Home /News /business /

IS YOUR PPF ACCOUNT DEACTIVATED KNOW HOT TO REVIVE INACTIVE PPF ACCOUNT SS GH

PPF Account Activation: పీపీఎఫ్ ఖాతాను యాక్టివేట్ చేయటం చాలా ఈజీ... ఎలాగో తెలుసుకోండి

PPF Activation: పీపీఎఫ్ ఖాతాను యాక్టివేట్ చేయటం చాలా ఈజీ... ఎలాగో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

PPF Activation: పీపీఎఫ్ ఖాతాను యాక్టివేట్ చేయటం చాలా ఈజీ... ఎలాగో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

PPF Account Activation | మీ PPF ఖాతా ఇనాక్టీవ్ అయిందనే బాధ వద్దు. ఎందుకంటే ఇనాక్టీవ్ అయిన ఖాతాను యాక్టివేట్ చేస్తే మీరు పొదుపు చేసుకున్న మొత్తానికి వడ్డీ లభిస్తుంది. ఎలాగో తెలుసుకోండి.

మీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా స్తంభించిందని దిగులు పడకండి. ఎందుకంటే దీన్ని పునరుద్ధరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇన్ యాక్టివ్ అయిన ఖాతాను యాక్టివేట్ చేయాలంటే మినిమమ్ డిపాజిట్ చేస్తే సరి. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో కనీసం 500 రూపాయలు మీ ఖాతాలో జమ చేయనందుకు మీ ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఏటా ఓ 500 రూపాయలు జమచేస్తే మీ ఖాతా యాక్టివ్ గా ఉంటుంది. మనదేశంలో ఇలా ఇన్ యాక్టివ్ గా ఉన్న ఖాతాల సంఖ్య చాలానే ఉన్నాయి. దీర్ఘకాలిక పొదుపులో మంచి లాభాలు రిటర్న్స్ గా ఇచ్చే పీపీఎఫ్ ఖాతాలు చక్కని సంప్రదాయ పొదుపు పథకాలుగా మనదేశంలో ఆదరణ లభిస్తోంది.

ఇన్ యాక్టివ్ అయిన ఖాతాను యాక్టివేట్ చేసేందుకు ముందు మీరు రాతపూర్వకంగా ఓ అప్లికేషన్ ఫారం సమర్పించాలి. దీన్ని మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపన్ చేసిన బ్యాంకు లేదా పోస్టాఫీసుకు సమర్పించాలి. 15 ఏళ్ల కాలవ్యవధిలో మీరు ఎప్పుడైనా దీన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ గా 500 రూపాయలు చెల్లించి, పెనాల్టీగా 50 రూపాయల మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెక్ ను అప్లికేషన్ తో పాటు బ్రాంచ్ లో సమర్పిస్తే సరి. ఇలా మీరు అప్లికేషన్ సమర్పించాక బ్యాంకు లేదా పోస్టాఫీసు మీ అప్లికేషన్ ను స్క్రూటినీ చేస్తుంది. ఇలా వెరిఫై చేశాక మీ పీపీఎఫ్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఒకవేళ 15 ఏళ్ల గడువు దాటిపోయిన అకౌంట్ ఇన్ యాక్టివ్ గా ఉంటేమాత్రం దాన్ని యాక్టివేట్ చేయటం కుదరదు. అలాంటప్పుడు మెచ్యూరిటీ మొత్తాన్ని తీసుకునేందుకు అకౌంట్ హోల్డర్ పెనాల్టీ చెల్లించి, మెచ్యూరిటీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలి.

Gold Price: బంగారం ధర రికార్డు పతనం... రూ.8,000 తగ్గిన గోల్డ్ రేట్

Bank Account: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు

చాలా ఈజీ


పీపీఎఫ్ అకౌంట్లను ఆపరేట్ చేయడం మరింత సులభతరం చేసేందుకు ఈ సేవలను ఆన్ లైన్లో (PPF online) కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీసు లేదా బ్యాంకు యాపుల్లో ఇప్పుడు పీపీఎఫ్ ను మేనేజ్ చేసుకోవచ్చు.

దీర్ఘకాలిక పెట్టుబడుల్లో అత్యుత్తమం


దీర్ఘకాలిక పెట్టుబడుల్లో స్కీమ్స్‌లో పీపీఎఫ్‌ ఉత్తమమైనది. ఏడాదికి గరిష్ఠంగా లక్షన్నర వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పీపీఎఫ్‌ వడ్డీ రేటును ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరిస్తుంది.

Gold: బంగారు నగలు కొంటే పాన్ కార్డ్ ఇవ్వాలా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

SBI: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకున్నవారికి శుభవార్త

పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు


పూర్తి పన్ను రహిత వడ్డీని ఈ పీపీఎఫ్‌ ద్వారా ఆర్జించే వీలుంటుంది. ప్రతి ఏటా మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తానికి వడ్డీని కలుపుతుంటారు. అయితే అప్పటికప్పుడు రిటర్న్స్‌ ఇందులో సాధ్యం కాదు. దీర్ఘకాలంలో మంచి లాభాలు ఉంటాయి. ఇలా విత్ డ్రా చేసిన మొత్తానికి సెక్షన్ 80సీ కింద ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Investment Plans, Personal Finance, PPF, Save Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు