హోమ్ /వార్తలు /బిజినెస్ /

BHIM UPI: భీమ్ యాప్‌తో రోజుకు ఎంత డబ్బు పంపొచ్చంటే..

BHIM UPI: భీమ్ యాప్‌తో రోజుకు ఎంత డబ్బు పంపొచ్చంటే..

BHIM UPI: భీమ్ యాప్‌తో రోజుకు ఎంత డబ్బు పంపొచ్చంటే..

BHIM UPI: భీమ్ యాప్‌తో రోజుకు ఎంత డబ్బు పంపొచ్చంటే..

Money Transfer | మీరు భీమ్ యాప్ వాడుతున్నారా? అయితే రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చొ ఒకసారి తెలుసుకుందాం. లేదంటే మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

BHIM App | మనకు గూగుల్ పే తెలుసు. ఫోన్ పే కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. పేటీఎం యాప్ ద్వారా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ మూడు కాకుండా మరో యాప్ కూడా ఉంది. అదే భీమ్ యూపీఐ (UPI). చాలా మంది ఈ యాప్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌పీసీఐ ఈ యాప్‌ను అందిస్తోంది. దీని ద్వారా కూడా క్షణాల్లో డబ్బులు (Money) పంపొచ్చు. అలాగే డబ్బులు పొందొచ్చు. యూపీఐ ద్వారానే ఈ యాప్ కూడా పని చేస్తుంది.

భీమ్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే యాపిల్ స్టోర్‌కు కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో అనుసంధానం అయిన మొబైల్ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇలా మీరు మీ బ్యాంక్ అకౌట్లను భీమ్ యాప్‌తో లింక్ చేసుకోవచ్చు. తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. అటుపైన ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు.

జస్ట్ 6 నెలల్లోనే రూ.లక్షకు రూ.3 లక్షలు.. డబ్బుల వర్షం కురిపించిన బ్యాంక్‌!

భీమ్ యాప్ వాడే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. భీమ్ యాప్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌పై లిమిట్ ఉంటుంది. రోజుకు ఒకే ట్రాన్సాక్షన్‌పై రూ. లక్ష వరకు పంపొచ్చు. ఒక రోజుకు కూడా గరిష్టంగా రూ. లక్ష వరకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్క బ్యాంక్‌ అకౌంట్‌కు ఇది వర్తిస్తుంది. భీమ్ యాప్‌లో ఇంకా ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసి పే బై యూపీఐ ద్వారా పేమెంట్లు చేయొచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లకు నేరుగా మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బిల్లులు చెల్లించొచ్చు.

నెల నెలా చేతికి రూ.50 వేలు, ఒకేసారి అకౌంట్‌లోకి రూ.కోటి 50 లక్షలు.. రూ.150 పొదుపుతో..

అంతేకాకుండా ఫీచర్ ఫోన్ వాడే వారు కూడా భీమ్ సర్వీసులు పొందొచ్చు. దీని కోసం *99# నెంబర్‌కు డయల్ చేస్తే సరిపోతుంది. గూగుల్ పే, ఫోన్ పే మాదిరిగానే భీమ్ యాప్ ద్వారా కూడా సేవలు చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. అందువల్ల మీరు గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్‌తో పాటుగా ఫోన్‌లో భీమ్ యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం. గూగుల్ పే, ఫోన్ పే పని చేయకపోతే.. భీమ్ యాప్ ద్వారా అయినా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. కాగా భీమ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని భావించే వారు డెబిట్ కార్డు కలిగి ఉండాలి.

First published:

Tags: Bank account, Banks, BHIM UPI, Money, Money Transfer, UPI, Upi payments

ఉత్తమ కథలు