Anand Piramal | బిలియనీర్ ముకేశ్ అంబానీ తాత అయ్యారు. తన గారాలపట్టి ఇషా (Isha) అంబానీ కవలకు జన్మనిచ్చారు. దీంతో అంబానీ (Ambani), పిరమల్ ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయని చెప్పుకోవచ్చు. ‘దేవుడి ఆశీర్వాదాలతో మా పిల్లలు ఇషా, ఆనంద్ పిరమల్ నవంబర్ 19న కవలలను పొందారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము’ అని అంబానీ, పిరమల్ కుటుంబాలు తెలియజేశాయి.
మీడియా స్టేట్మెంట్ ప్రకారం చూస్తే.. ఇషా అంబానీకి ఒక బాబు, ఒక పాప పుట్టారని చెప్పుకోవచ్చు. ఇషా, కవల పిల్లలు ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. అమ్మాయికి ఆదియా అని పేరు పెట్టారు. అలాగే అబ్బాయికి కృష్ణ అని నామకరణం చేశారు. ‘ఆదియా, కృష్ణ, ఇషా, ఆనంద్‌ల జీవితంలో ఈ అత్యంత ముఖ్యమైన దశలో మేము మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాము’ అని తెలియజేశారు.
బంగారం, వెండి ధరలు ఢమాల్? భారీగా పతనం కానున్న గోల్డ్, సిల్వర్ రేట్లు!
కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీకి, పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో 2018 డిసెంబర్ 12న వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా పిరమల్ అనేది హెల్త్ కేర్ బిజినెస్ గ్రూప్ అని మనకు తెలిసిందే.
జీరో డౌన్ పేమెంట్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. 45 నిమిషాల్లోనే లోన్!
ఇకపోతే ఇషా అంబానీని ముకేశ్ అంబానీ ఇటీవలనే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్‌గా నియమించారు. ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలలో ఇషానే చివరి సంతానం. ఇషా అంబానీ ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. ఉన్నత చదువుల విషయానికి వస్తే.. ఈమె యేల్ యూనివర్సిసటీ ఆఫ్ అమెరికా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సైకాలజీ చదివారు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియాలో ఎంబీఏ పూర్తి చేశారు. అమె సంపద విషయానికి వస్తే.. ఇషా అంబానీ సంపద విలువ 2018లో 70 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పుకోవచ్చు. ఈమె రిలయన్స్ సామ్రాజ్యంలో చేరడానికి ముందు అమెరికాలోని మెకన్సీ అండ్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా కూడా పని చేశారు.
2015లో ఈమె తొలిసారిగా ఆసియా 12 మోస్ట్ పవర్ఫుల్ అప్‌కమింగ్ బిజినెస్ ఉమెన్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. రిలయన్స్ జియో ఇషా తొలి ప్రాజెక్ట్. రిలయన్స్ జియో విజయవంతం అవ్వడంతో ఈమె పాత్ర కూడా ఉందని చెప్పుకోవాలి. తర్వాత ఈమె రిలయన్స్ రిటైల్‌పై ఫోకస్ చేశారు. అలాగే ఈమె సారథ్యంలోనే అజియో కూడా ప్రారంభించారు. రిలయన్స్ గ్రూప్ మల్టీ బ్రాండ్ ఇకామర్స్ ప్లాట్‌ఫామ్ ఇది. కాగా ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ , శ్లోకా మెహతా జంటకు 2020 డిసెంబర్ 10న కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూతురికి కవలలు పుట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Isha Ambani, Mukesh Ambani