Home /News /business /

IS YOUR CURRENCY NOTE COLOURED BANKS CAN ACCEPT COLOUR STAINED NOTES KNOW ABOUT RBI CIRCULAR ON CURRENCY NOTES SS

Holi 2019: కరెన్సీ నోటుకు కలర్ అంటిందా? RBI రూల్స్ ఇవే...

ఈ మేరకు ఆర్బీఐ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ మేరకు ఆర్బీఐ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

Holi 2019 | హోలీ ఆడే సమయంలో జేబులో ఉన్న కరెన్సీ నోట్లకు రంగు అంటడం మామూలే. హోలీ మాత్రమే కాదు... ఇతర సందర్భాల్లో నోట్లకు రంగు అంటుతుంది. మరి ఆ నోట్లు చెల్లవా? ఈ అనుమానం చాలామందిలో ఉంది.

    హోలీ గ్రాండ్‌గా, కలర్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారా? హోలీ సందడిలో మీ జేబులో కరెన్సీ నోట్లు ఉన్నాయన్న విషయం మర్చిపోయారా? మీ కరెన్సీ నోట్లకు రంగు అంటిందా? రంగు అంటిన నోట్లు చాలామంది షాపులో తీసుకోరన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ నోట్లను మార్చడానికి మీరు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రంగు అంటిన నోట్లు చెల్లవన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఉన్న అభిప్రాయం, భయం సరే... మరి ఈ విషయంలో ఆర్‌బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? రంగు అంటిన నోట్లు చెల్లుతాయా? చెల్లవా? తెలుసుకోండి.

    Read this: Happy Holi 2019: హోలీ పండుగ వెనుక ఆసక్తికర కథ ఇదే...

    కరెన్సీ నోటుకు రంగు అంటిందా?


    హోలీ ఆడే సమయంలో జేబులో ఉన్న కరెన్సీ నోట్లకు రంగు అంటడం మామూలే. హోలీ మాత్రమే కాదు... ఇతర సందర్భాల్లో నోట్లకు రంగు అంటుతుంది. మరి ఆ నోట్లు చెల్లవా? ఈ అనుమానం చాలామందిలో ఉంది. రంగు అంటిన నోట్లు చెల్లుతాయి. మీరు బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. ఏ బ్యాంకుకూ రంగు అంటిన నోట్లను తిరస్కరించే అధికారం లేదు. గతంలో హోలీ సమయంలోనూ ఇలాంటి చర్చే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం రంగులు అంటిన నోట్లు చెల్లుతాయి. రంగులు అంటితే పర్లేదు కానీ... నోట్లు మరీ మురికిగా మారినా, పూర్తిగా నలిగిపోయినా చెల్లవు. నోట్లు చిరిగినా, నలిగినా, రెండు ముక్కలైనా సరే నోటుపై ఉండే ముఖ్యమైన సమాచారం కనిపించేంతవరకు అవి చెల్లుతాయి. డ్యామేజీ ఎక్కువగా ఉంటే చెల్లవు.

    మీరు కరెన్సీ నోట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి చెల్లకపోవచ్చు. డూప్లికేట్ నోట్లు అయితే ఎక్కడా చెల్లవు. ఒరిజినల్ నోట్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నోట్లపై రాజకీయ నినాదాలు ఉంటే మాత్రం చెల్లుబాటు కావు. బ్యాంకులు వాటిని తీసుకోవు. చట్టపరంగా ఎక్కడా ఆ నోట్లు చెల్లవు. అవి ఇక చెల్లని నోట్లుగా మిగిలిపోతాయి.

    Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి

    ఇవి కూడా చదవండి:

    దేవుడికి నైవేద్యంగా 101 రమ్ము బాటిళ్లు... ఆ ఆలయంలో వింత ఆచారం

    BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 400 ఖాళీలు... అర్హతలు ఇవే...

    SBI Jobs 2019: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు
    First published:

    Tags: Currency, Fake Currency, Holi, Rbi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు