హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Card: స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

Aadhaar Card: స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

Aadhaar Card: స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card: స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరా? రూల్స్ ఏం చెబుతున్నాయి? (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card | పిల్లలకు స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ అడుగుతుంటారు. రూల్స్ ప్రకారం అడ్మిషన్ల కోసం ఆధార్ కార్డ్ ఇవ్వడం తప్పనిసరా? ఈ అంశంపై యూనిక్ ఐడెండిటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గైడ్‌లైన్స్ ఉన్నాయి.

ఆధార్ కార్డ్.... యూనిక్ ఐడెండిటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) భారతదేశంలో నివసించేవారికి ఇచ్చే 12 అంకెల ఐడెంటిటీ కార్డ్. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ ఆధార్ నెంబర్ ఇస్తోంది UIDAI. ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్ లాగా, అడ్రస్ ప్రూఫ్‌లాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆధార్ ద్వారా పీఎం కిసాన్ (PM Kisan) లాంటి ప్రభుత్వ పథకాలు కూడా పొందుతుంటారు. మరి స్కూళ్లల్లో పిల్లలకు అడ్మిషన్ (School Admission) తీసుకోవడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరా? ఆధార్ కార్డ్ లేకపోతే అడ్మిషన్ దొరకదా? పిల్లల్ని స్కూళ్లల్లో చేర్చడానికి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది ఆధార్ కార్డ్ (Aadhaar Card) అడగడం మామూలే. ఆధార్ కార్డ్ లేకపోతే అడ్మిషన్లు నిరాకరించే సందర్భాలు కూడా ఉన్నాయి.

UIDAI నిబంధనల ప్రకారం స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదు. స్కూల్ అడ్మిషన్ మాత్రమే కాదు... సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలు (CBSE Exams) , నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET), యూజీసీ నిర్వహించే పరీక్షలకు కూడా ఆధార్ తప్పనిసరి కాదని UIDAI గతంలోనే తెలిపింది. ఒకవేళ ఏదైనా విద్యా సంస్థ లేదా బోర్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలంటే సదరు సంస్థ లేదా బోర్డుపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని యూఐడీఏఐ వివరించింది. ఈ విషయాలను 2018 సెప్టెంబర్ 5న యూఐడీఏఐ ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపింది. ఆ ప్రెస్ రిలీజ్ ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.

Aadhaar Card: ఆధార్ కార్డ్ ఒరిజినలేనా? వెరిఫై చేయడానికి అనేక మార్గాలు

పిల్లలకు ఆధార్ లేదన్న కారణంతో స్కూల్ అడ్మిషన్ లేదా ఇతర సౌకర్యాలు నిరాకరించకూడదు. అటువంటి తిరస్కరణలు చెల్లవు. చట్టం ప్రకారం అనుమతించబడవు. తమ విద్యార్థులకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ సౌకర్యాన్ని అందించడం పాఠశాలల బాధ్యత అని UIDAI తెలిపింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్ రెగ్యులేషన్స్‌లోని 12ఏ నిబంధన ప్రకారం ఇంకా ఆధార్ నంబర్ కేటాయించని విద్యార్థులకు ఆధార్ కార్డ్ వచ్చేలా చేయడం, ఆధార్ డేటాబేస్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేయని పిల్లల వివరాలను అప్‌డేట్ చేయించడం పాఠశాలల బాధ్యత.

Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

కాబట్టి స్కూళ్లల్లో అడ్మిషన్లకు, పరీక్షలకు హాజరుకావడానికి, పోటీ పరీక్షలు రాయడానికి స్కాలర్‌షిప్స్ పొందడానికి ఆధార్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరికాదు. అది స్వచ్ఛందం మాత్రమే. ఇక 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మరి ఆధార్ కాకుండా స్కూళ్లల్లో అడ్మిషన్ల కోసం ఏ డాక్యుమెంట్స్ ఇవ్వొచ్చన్న సందేహాలు తల్లిదండ్రులకు ఉండటం మామూలే. ఆధార్ కార్డ్ లేనివారు బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్, ఒరిజినల్ టీసీ లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వొచ్చు.

First published:

Tags: Aadhaar Card, AADHAR, Admissions, School admissions, UIDAI

ఉత్తమ కథలు