ఎల్‌ఐసీ పాలసీ లాప్స్ అయిందా? అక్టోబర్ 15 లోగా రివైవల్‌ చేయొచ్చు!

భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్... ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌ని ప్రారంభించిన ఎల్ఐసీ... పాలసీలను తిరిగి చెల్లించేందుకు అక్టోబర్ 15 వరకు గడువు విధించింది.

news18-telugu
Updated: October 11, 2018, 4:42 PM IST
ఎల్‌ఐసీ పాలసీ లాప్స్ అయిందా? అక్టోబర్ 15 లోగా రివైవల్‌ చేయొచ్చు!
ఎల్ఐసీ
  • Share this:
పాలసీ బాగుందనో, స్నేహితులో, బంధువులో ఒత్తిడి చేస్తున్నారనో పాలసీలు తీసుకోవడం చాలామందికి అలవాటు. రెండుమూడేళ్లు ప్రీమియం గడువులోగా కట్టినా ఆ తర్వాత పట్టించుకోరు. దీంతో ఆ పాలసీలన్నీ లాప్స్ అవుతాయి. ఆలస్య రుసుముతో చెల్లించాలన్నా సాధ్యం కాదు. దీంతో అలాంటి పాలసీల విషయంలో ఏం చేయాలో పాలసీదారులకు అర్థం కాదు. వారి కోసమే అప్పుడప్పుడూ ఎల్ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌ నిర్వహిస్తుంటాయి. మరోసారి ఎల్‌ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ ప్రారంభించింది.

లాప్స్ అయిన పాలసీలు రివైవ్ చేయాలనుకుంటే అక్టోబర్ 15 వరకు గడువు ఉంది.
Loading...
వ్యక్తిగత పాలసీలతో పాటు హెల్త్ పాలసీలు తిరిగి చెల్లించొచ్చు.
మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు రివైవల్ కుదరదు.
802, 803, 804, 811, 835 యూలిప్ పాలసీలూ రివైవ్ చేయొచ్చు.
పాలసీలు రివైవ్ చేయించుకుంటే ఆలస్య రుసుములో మినహాయింపు లభిస్తుంది.
ప్రీమియం రూ.లక్ష కన్నా తక్కువైతే... ఆలస్య రుసుములో 20% లేదా రూ.1,500 వరకు రాయితీ.
ప్రీమియం రూ.1,00,001 నుంచి రూ.3,00,000 మధ్య ఉంటే ఆలస్య రుసుములో 25% లేదా రూ.2,000 వరకు రాయితీ.
ప్రీమియం రూ.3,00,000 కన్నా ఎక్కువ ఉంటే ఆలస్య రుసుములో 30% లేదా రూ.2,500 వరకు రాయితీ.
ప్రీమియం బకాయిలు మొత్తం చెల్లించినవారికే ఆలస్య రుసుములో మినహాయింపు లభిస్తుంది.
ఎస్‌బీ కమ్ రివైవల్, లోన్ కమ్ రివైవల్, ఇన్‌స్టాల్‌మెంట్ రివైవల్‌పైనా ఆలస్య రుసుములో మినహాయింపు.
రివైవల్‌ సమయంలో హెల్త్ రిపోర్ట్స్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
మీ దగ్గర్లోని ఎల్‌ఐసీ బ్రాంచ్‌కు వెళ్లి పాలసీ రివైవ్ చేయించుకోవచ్చు.
పాలసీలను రివైవ్ చేయించేందుకు చివరి గడువు అక్టోబర్ 15.

ఇవి కూడా చదవండి:

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ 18 అంశాలు మర్చిపోవద్దు!

కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?
First published: October 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...