హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Deposits: బ్యాంకులో మీ డబ్బులు భద్రంగానే ఉన్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Deposits: బ్యాంకులో మీ డబ్బులు భద్రంగానే ఉన్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Deposits: బ్యాంకులో మీ డబ్బులు భద్రంగానే ఉన్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Deposits: బ్యాంకులో మీ డబ్బులు భద్రంగానే ఉన్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)

Bank Deposits | మీ డబ్బులన్నీ ఒకే బ్యాంకులో ఉన్నాయా? ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఒకే బ్యాంకులో మెయింటైన్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.

కరోనా తరువాత బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. నిజానికి మహమ్మారికి ముందే కొన్ని సహకార బ్యాంకులు ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. కొన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల పనితీరు సైతం గాడి తప్పింది. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారుల ప్రయోజనాలను సంరక్షిచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులలో ఎక్కువగా పొదుపు చేస్తున్నవారు.. తమ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య ఎదురు కాకుండా ఉండాలంటే.. పొదుపు చేయడానికి ముందే డబ్బును బ్యాంక్ డిపాజిట్లలో ఎలా సురక్షితంగా పెట్టుబడి పెట్టాలో గుర్తించాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. డిపాజిట్ల విషయంలో ఖాతాదారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలివే.

ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో డిపాజిట్లు


పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో డబ్బు దాచాలనుకునేవారు.. అందుకు ఒకే బ్యాంకును ఎంచుకోకూడదు. ఒకవేళ ఆ బ్యాంకు దివాలా తీస్తే.. ఖాతాదారులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల మీ డిపాజిట్లను మూడు, నాలుగు బ్యాంకుల్లో.. వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. అవి ప్రైవేట్ బ్యాంకులైనా, ప్రభుత్వ బ్యాంకులైనా ఫర్వాలేదు. వీటిలో ఏదైనా ఒక బ్యాంకు ఇబ్బందుల్లో పడితే.. ఇతర బ్యాంకుల్లోని డబ్బు భద్రంగా ఉంటుంది. సంబంధిత డిపాజిట్ల నుంచి ఆదాయం కూడా వస్తుంది.

Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఆ రెండు సేవల్ని నిలిపేసిన UIDAI

Aadhaar Verification: ఆధార్ వెరిఫికేషన్ చేయాలా? ఈ కొత్త సర్వీస్ వాడుకోండి

అన్ని అవసరాలకు ఒకే అకౌంట్ సరిపోతుందా?


చాలా మంది కస్టమర్లు ఒకే బ్యాంకులో తమ డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకుంటారు. ఆ బ్యాంకు బ్రాంచ్ ఇంటికి దగ్గరగా ఉందనో, అక్కడి ఉద్యోగులు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ సహాయపడతారనో భావిస్తారు. డిజిటల్ టెక్నాలజీకి దూరంగా ఉండేవారు, సీనియర్ సిటిజన్లు ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఇలాంటి వారు సంబంధిత బ్యాంకులోనే తమ నెలవారీ ఖర్చులను తీర్చడానికి ఉపయోగించే రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్‌ను తీసుకోవచ్చు. కానీ పొదుపులో కొంత భాగాన్ని వేరే అకౌంట్‌కు మళ్లించడం మంచిది.

బ్యాంక్ దివాలా తీస్తే.. పరిస్థితి ఏంటి?


బ్యాంకింగ్ వ్యవస్థ ఒక వ్యాపారం. కొన్ని సందర్భాల్లో వ్యాపారాల్లో నష్టాలు వాటిల్లడం సహజం. ఇది బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా ఒక బ్యాంకు నిర్దిష్ట వడ్డీ రేటుతో డబ్బు తీసుకుంటుంది. ఈ డబ్బును అధిక వడ్డీ రేటుతో ఖాతాదారులకు అప్పుగా ఇస్తుంది. అయితే బ్యాంకులకు రావాల్సిన డబ్బు ఆగిపోతే.. ఆ ప్రభావం కస్టమర్లు అందరిపై పడుతుంది. ఈ సందర్భంలో డిపాజిట్లలో కొంత భాగాన్ని బ్యాంకులు తిరిగి చెల్లించకపోవచ్చు. ఒక బ్యాంకు ఆ దశకు చేరుకున్నప్పుడు.. ఆర్బీఐ దాన్ని మరో బ్యాంకులో విలీనం చేస్తుంది. అయితే సంబంధిత బ్యాంకు దివాలా తీసినప్పుడు.. ఆ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్ల ఉపసంహరణపై ఆర్బీఐ పరిమితులు విధిస్తుంది. ఈ సమస్యలన్నీ ఎదురవ్వకుండా జాగ్రత్తపడాలి. అన్ని అవసరాలకు ఒకే బ్యాంకు, ఒకే అకౌంట్‌పై ఆధారపడటం తగదని ఈ ఉదాహరణ నిరూపిస్తోంది.

LIC policy: నెలకు రూ.9,250 పెన్షన్ కావాలా? ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకోండి

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం... నెలకు రూ.30,000 ఆదాయం... బిజినెస్ ఐడియా ఇదే

ఎక్కువ వడ్డీ రేటునే ఖాతాదారులు లక్ష్యంగా పెట్టుకోవాలా?


సహకార బ్యాంకులు, చిన్న ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందిస్తాయి. అయితే డిపాజిటర్ల నుంచి తీసుకునే డబ్బుతో ఈ బ్యాంకులు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నాయనే అంశంపై పారదర్శకత ఉండదు. రాజకీయ నాయకులు, సమాజంలో పలుకుబడి ఉన్నవారు ఇలాంటి బ్యాంకులను నడుపుతారు. సహకార బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఉన్న లోపాలను వీరు అవకాశంగా మల్చుకునే అవకాశం ఉంది. వీటిపై ఆర్బీఐ నియంత్రణ సైతం పరిమితంగానే ఉంటుంది. అందువల్ల ప్రధాన వాణిజ్య బ్యాంకుల కంటే డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇచ్చినప్పటికీ.. ఇలాంటి బ్యాంకులకు దూరంగా ఉండటం మంచిది.

బ్యాంకు గత చరిత్ర కూడా ముఖ్యమే


డిపాజిట్ల విషయంలో బ్యాంకుల హిస్టరీని సైతం ఖాతాదారులు పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఎక్కువ బ్యాడ్ లోన్స్‌ లేదా మొండి బకాయిలతో ఇబ్బంది పడుతుంటాయి. 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తిరిగి చెల్లించని రుణాలను మొండి బకాయిలు అంటారు. కొన్ని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బ్యాంకుల బ్యాడ్ లోన్స్ రేటు వివరాలు ఇంటర్నెట్‌లో లభిస్తాయి. ఈ రేటు అధికంగా ఉండే బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలనుకోవడం మంచి ఆలోచన కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank, Banking, Fd money claim online, Fixed deposits money, Money, Personal Finance, Save Money

ఉత్తమ కథలు