LIC Revival Campaign: పాలసీ ల్యాప్స్ అయిందా? మార్చి 30 వరకు ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్

LIC Revival campaign 2019 | ల్యాప్స్ అయిన మీ పాలసీని రెన్యువల్ చేయించుకుంటే మీ రిస్క్ కవర్ కొనసాగుతుంది. బోనస్‌లు, బకాయిలన్నీ మళ్లీ పాలసీలోకి క్రెడిట్ అవుతాయి.మీ తర్వాత ప్రీమియంలు చెల్లించి ఎల్ఐసీ పాలసీ కొనసాగించొచ్చు.

news18-telugu
Updated: March 21, 2019, 2:29 PM IST
LIC Revival Campaign: పాలసీ ల్యాప్స్ అయిందా? మార్చి 30 వరకు ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్
LIC Alerts: మార్చి 1 నుంచి LIC నుంచి SMS అలర్ట్స్... ఇలా రిజిస్టర్ చేసుకోండి
news18-telugu
Updated: March 21, 2019, 2:29 PM IST
లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ... మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఇది ఓ భాగమైపోయింది. దాదాపు ప్రతీ ఇంట్లో ఓ ఎల్ఐసీ పాలసీ తప్పనసరిగా ఉంటుంది. అయితే ఏజెంట్ ఒత్తిడి చేశాడనో, సేవింగ్స్ కోసమనో ఎల్ఐసీ పాలసీ తీసుకున్నవాళ్లు ఆ తర్వాత ప్రీమియంలు చెల్లించరు. దీంతో పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. ల్యాప్స్ అయిన పాలసీని ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటివారి కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పాలసీ రివైవల్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఫిబ్రవరి 11న ప్రారంభమైన ఈ క్యాంపైన్ మార్చి 30 వరకు కొనసాగుతుంది. ఈ క్యాంపైన్‌లో పాలసీదారులు ల్యాప్స్ అయిన తమ ఎల్ఐసీ పాలసీలను రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక ఎప్పట్లానే పాలసీని కొనసాగించొచ్చు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

Read this: WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...

LIC Renewal campaign 2019, LIC Revival campaign 2019, LIC lapsed policy renewal, lic policy renewal, lic revival calculator, lic revival scheme 2019, lic revival quotation, lic revival form, ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్ 2019, ఎల్ఐసీ రెన్యువల్ క్యాంపైన్ 2019, ఎల్ఐసీ పాలసీ రెన్యువల్, ఎల్ఐసీ పాలసీ రెన్యువల్



రివైవల్ క్యాంపైన్‌లో ఏఏ పాలసీలు రెన్యువల్ చేసుకోవచ్చు?


ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ప్రారంభించిన రెండో రివైవల్ క్యాంపైన్ ఇది.వ్యక్తిగత, ఆరోగ్య బీమా పాలసీలు, 802, 803, 804, 811, 835 లాంటి యూలిప్ ప్లాన్స్ కూడా ఈ క్యాంపైన్‌లో రెన్యువల్ చేసుకోవచ్చు. మైక్రో ఇన్స్యూరెన్స్ పాలసీలు తప్ప... ఏ పాలసీ అయినా రెన్యువల్ చేసుకోవచ్చు. రివైవల్ తేదీ నాటికి ఫస్ట్ అన్‌పెయిడ్ ప్రీమియం(FUP) నుంచి ఆరు నెలల కన్నా ఎక్కువ గడువు పూర్తైన పాలసీలు ల్యాప్స్ అయినట్టే. వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు.805, 806 ప్లాన్ పాలసీలకు ఫస్ట్ అన్‌పెయిడ్ ప్రీమియం(FUP) నుంచి ఏడాది కన్నా ఎక్కువైనా రివైవల్‌కు అవకాశముంటుంది.మీరు పాలసీ ఆన్‌లైన్‌లో తీసుకున్నా, ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా రెన్యువల్‌కు అవకాశముంటుంది.ఒకవేళ ఐదేళ్లుగా ప్రీమియం చెల్లించనట్టైతే ఎల్ఐసీ నియమనిబంధనల ప్రకారం రివైవల్ చేస్తారు.



Read this: Redmi Go: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... 'రెడ్‌మీ గో' ధర రూ.4,499 మాత్రమే

LIC Renewal campaign 2019, LIC Revival campaign 2019, LIC lapsed policy renewal, lic policy renewal, lic revival calculator, lic revival scheme 2019, lic revival quotation, lic revival form, ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్ 2019, ఎల్ఐసీ రెన్యువల్ క్యాంపైన్ 2019, ఎల్ఐసీ పాలసీ రెన్యువల్, ఎల్ఐసీ పాలసీ రెన్యువల్

Loading...

పాలసీ రెన్యువల్ చేయించుకోవడం వల్ల లాభాలేంటీ?


ల్యాప్స్ అయిన మీ పాలసీని రెన్యువల్ చేయించుకుంటే మీ రిస్క్ కవర్ కొనసాగుతుంది.బోనస్‌లు, బకాయిలన్నీ మళ్లీ పాలసీలోకి క్రెడిట్ అవుతాయి. మీ తర్వాత ప్రీమియంలు చెల్లించి ఎల్ఐసీ పాలసీ కొనసాగించొచ్చు. ఈ పాలసీలకు లేట్‌ ఫీజులో కన్సెషన్ ఉంటుంది.

పాలసీ రెన్యువల్ కోసం లేట్ ఫీజులో ఇచ్చే తగ్గింపు ఇలా ఉంటుంది


రూ.1,00,000 వరకు 20% (గరిష్టంగా రూ.1500)రూ.100001 నుంచి రూ.3,00,000 వరకు 25%(గరిష్టంగా రూ.2000)రూ.300001 కన్నా ఎక్కువ ప్రీమియంకు 30%(గరిష్టంగా రూ.2500)
2015-16, 2016-17, 2017-2018 ఆర్థిక సంవత్సరాల్లో నిర్వహించిన రివైవల్ క్యాంపైన్‌లో కన్సెషన్ పొందినవారికి ఇప్పుడు మళ్లీ తగ్గింపు వర్తించదు.

Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి

ఇవి కూడా చదవండి:

IRCTC-Google Pay: ఇక 'గూగుల్ పే' యాప్‌లోనే ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్

Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు... ఐటీ శాఖ టిప్స్

SBI Jobs 2019: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

 
First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...