PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా

PAN Card Status | మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా లేకపోతే లావాదేవీల్లో సమస్యలు వస్తాయి. లేదా మీరు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది.

news18-telugu
Updated: May 29, 2019, 11:06 AM IST
PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా
PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 29, 2019, 11:06 AM IST
మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? అసలు ఆ పాన్ కార్డ్ యాక్టీవ్‌గానే ఉందా? ఇది తెలుసుకోవడం చాలా సులువు. మీరే ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఉంటే చాలు. మీ పాన్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఈ అవకాశం కల్పిస్తోంది. దీన్నే పాన్ వెరిఫికేషన్ లేదా నో యువర్ పాన్ అంటారు. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పాన్ వెరిఫికేషన్ చేయొచ్చు. మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా ఉంటే ఏ సమస్యా లేదు. ఒకవేళ మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా లేకపోతే లావాదేవీల్లో సమస్యలు వస్తాయి. లేదా మీరు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది. మరి పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో ఎలా చేయాలో తెలుసుకోండి.

Read this: PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?

PAN card active, know your pan number, pan card active or inactive status, how to check pan card active or not, pan card status by name, pan card online, pan card status by name and date of birth, pan card verification, పాన్ కార్డ్ వెరిఫికేషన్, పాన్ కార్డ్ యాక్టీవ్, పాన్ కార్డ్ స్టేటస్, పాన్ కార్డ్ స్టేటస్ ఆన్‍లైన్, పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఆన్‌లైన్, పాన్ కార్డ్ వివరాలు
image: http://incometaxindiaefiling.gov.in


ఆన్‌లైన్‌లో పాన్ వెరిఫికేషన్ చేయండి ఇలా...




ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయండి.
ఎడమవైపు లిస్ట్‌లో Verify your PAN details ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీలో మీ పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
Loading...
చివరగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ పాన్ యాక్టీవ్‌గా ఉందో లేదో తెలుస్తుంది.

ఒకవేళ మీ పాన్ డీయాక్టివేట్ అయినట్టయితే ఆదాయపు పన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాత పాన్ కార్డ్ జిరాక్స్‌తో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మీ పాన్ నెంబర్ యాక్టివేట్ చేస్తారు.

OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

PAN Card: మీ పాన్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు

PAN Card: 48 గంటల్లో పాన్ కార్డ్... పొందండి ఇలా
First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...