సొంతిళ్లు అనేది ప్రతి ఒక్కరి కల. వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి చిన్నదో.. పెద్దదో ఓ సొంతిళ్లు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. అయితే, దాదాపు అన్ని బ్యాంకులు కరోనా నేపథ్యంలో హోమ్లోన్లపై వడ్డీ రేట్లను ఆన్‌టైం కనిష్టానికి తగ్గించాయి. దీంతో, హోమ్‌లోన్ తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని నిపుణులు చెబుతున్నారు. తాజా వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ కేవలం 6.65% వడ్డీకే హోమ్ లోన్స్ అందజేస్తుంది. ఇది మార్కెట్లోనే అతి తక్కువ వడ్డీ అని చెప్పవచ్చు. ఇక, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇటీవల హోమ్‌లోన్ వడ్డీ రేట్లను 6.66% కి తగ్గించింది. మరోవైపు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా హోమ్లోన్స్ఫై 6.65% వడ్డీ మాత్రమే వసూలు చేస్తుంది.
దేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్‌లోన్ ఇంట్రెస్ట్ 6.70% నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఇవన్నీ కనిష్ట వడ్డీ రేట్లు మాత్రమే. వీటిని కస్టమర్లందరూ పొందలేదు. కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తాయి బ్యాంకులు. చాలా మంది ఇప్పటికీ హోమ్‌లోన్స్‌పై 7% కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లు పొందలేక పోవడానికి గల కారణాలేంటో తెలసుకుందాం.
Aadhaar Verification: ఆధార్ వెరిఫికేషన్ చేయాలా? ఈ కొత్త సర్వీస్ వాడుకోండి
Fake Rs 500: మార్కెట్‌లో భారీగా నకిలీ రూ.500 నోట్లు... ఒరిజినల్ కరెన్సీ గుర్తించండి ఇలా
సాధారణంగా బ్యాంకుల, ఫైనాన్షియల్ సంస్థలు అత్యధిక క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు మాత్రమే తక్కువ వడ్డీతో లోన్లను మంజూరు చేస్తాయి. అయితే, ఈ ప్రమాణాలు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. కొన్ని బ్యాంకులు 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోరు ఉన్నవారికి వారికి మాత్రమే ఉత్తమ వడ్డీ రేటును ఇస్తున్నాయి. మరి కొన్ని బ్యాంకులు 700 కంటే ఎక్కువ సిబిల్ స్కోరు ఉంటే చాలు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి. అంతకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ఉత్తమ వడ్డీ రేట్లు పొందలేరు. అందువల్ల, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ఉత్తమ క్రెడిట్ స్కోర్ మెయింటెయిన్ చేయండి.
చాలా బ్యాంకులు రూ. 50 లక్షల వరకు హోమ్‌లోన్స్‌పై ఉత్తమ వడ్డీ రేటును అందిస్తున్నాయి. అది కూడా ఉద్యోగస్తులైన మహిళకు అతి తక్కువ వడ్డీ రేటును అమలు చేస్తున్నాయి. అయితే, మహిళలతో పోలిస్తే పురుషుల నుంచి అదనంగా 5-10 బేసిస్ పాయింట్ల వడ్డీ వసూలు చేస్తున్నాయి. కాబట్టి, హోమ్‌లోన్ తీసుకునే మహిళలకు ఇది లాభిస్తుంది.
Currency Note: ఈ మూడు నోట్లు మీ దగ్గరుంటే లక్ష రూపాయలు మీవే... పూర్తి వివరాలు తెలుసుకోండి
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం... నెలకు రూ.30,000 ఆదాయం... బిజినెస్ ఐడియా ఇదే
కొన్ని బ్యాంకులు రూ .30 లక్షల వరకు హోమ్‌లోన్స్‌పై ఉత్తమ వడ్డీరేటును అందిస్తున్నాయి. కాబట్టి రూ .30 లక్షలకు మించి హోమ్‌లోన్ తీసుకుంటే మీకు అతి తక్కువ వడ్డీ లభించకపోవచ్చు. మీరు ఉద్యోగం చేసే కంపెనీని బట్టి కూడా చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. మీ కంపెనీ బ్యాంకు జాబితాలో లేకపోతే, మీరు ఉత్తమ రేటును పొందలేరు. సాధారణంగా నెలవారీ జీతం అందుకే ఉద్యోగులకు అతి తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి బ్యాంకులు.
కొన్ని బ్యాంకులు మీ వర్క్ ప్రొఫైల్‌ను బట్టి కూడా హోమ్‌లోన్స్‌పై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీనితో పాటు మీ వయస్సు, విద్యార్హత, ఆస్తి వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే, మీరు ఓల్డ్ ప్రాపర్టీని కొనుగోలు చేస్తే, మీకు ఉత్తమ రేటు లభించకపోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Bank loans, Home loan, House loan, Housing Loans, Personal Finance