ప్రయాణాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా ఫ్లైట్ (Flight)ఆలస్యం అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా కారణాల వల్ల ఫ్లైట్‌లు ఆలస్యం కావచ్చు. DGCA డేటా ప్రకారం.. 2022 జనవరి, మే మధ్య.. విమానాలు ఆలస్యం కావడం ద్వారా నాలుగు లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. అటువంటి సందర్భాలలో ప్రయాణికులకు ఫ్లైట్ డిలే కవరేజీ అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్(Travel Insurance) సహాయపడుతుంది. దీని గురించి డిజిట్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ఆదర్శ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘విమాన ఆలస్యాన్ని కవర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది నిర్ణీత వ్యవధి కంటే (120-150 నిమిషాలు) విమానం ఆలస్యం అయితే వర్తిస్తుంది. దీని ద్వారా విమానాశ్రయంలో ఫ్లైట్ డిలే కారణంగా అయిన ఖర్చులకు కవరేజీ లభిస్తుంది.’ అని చెప్పారు.
దేనికి కవరేజ్ లభిస్తుంది?
ప్రతికూల వాతావరణం, కీలకమైన ఎయిర్‌లైన్ సిబ్బంది, సహాయక ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్, విమానంలో ఎక్విప్‌మెంట్ ఫెయిల్యూర్, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ, సిబ్బంది షెడ్యూలింగ్ సమస్యలు, విమానాల రద్దు లేదా రీషెడ్యూల్ కారణంగా విమానం ఆలస్యమైతే ఇన్సూరెన్స్ కంపెనీ తమ కస్టమర్‌లకు పరిహారం చెల్లిస్తుంది.
క్లెయిమ్ ఎప్పుడు సాధ్యం కాదు
విమానం బయలుదేరే నిర్ణీత సమయానికి ముందే ఆలస్యం గురించి తెలియజేసినా, కార్మిక వివాదాలు, విమానయాన సంస్థ సేవలను శాశ్వతంగా ఉపసంహరించుకోవడం గురించి ముందస్తు నోటీసు జారీ చేసినా కంపెనీ క్లెయిమ్ చెల్లించదు. ఇన్సూరెన్స్ కంపెనీలు అందించిన నిబంధనలు, కవరేజీని పాలసీదారులు పూర్తిగా తెలుసుకోవాలని అగర్వాల్ చెప్పారు.
ఎలా క్లెయిమ్ చేయాలి
క్లెయిమ్ చేసే మొత్తం పాలసీకి చెల్లించే ప్రీమియంపై ఆధారపడి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణ ఇన్సూరెన్స్‌లకు వేర్వేరు బెనిఫిట్స్ ఉంటాయి. విద్యార్థుల ప్రయాణం, కుటుంబ ప్రయాణం, సీనియర్ సిటిజన్ ప్రయాణాలకు వేర్వేరు విధానాలు ఉన్నాయి. RenewBuy సహ వ్యవస్థాపకుడు ఇంద్రనీల్ ఛటర్జీ మాట్లాడుతూ.. ‘విమానం ఆలస్యమైనా, రీషెడ్యూల్ చేసినా, క్యాన్సిల్ చేసినా, దానిని కవర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే పరిహారం పొందవచ్చు. విమాన టిక్కెట్ మొత్తంలో ఏదైనా తేడా వచ్చినా వసతి ఛార్జీలతో పాటు పరిహారం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే పాలసీని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాలసీలో అన్ని అంశాలు కవర్ అవుతున్నాయా? లేదా? అనేది సరి చూసుకోవాలి. సెటిల్‌మెంట్‌లను క్లెయిమ్(Claim) చేయడానికి వినియోగదారు ఆన్‌లైన్ ఛానెల్‌లు లేదా ఫోన్ కాల్‌ల ద్వారా ఇన్సూరెన్స్ ఏజెంట్‌లను సంప్రదించవచ్చు. టర్న్‌అరౌండ్ సమయం కంపెనీ, క్లెయిమ్‌ల రకంపై ఆధారపడి ఉంటుంది.’ అని చెప్పారు. విమానం ఆలస్యం కారణంగా పాలసీదారులు హోటల్‌లో రాత్రి గడపవలసి వస్తే, రాత్రిపూట వసతి ఛార్జీలను కూడా కంపెనీలు భరిస్తాయి.
మాన్‌సూన్ ఫ్లైట్ డిలే..
ప్రతికూల వాతావరణం కారణంగా క్యారియర్ వల్ల కలిగే ఏదైనా ఆలస్యాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయవచ్చు. రుతుపవనాల వర్షాల కారణంగా రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే పరిహారం పొందేందుకు పాలసీదారులు అర్హులు అవుతారు అని ఛటర్జీ చెప్పారు.
అంతర్జాతీయ విమానాలు ఆలస్యం
ఒక అంతర్జాతీయ విమానం నిర్ణీత సమయం కంటే ఆలస్యమైతే, ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్‌కు స్థిర ప్రయోజనాన్ని చెల్లిస్తుంది. పరిహారం మొత్తం కంపెనీలను బట్టి మారుతుంటుంది. విమాన ఆలస్యాలకు అతీతంగా, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ సాధారణంగా ప్రయాణ సమయంలో ఒకరి ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే ఊహించని సంఘటనల నుంచి రక్షిస్తుంది. అత్యవసర వైద్య ఖర్చులు, సామాను కోల్పోవడం, చెక్-ఇన్ బ్యాగేజీ ఆలస్యం, ట్రిప్ రద్దు, పాస్‌పోర్ట్ కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదవశాత్తు మరణం తదితర అంశాలకు కవరేజీ ఉంటుంది.
ట్రావెల్ క్లెయిమ్‌లు
అంతర్జాతీయ పర్యటనకు ముందు ఎప్పుడూ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లెయిమ్ మొత్తం చెల్లించిన ప్రీమియం , పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ మాన్‌సూన్ ఫ్లైట్ డిలేకి కూడా కవరేజీ ఉంటుంది. సమాచారం కోసం, క్లెయిమ్ కోసం ఫోన్ ద్వారా సంబంధిత కంపెనీ ఏజెంట్‌లను సంప్రదించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Claim, Flight Offers, Life Insurance, Mediclaim