Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ రిజెక్ట్ అయిందా? ఎందుకో తెలుసుకోండి

Health insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ రిజెక్ట్ అయిందా? ఎందుకో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance | మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నారా? మీ పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా? అయితే ఏం చేయాలో తెలుసుకోండి.

  • Share this:
కరోనా సెకండ్​ వేవ్​తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఆరోగ్య బీమా ఉన్న వారు నెట్​వర్క్​ ఆసుపత్రుల్లో క్యాష్​ లెస్​ ట్రీట్​మెంట్​ పొందే అవకాశం ఉంది. కానీ, చాలా ఆసుపత్రులు నేరుగా నగదు చెల్లించే వారికే చికిత్స అందిస్తున్నాయి. దీంతో బీమా ఆదుకుంటుందన్న నమ్మకంతో ఆసుపత్రికి వచ్చిన వారు రూ.లక్షలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇన్సూరెన్స్ తిరస్కరణకు గురికాకూడదంటే బీమా చేయించుకునే సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయినప్పటికీ మీ క్లెయిమ్​ రిక్వెస్ట్​ తిరస్కరిస్తే.. పరిష్కార మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. ఎలాంటి సందర్భాల్లో బీమా కంపెనీలు క్లెయిమ్​లను తిరస్కరిస్తాయి? ఈ సందర్భంలో మీకు అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలేంటి? వంటి కీలక విషయాలను తెలుసుకుందాం.

తప్పుడు సమాచారం ఇవ్వడం


బీమా చేయించుకునే సమయంలో నింపే దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించడం వల్ల తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. మీ దరఖాస్తు ఫారంలో సరైన సమాచారం అందించడం చాలా అవసరం. ముఖ్యంగా వయస్సు, ఆదాయం, వృత్తి వంటి డేటాను స్పష్టంగా తెలియజేయాలి. వీటితో పాటు ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లను కూడా నిర్మొహమాటంగా పేర్కొనాలి. దరఖాస్తులో అందించిన సమాచారం ప్రకారమే ఆయా బీమా సంస్థలు మీ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి తప్పు సమాచారం అందించడం మోసంగా పరిగణించబడుతుదని గుర్తించుకోండి.

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే లాభాలు ఇవే

Airtel 2GB Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

వ్యాధులను దాచడం


గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు, శస్త్రచికిత్సలు లేదా వంశపారంపర్యంగా సంక్రమించిన వ్యాధులు ఏవైనా ఉంటే.. వాటి గురించి కూడా వెల్లడించాలి. ఎందుకంటే మీ ఆరోగ్య స్థితిని బట్టి బీమా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. మీకు ఇదివరకే ఏవైనా వ్యాధులు ఉంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి మీ వ్యాధులనే దాచేస్తే మీ క్లెయిమ్​ను తిరస్కరించే ప్రమాదం ఉంది.

వెయిటింగ్​ పీరియడ్​


ఆరోగ్య బీమా పాలసీలకు వెయిటింగ్​ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్​ పీరియడ్​ పూర్తయిన తర్వాత ఆసుపత్రిలో చేరితేనే మీ బీమా క్లెయిమ్​ అవుతుంది. మరోవైపు, కొన్ని వ్యాధులకు బీమా కవరేజీ లభించదు. వీటిని ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలోనే పరిశీలించాల్సి ఉంటుంది. ఎలాంటి వ్యాధులకు కవరేజీ లభిస్తుందో నిర్ధారించుకున్న తర్వాతే బీమా పాలసీ తీసుకోవాలి.

Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారా? ఇలా కంప్లైంట్ చేయండి

EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేయొచ్చో తెలుసుకోండి

క్లెయిమ్​ వ్యవధి ముగియడం


ఆసుపత్రిలో చేరిన నిర్ధిష్ట సమయంలోపు రీయింబర్స్​మెంట్ కోసం సదరు బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే మీరు బీమా క్లెయిమ్​ పొందలేరు. ఎమర్జెన్సీ లేదా ఐసీయూలో చేరిన సందర్భంలో అడ్మిట్​ అయిన 24 గంటల్లోగా బీమా సంస్థకు విషయాన్ని తెలియజేయాలి. అయితే ఈ సమయం మీరు ఎంచుకున్న పాలసీ రకం, చికిత్సను బట్టి మారుతుంది. నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోకపోతే, క్లెయిమ్​ రిక్వెస్ట్​ను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

పరిష్కార మార్గం?


బీమా అనేది విశ్వాసంతో చేసుకున్న ఒప్పందం. కాబట్టి దీనికి దరఖాస్తు చేసేటప్పుడు ఆరోగ్య, ఆర్థిక సమాచారాన్ని కచ్చితంగా, నిజాయతీగా అందించాలి. దరఖాస్తు నింపడంలో అవగాహన లేకపోతే.. మీ బీమా సంస్థ థర్డ్​ పార్టీ ఏజెంట్ల (టిపిఎ) సహాయం తీసుకోండి.

అప్పీల్ చేసుకునే విధానం


ఒకవేళ, మీ క్లెయిమ్​ రిక్వెస్ట్‌ను తిరస్కరిస్తే, ముందుగా మీ బీమా సంస్థకు చెందిన సర్వీస్​ క్వాలిటీ టీమ్​ను సంప్రదించండి. తిరస్కరణకు కారణాలను తెలుసుకోండి. ఇలాంటి సందర్భాల్లో క్లెయిమ్​ను మళ్లీ పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తూ వారికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. సంస్థ మీ సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరిస్తుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) నిబంధనల్లో ఈ వివరాలు ఉన్నాయి. ఒకవేళ వారు ఇచ్చిన సమాధానంతో మీరు సంతృప్తి చెందకపోతే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్​ ద్వారా ఐఆర్​డీఎఐకి ఫిర్యాదు చేయవచ్చు. ఐఆర్​డీఏఐ జోక్యం తర్వాత కూడా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్​ను పరిష్కరించడానికి నిరాకరిస్తే, అప్పుడు మీరు బీమా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: