హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investments in Gold: బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Investments in Gold: బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బంగారం లేదా వెండి కొనాలనుకునేవారు, వీటిల్లో ఎప్పుడు పెట్టుబడి చేస్తే మంచిది, ఈ పెట్టుబడులు ఎలాంటి సందర్భాల్లో లాభాలను తీసుకువస్తాయో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

బంగారం, వెండి ధరల్లో మార్పులు సాధారణం. మార్కెట్ ట్రెండింగ్‌ను బట్టి వీటి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఈ రోజుల్లో బంగారాన్ని పెట్టుబడి మార్గంగా ఎంచుకునేవారి సంఖ్య పెరుగుతోంది. వడ్డీ రేట్లు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉండటం, పెట్టుబడుల నుంచి రాబడి తగ్గడం... వంటి కారణాలతో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం లేదా వెండి కొనాలనుకునేవారు, వీటిల్లో ఎప్పుడు పెట్టుబడి చేస్తే మంచిది, ఈ పెట్టుబడులు ఎలాంటి సందర్భాల్లో లాభాలను తీసుకువస్తాయో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫిజికల్ మార్కెట్లలో లేదా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అయిన MCX ద్వారా బంగారం, వెండిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ ప్రతినిధి అనుజ్ గుప్తా సూచిస్తున్నారు.

ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం దిల్లీలో ఫిజికల్ గోల్డ్ స్పాట్ ధర 10 గ్రాములకు రూ.49,500గా ఉంది. వెండి ధర కిలోకు రూ.66,500 వరకు ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని అనుజ్ గుప్తా తెలిపారు. అందువల్ల ప్రస్తుతం వీటిల్లో పెట్టుబడులను కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు.

ఫ్యూచర్స్ మార్కెట్లో ఎప్పుడు అమ్మాలి?

MCXలో ట్రేడింగ్ అయ్యే బంగారం విలువ ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటుంది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.48,840 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌తో పోలిస్తే ఇది దాదాపు 0.3 శాతం వరకు పెరిగింది. MCX గోల్డ్ ఫ్యూచర్స్‌ను రూ.49,000 వద్ద అమ్ముకోవచ్చని అనుజ్ గుప్తా సూచిస్తున్నారు. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.65,400గా ఉంది. ఇది ఒక శాతం వరకు పెరిగింది. దీన్ని రూ.65,500 వద్ద అమ్ముకోవచ్చని ఆయన చెబుతున్నారు.

ధరలు తగ్గే అవకాశం

మీడియం టర్మ్ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికన్ డాలర్‌ విలువ మరింత బలపడే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గే సూచనలు ఉన్నాయి. భారత్‌లో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కస్టమ్ డ్యూటీని తగ్గించాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం కస్టమ్ డ్యూడీ 12 శాతంగా ఉంది. దీన్ని సగానికి తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తే బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుతాయి. అందువల్ల బంగారంలో పెట్టుబడులు చేయాలనుకునే ఇన్వెస్టర్లు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వేచి చూడటం మంచిది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Gold, Gold rates, Investment Plans, Silver

ఉత్తమ కథలు