్రతి మూలకు కరోనా వ్యాక్సిన్ చేరేలా మేం కృషి చేస్తాం.

  రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన మిషన్ అన్నసేవ అనేది ప్రపంచంలోనే ఓ కార్పొరేట్ ఫౌండేషన్ చేపట్టడం మొదటిసారి.

  పేదలు, రోజువారీ కూలీలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మిషన్ అన్నసేవ ద్వారా 5 కోట్ల భోజనాలు అందించాం.

  జియో డిజిటల్ సత్తాను వినియోగించుకుని ప్రతి భారతీయుడికి తక్కువ ధరకే వైద్యం, విద్య అందించేలా చూడడం.

  రిలయన్స్ ఫౌండేషన్ తరఫున విద్య, క్రీడల్లో కలపి మొత్తం 21.5 మిలియన్ల పిల్లలకు సాయం చేసింది. కిందిస్థాయి నుంచి అత్యున్నత స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ తయారు చేస్తోంది

  రిలయన్స్ జియో 40 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ కనెక్టివిటీ అందిస్తోంది. 30,000 సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సేవలు అందిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఇంటి వద్ద నుంచి చదువుకుంటున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Nita Ambani, Reliance, Reliance Foundation, Reliance Industries, Reliance Jio, Reliance JioMart

  ఉత్తమ కథలు