Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చాలా? ఈ లింక్ క్లిక్ చేసి అప్‌డేట్ చేయండి

Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చాలా? ఈ లింక్ క్లిక్ చేసి అప్‌డేట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Date of Birth Update | ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ మార్చాలా? అయితే ఈ లింక్ క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అప్‌డేట్ చేయండి.

  • Share this:
    మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందా? అయితే చాలా సమస్యలు రావొచ్చు. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, పాన్ కార్డు తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోతే చిక్కులు ఎదురవుతాయి. కేవైసీలో పుట్టిన తేదీ కూడా ముఖ్యమైన అంశమే. మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే సరిచేసుకోవచ్చు. పుట్టిన తేదీ తప్పుగా ఉందని మీరు గుర్తించిన వెంటనే మార్చడం మంచిది. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే పుట్టిన తేదీ మార్చుకునే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అవకాశం ఇస్తోంది. మరి ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకోండి.


    Aadhaar Card Date of Birth update: పుట్టిన తేదీ మార్చడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి


    ఆధార్ కార్డు హోల్డర్లు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ https://ssup.uidai.gov.in/ssup/ ఓపెన్ చేయాలి.
    Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
    12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి.
    Sent OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
    ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి.
    మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
    అందులో పుట్టిన తేదీని మార్చాలి.
    యూఐడీఐఏ సూచించిన ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి.
    ఏ డాక్యుమెంట్స్‌ని యూఐడీఐఏ అనుమతి ఇస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
    ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత Submit పైన క్లిక్ చేయాలి.

    Aadhaar Card Download: మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయండి ఇలా

    Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ డబ్బులు అడిగారా? ఫిర్యాదు చేయండి ఇలా

    మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ని పరిశీలించి యూఐడీఏఐ మీ పుట్టిన తేదీని సరిచేస్తుంది. మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    https://ssup.uidai.gov.in/ssup/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    Check Update Status పైన క్లిక్ చేయండి.
    ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయండి.
    మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి.
    Check Status పైన క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: