Aadhaar: ఆధార్ కార్డులో మీ ఫోటో బాగాలేదా? ఇలా మార్చుకోవచ్చు

Aadhaar Photo Update | సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ద్వారా ఫోటో మార్చొచ్చు. లేదా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో ఫోటో అప్‌డేట్ చేయొచ్చు.

news18-telugu
Updated: June 2, 2019, 9:54 AM IST
Aadhaar: ఆధార్ కార్డులో మీ ఫోటో బాగాలేదా? ఇలా మార్చుకోవచ్చు
Aadhaar: ఆధార్ కార్డులో మీ ఫోటో బాగాలేదా? ఇలా మార్చుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 2, 2019, 9:54 AM IST
ఆధార్ కార్డులో మీ ఫోటో ఎలా ఉంది? ఈ ప్రశ్న ఎవర్ని అడిగినా వామ్మో అంటారు. ఆధార్ కార్డుపై ప్రింట్ అయ్యే ఫోటోకి, ఒరిజినల్ ఫేస్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ కాబట్టి ఫోటో ఎలా వచ్చినా అలాగే సర్దుకుపోతుంటారు. ఇకపై అలా సర్దుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీ ఆధార్‌ పైన ఉన్న ఫోటోను మార్చుకోవచ్చు. ఇందుకోసం రెండు మార్గాలున్నాయి. సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ద్వారా చేయొచ్చు. లేదా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో ఫోటో అప్‌డేట్ చేయొచ్చు. అయితే ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ ఫోటో మార్చడం సాధ్యం కాదు.

Read this: New Rules: జూన్‌లో కొత్త రూల్స్... మీరు తెలుసుకోవాల్సిన 6 నిబంధనలివే

ఆధార్ కార్డులో ఫోటో మార్చడానికి మొదటి మార్గం



UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మీ వివరాలతో ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ నింపాలి.


ఆ ఫామ్ తీసుకొని దగ్గర్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి.
ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ సిబ్బందికి దరఖాస్తు ఫామ్‌తో పాటు బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
Loading...
మీ వివరాలను పోల్చి చూసిన తర్వాత మీ లేటెస్ట్ ఫోటోను తీసుకుంటారు ఎన్‌రోల్‌మెంట్ సిబ్బంది.
మీ ఫోటో అప్‌డేట్ చేయడానికి రూ.25+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్‌(URN)తో ఉండే ఎక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ తీసుకోవాలి.
మీ ఆధార్ అప్‌డేట్ స్టేటస్‌ను URN ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Read this: SBI Jobs: ఎస్‌బీఐలో 579 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

ఆధార్ కార్డులో ఫోటో మార్చడానికి రెండో మార్గం


ఒకవేళ మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లే అవకాశం లేకపోతే UIDAI కార్యాలయానికి లెటర్ రాసి ఫోటో అప్‌డేట్ చేయొచ్చు.
UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆధార్ డేటా అప్‌డేట్ కరెక్షన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మీ వివరాలన్నీ ఆధార్ డేటా అప్‌డేట్ కరెక్షన్ ఫామ్‌లో రాయాలి.
మీ ఆధార్ ఫోటో మార్చాలని కోరుతూ UIDAI రీజనల్ కార్యాలయానికి దరఖాస్తు రాయాలి.
దరఖాస్తు ఫామ్‌తో పాటు కొత్త ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ జత చేయాలి.
ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత మీ అడ్రస్‌కు 15 నుంచి 20 రోజుల్లో కొత్త ఆధార్ కార్డ్ వస్తుంది.

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి
First published: June 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...