తక్కువ వేతనం పొందుతున్న అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ పథకాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM పేరుతో సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ప్రారంభమై రెండేళ్లైంది. కానీ ఇప్పటి వరకు 44 లక్షల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే చేరారు. ప్రతీ ఏటా 2 కోట్ల చొప్పున ఐదేళ్లలో 10 కోట్ల మందిని ఈ స్కీమ్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రెండేళ్లలో కేవలం 44 లక్షల మంది మాత్రమే చేరారు. అంటే ఏటా 22 లక్షల మంది మాత్రమే చేరారు. ఏటా 2 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే కేవలం 22 లక్షల మంది చేరడం చూస్తుంటే ఈ పథకం టార్గెట్‌కు దరిదాపుల్లో కూడా లేదని అర్థమవుతోంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్-ILO లెక్కల ప్రకారం భారతదేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటారని అంచనా. కానీ వారిలో ఇప్పటివరకు కేవలం 1 శాతం మంది మాత్రమే ఈ పథకంలో చేరారు. ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం వల్లే సబ్స్క్రైబర్లు తక్కువగా చేరుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.
Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా
EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు
ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్-PMSYM స్కీమ్‌ను 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. అసంఘటిత రంగంలో పనిచేస్తూ రూ.15,000 లోపు వేతనం పొందుతున్నవారు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. లబ్ధిదారులకు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ప్రతీ నెల కొంత మొత్తం ఈ స్కీమ్‌కు చెల్లించాలి. వయస్సును బట్టి జమ చేయాల్సిన మొత్తం మారుతుంది. కనీసం రూ.55 నుంచి రూ.200 మధ్య చెల్లించాలి. లబ్ధిదారులు ఎంత జమ చేస్తే ప్రభుత్వం కూడా వారి అకౌంట్లో అంతే మొత్తం జమ చేస్తుంది. లబ్ధిదారులకు 60 ఏళ్ల నుంచి జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. లబ్ధిదారులు మరణిస్తే వారి జీవితభాగస్వామికి జీవితాంతం సగం పెన్షన్ లభిస్తుంది.
Doorstep Banking Services: ఈ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు
HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయొచ్చు ఇలా
సంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF పథకం ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్ ధన్ పథకం కూడా అలాంటిదే. ఇది అసంఘటిత రంగ కార్మికుల కోసం రూపొందించిన స్కీమ్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC, న్యూ పెన్షన్ స్కీమ్-NPS లాంటి పథకాల్లో కవర్ కానివారి కోసం మాత్రమే ఈ స్కీమ్. చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, పనిమనుషులు, వీధి వ్యాపారులు, చిరువ్యాపారులు... ఇలా అసంఘటిత రంగంలో పనిచేసేవారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో జమ చేసిన మొత్తానికి 8 శాతం వడ్డీ వస్తుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ కార్యాలయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయాల్లో ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:December 26, 2020, 17:18 IST