క్రెడిట్ స్కోర్... తరచూ లోన్లు తీసుకునేవారికి, ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి చాలా ముఖ్యమైన స్కోర్ ఇది. అసలు మీ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పట్టేదే క్రెడిట్ స్కోర్. దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు. ఈ స్కోర్‌ను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే బ్యాంకులు మిమ్మల్ని అంత నమ్ముతాయి. అయితే వివిధ కారణాల వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. అదే టైమ్‌లో హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేసుకుంటే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నందుకు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అప్పుడే సిబిల్ స్కోర్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 పాయింట్ల మధ్య ఉంటుంది. 750 నుంచి 900 మధ్య స్కోర్ ఉంటే మంచిదని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. ఒకవేళ అంతకన్నా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందంటే మీకు వార్నింగ్ బెల్ మోగినట్టే. స్కోర్ ఎంత తక్కువ ఉంటే మీకు లోన్లు వచ్చే అవకాశాలు అంత తగ్గుతుంటాయి. అందుకే భవిష్యత్తులో మీరు ఏదైనా లోన్‌కు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే మాత్రం ముందుగా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం తప్పనిసరి. మరి మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.
Read this: Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 21 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
ముందుగా మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకుంటేనే మీరెక్కడ తప్పులు చేశారో తెలుస్తుంది. మీరు మీ పేమెంట్స్ అన్నీ గడువులోగా చేసినా కొన్నిసార్లు తప్పుడు సమాచారం కారణంగా మీ క్రెడిట్ స్కోర్ పడిపోవచ్చు. అందుకే ఓసారి చెక్ చేసుకోండి. క్రెడిట్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉన్నవారిలో 79 శాతం మందికి హోమ్‌లోన్స్ అప్రూవ్ అయ్యాయని సిబిల్ ఏజెన్సీ నివేదిక చెబుతోంది.
ఏ బిల్లులైనా గడువులోగా చెల్లించడం తప్పనిసరి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే కనీసం ఆరు నెలలపాటు బిల్లులు గడువులోగా చెల్లిస్తే స్కోర్ పెరిగే అవకాశముంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లుల విషయంలో ఈ నిబంధన తప్పనిసరి. క్రెడిట్ లిమిట్ విషయంలో 30% రూల్ పాటించాలి. అంటే మీకున్న లిమిట్‌లో 30% మాత్రమే వాడుకోవాలి.
Read this: IPL Offer: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రీఛార్జ్ ఆఫర్లు ఇవే
మీరు ముందే ఏదైనా లోన్ తీసుకున్నట్టయితే ఈఎంఐలు గడువులోగా చెల్లించడం మర్చిపోవద్దు. తీసుకున్న అప్పు సరిగ్గా కడితేనే మళ్లీ అప్పు దొరుకుతుంది. ఈఎంఐలు ఆలస్యం చేస్తే మీకు మళ్లీ అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ఆలోచిస్తాయి.
మీరు ఒకవేళ భవిష్యత్తులో హోమ్‌లోన్ తీసుకునే ఆలోచనలో ఉంటే అంతలోపు ఎలాంటి లోన్లు తీసుకోవద్దు. ముందే లోన్లు ఎక్కువగా ఉంటే హోమ్ లోన్ విషయంలో అవి అడ్డంకిగా మారొచ్చు. మీరు హోమ్ లోన్ తీసుకున్న తర్వాత అవసరమైతే కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.
మీ హోమ్ లోన్‌కు కో-అప్లికెంట్ తప్పనిసరైతే వారి క్రెడిట్ హిస్టరీ కూడా పరిశీలించాలి. వారి క్రెడిట్ స్కోర్ బాగా లేకపోయినా మీ దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
ఇవి కూడా చదవండి:
WhatsApp: ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారు? ఇక లెక్క తేల్చనున్న వాట్సప్
Jio-Redmi Go Offer: రెడ్‌మీ గో యూజర్లకు జియో ఆఫర్... రూ.2200 క్యాష్‌బ్యాక్, 100 జీబీ డేటా అదనం
Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫేనా? ఇలా తెలుసుకోవచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Personal Finance