• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • IS YOUR PAN CARD NOT LINKED WITH YOUR AADHAAR NUMBER PAN CARD WILL BE DEACTIVATED AFTER AUGUST 31 SS

PAN-Aadhaar Link: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదు... ఆగస్ట్ 31 డెడ్‌లైన్

PAN-Aadhaar Link: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదు... ఆగస్ట్ 31 డెడ్‌లైన్

PAN-Aadhaar Link: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదు... ఆగస్ట్ 31 డెడ్‌లైన్ (ప్రతీకాత్మక చిత్రం)

PAN-Aadhaar Link | ఆగస్ట్ 31 లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు డీయాక్టివేట్ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

  • Share this:
    మీరు మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయలేదా? అయితే ఆగస్ట్ 31 నుంచి మీ పాన్ కార్డు చెల్లదు. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డుల్ని డీయాక్టివేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం పాన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్‌ను ఉపయోగించొచ్చని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ కార్డ్, ఆధార్ కార్డుల్ని ఇంటర్‌ఛేంజబుల్ చేస్తున్నట్టు తెలిపారు. అంటే ఆధార్ కావాల్సిన చోట పాన్ కార్డ్, పాన్ నెంబర్ అవసరమైన చోట ఆధార్ కార్డు వాడుకోవచ్చు. పాన్ కార్డ్ స్థానంలో ఆధార్ నెంబర్ వాడుకోవచ్చంటే ఇక పాన్ కార్డు అవసరం లేదని కాదు. దీనిపై ఇంతకముందే ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. పాన్ కార్డుల జారీ ప్రక్రియ ఎప్పట్లాగే కొనసాగుతుంది.

    ఇక పాన్ కార్డులను ఆధార్‌తో లింక్ చేయాలన్న నిబంధన కొనసాగుతుంది. అంతేకాదు... ఆగస్ట్ 31 లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు డీయాక్టివేట్ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న పాన్ కార్డుల్ని సాఫీగా ఉపయోగించుకోవడానికి ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సిందే. పాన్ కార్డు లేనివాళ్లు, పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయనివాళ్లు ఆధార్ నెంబర్‌తో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వారికి వెంటనే వర్చువల్ పాన్ నెంబర్ జెనరేట్ అవుతుంది. ఆ పాన్ నెంబర్ ఆటోమెటిక్‌గా ఆధార్ నెంబర్‌తో లింక్ అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 40 కోట్లకు పైగా పాన్ కార్డులు జారీ అయ్యాయి. వాటిలో 22 కోట్ల పాన్ కార్డుల్ని మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారు.

    Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    IRCTC e-wallet: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ ట్రై చేశారా?

    Good News: ఆధార్ కాంటెస్ట్ గడువు పొడిగింపు... రూ.30,000 గెలుచుకోండి ఇలా

    WhatsApp: కోటిన్నర ఫోన్లల్లో 'ఏజెంట్ స్మిత్' మాల్‌వేర్... జర జాగ్రత్త
    Published by:Santhosh Kumar S
    First published: