వృద్ధాప్యంలో లభించే పెన్షన్ సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను అందిస్తోంది. అందులో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) స్కీమ్ పాపులర్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరేవారికి వృద్ధాప్యంలో రూ.1,000 నుంచి రూ.5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ పొందాలంటే స్కీమ్‌లో చేరిననాటి నుంచి ప్రతీ నెలా కొంత మొత్తం జమచేస్తూ ఉండాలి. జమ చేసే మొత్తాన్ని బట్టి పెన్షన్ లభిస్తుంది. ఈ పాపులర్ పెన్షన్ స్కీమ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే 99 లక్షల మంది చేరారు. అంటే సుమారు 1 కోటి మంది ఈ స్కీమ్‌లో చేరారు. 2022 మార్చి నాటికి ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 4.01 కోట్లు దాటింది.
ఈ పాపులర్ పెన్షన్ స్కీమ్‌లో చేరేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ప్రారంభించింది. వృద్ధాప్యంలో పెన్షన్ కావాలనుకునేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరేవారి కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 40 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరే అవకాశం ఉండదు.
Credit Cards: సినిమాలు ఎక్కువగా చూసేవారికి 5 క్రెడిట్ కార్డులు... మూవీ టికెట్స్ ఉచితం
ఈ స్కీమ్‌లో చేరినవారు ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేస్తూ ఉంటే వారికి 60 ఏళ్ల వయస్సు వచ్చిననాటి నుంచి ప్రతీ నెలా పెన్షన్ లభిస్తుంది. రూ. 1,000 నుంచి రూ.5,000 మధ్య పెన్షన్ పొందాలంటే నెలకు రూ.42 నుంచి రూ.1,454 మధ్య జమ చేయాలి. ఏ వయస్సువారు ఎంత పెన్షన్ పొందాలంటే ఎంత జమ చేయాలో తెలుసుకోండి.
18 ఏళ్లు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.42, నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.84, నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.126, నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.168, నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.210 చొప్పున జమ చేయాలి.
20 ఏళ్లు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.50, నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.100, నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.150, నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.198, నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.248 చొప్పున జమ చేయాలి.
Cooking Oil Prices: సామాన్యులకు ఊరట... భారీగా తగ్గిన వంటనూనెల ధరలు
25 ఏళ్లు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.76, నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.151, నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.226, నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.231, నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.362 చొప్పున జమ చేయాలి.
30 ఏళ్లు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.116, నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.231, నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.347, నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.462, నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.577 చొప్పున జమ చేయాలి.
35 ఏళ్లు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.181, నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.362, నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.543, నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.722, నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.902 చొప్పున జమ చేయాలి.
Credit Card: క్రెడిట్ కార్డ్ ఇలా అస్సలు వాడకూడదు? ఈ లెక్కలు తెలుసుకోండి
40 ఏళ్లు: నెలకు రూ.1,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.291, నెలకు రూ.2,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.582, నెలకు రూ.3,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.873, నెలకు రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.1164, నెలకు రూ.5,000 పెన్షన్ కోసం ప్రతీ నెలా రూ.1454 చొప్పున జమ చేయాలి.
ఇలా 60 ఏళ్ల వయస్సు నుంచి పెన్షన్ లభిస్తుంది. లబ్ధిదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. ఇద్దరూ మరణిస్తే జమచేసిన మొత్తం నామినీకి లభిస్తుంది. 60 ఏళ్ల తర్వాత ఎగ్జిట్ అయ్యే అవకాశం లేదు. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఎగ్జిట్ అయ్యే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
ఈ పథకంలో చేరిన వ్యక్తి పెన్షన్ తీసుకుంటున్న సమయంలో మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. ఇద్దరూ మరణిస్తే పెన్షన్ కార్పస్‌ను నామినీకి అందిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.