ఆధార్ కార్డ్... ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఓ అవసరంగా మారిన ఐడీ కార్డ్ ఇది ఆధార్ కార్డును (Aadhaar Card) ఐడీ ప్రూఫ్‌గా, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించడం మాత్రమే కాదు... ఆధార్ కార్డు ద్వారా అనేక సేవలు పొందే అవకాశం ఉంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర్నుంచి ప్రభుత్వ పథకాలు పొందడం వరకు ఆధార్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) లాంటి ప్రభుత్వ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ డేటాను ఉపయోగించుకుంటోంది. ఆధార్ నెంబర్ల ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తోంది. మరోవైపు ప్రజా పంపణీ వ్యవస్థ ద్వారా రేషన్ అందించేందుకు కూడా ఆధార్ నెంబర్ కీలకం అవుతోంది. ఇలా ప్రతీ చోటా పౌరులకు ఆధార్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది.
అయితే ఆధార్ కార్డు వివరాలు లీక్ అయితే దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. ఈ చర్యల్ని అడ్డుకోవడం కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పలు సేవల్ని అందిస్తోంది. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్ ఎక్కడెక్కడ వాడారో సులువుగా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్ హోల్డర్లు అందరూ తమ ఆధార్ కార్డ్ హిస్టరీని తెలుసుకునే ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ ఫీచర్ అందిస్తోంది.
IRCTC Tirupati Tour: తిరుమలలో శ్రీవారి దర్శనంతో తిరుపతి టూర్... ప్యాకేజీ ధర రూ.5,000 లోపే
మీ ఆధార్ నెంబర్‌ను మీరు ఎక్కడెక్కడ ఉపయోగించారో ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీలో తెలిసిపోతుంది. మీరు రేషన్ షాపులో సరుకులు తీసుకోవడానికి ఆధార్ నెంబర్ వెల్లడించినా ఆ వివరాలు ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీలో కనిపిస్తాయి. మరి ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1- ఆధార్ కార్డ్ హోల్డర్లు ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత Aadhaar Authentication History పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయాలి.
Step 5- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
Step 6- ఆ తర్వాత ఆథెంటికేషన్ టైప్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆధార్ ఆథెంటికేషన్ డీటెయిల్స్ కావాలో తేదీలు వెల్లడించాలి.
Step 8- ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ డౌన్‌లోడ్ చేయొచ్చు.
Jio New Plan: జియో నుంచి మరో యాన్యువల్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
ఈ డాక్యుమెంట్‌కు పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పేరులోని మొదటి 4 లెటర్స్, పుట్టిన సంవత్సరం కలిపి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ వివరాలను ఎక్కడెక్కడ వాడారో చెక్ చేయాలి. అందులో మీ ప్రమేయం లేకుండా ఆధార్ వివరాలను వాడినట్టు అనుమానం ఉంటే 1947 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. లేదా help@uidai.gov.in ఇమెయిల్ ఐడీకి మీ ఫిర్యాదును పంపొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, UIDAI