LIC Alerts: మార్చి 1 నుంచి LIC నుంచి SMS అలర్ట్స్... ఇలా రిజిస్టర్ చేసుకోండి

LIC Alerts: మార్చి 1 నుంచి LIC నుంచి SMS అలర్ట్స్... ఇలా రిజిస్టర్ చేసుకోండి

మీకు ఇప్పటివరకు ఇలాంటి ఎస్ఎంఎస్ రాలేదంటే మీ మొబైల్ నెంబర్ ఎల్ఐసీ దగ్గర రిజిస్టర్ కాలేదని అర్థం. అందుకే వెంటనే మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయించాలి.

  • Share this:
    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అందుకు సంబంధించిన సమాచారం ఇస్తోంది. మార్చి 1 నుంచి పాలసీ హోల్టర్లకు ప్రీమియం గడువు, చెల్లింపులు, పాలసీ ల్యాప్స్, బోనస్ లాంటి సమాచారం ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది అంటూ సమాచారం ఇచ్చింది ఎల్ఐసీ. "మీ పాలసీ నెంబర్ ********* ఇంటిమేషన్, రిమైండర్లు ఇకపై ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. 01.03.2019 నుంచి ఇది అమలులోకి వస్తుంది" అని పాలసీహోల్డర్లకు ఎస్ఎంఎస్ పంపింది ఎల్ఐసీ. మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉంటే మీకూ ఈ మెసేజ్ వచ్చే ఉంటుంది.

    Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

    Life Insurance Corporation, lic sms, lic policy login, lic policy status, lic agent login, lic customer care, lic old portal, lic billdesk, lic premium calculator, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసీ ఎస్ఎంఎస్, ఎల్ఐసీ పాలసీ లాగిన్, ఎల్ఐసీ పాలసీ స్టేటస్, ఎల్ఐసీ లాగిన్

    మీకు ఇప్పటివరకు ఇలాంటి ఎస్ఎంఎస్ రాలేదంటే మీ మొబైల్ నెంబర్ ఎల్ఐసీ దగ్గర రిజిస్టర్ కాలేదని అర్థం. అందుకే వెంటనే మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయించాలి. మీరు గతంలోనే మొబైల్ నెంబర్ ఇచ్చినా, మళ్లీ ఓసారి అప్‌డేట్ చేయించడం మంచిది. లేకపోతే ఎల్ఐసీ నుంచి మీ పాలసీకి సంబంధించిన అప్‌డేట్స్ మీకు అందవు. మీరు మీ ఫోన్ నెంబర్‌ను ఎల్ఐసీలో అప్‌డేట్ చేయించాలంటే మీ ఏజెంట్‌కి కాల్ చేసి చెప్పొచ్చు. మీ మొబైల్ నెంబర్ మారినా ఎల్ఐసీకి సమాచారమివ్వాలి. మీరు ఆన్‌లైన్‌లో కూడా మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు. www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. లేదా 022-68276827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.

    Read this: Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

    ఎల్ఐసీ మొత్తం 65 ఆటోమెటెడ్ మెసేజ్‌లను రూపొందించింది. ఇందులో పేమెంట్ రిమైండర్, పాలసీ ల్యాప్స్‌డ్, రివైవ్డ్, పాలసీ బాండ్ డిస్పాచ్డ్, బోనస్, లాయల్టీ లాంటివి ఉంటాయి. ఇలా మీ పాలసీకి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పొందడం మీకు ఉపయోగకరమే. అందుకే ఎల్ఐసీలో మీ కాంటాక్ట్ డీటైల్స్ అప్‌డేట్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Flipkart Month-end Mobile Fest: ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఆఫర్లు ఇవే

    LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా

    Rail Drishti: ప్రయాణికులకు రైల్వే గిఫ్ట్... సమస్త సమాచారం అందించే 'రైల్ దృష్టి'
    First published: