Home /News /business /

IS IT A PROFIT FOR THE CUSTOMERS WITH THE DEAL OF THE TWO BANKS IS IT A LOSS WHAT IS THE IMPACT ON DEBIT AND CREDIT CARDS UMG GH

Axis-Citi Bank Deal: ఆ రెండు బ్యాంకులు డీల్‌.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటంటే..? డెబిట్, క్రెడిట్ కార్డ్ లపై ఎంత ప్రభావం ఉంటుందంటే !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాక్సిస్ బ్యాంక్- సిటీ బ్యాంక్‌ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి అనుమతి లభించింది. సిటీ బ్యాంక్‌ బిజినెస్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ సొంతం చేసుకునే దిశగా అడుగు పడింది. రూ.12,325 కోట్ల డీల్‌లో సిటీ పర్సనల్‌ లోన్స్‌, క్రెడిట్ కార్డ్‌లు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వర్టికల్స్‌ను బదిలీ చేయడం డీల్‌లో ప్రధాన భాగం.

ఇంకా చదవండి ...
యాక్సిస్ (Axis)బ్యాంక్- సిటీ బ్యాంక్‌ (Citi)డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నుంచి అనుమతి లభించింది. సిటీ బ్యాంక్‌ బిజినెస్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ సొంతం చేసుకునే దిశగా అడుగు పడింది. రూ.12,325 కోట్ల డీల్‌లో సిటీ పర్సనల్‌ లోన్స్‌, క్రెడిట్ కార్డ్‌లు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌ యాక్సిస్ బ్యాంక్‌తో విలీనం అవుతాయి. ఈ ఒప్పందంలో పోర్ట్‌ఫోలియో మేనేజింగ్, క్రెడిట్ కార్డ్‌లు, రిటైల్ కస్టమర్ ఖాతాల విభాగాల సహా పర్సనల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వర్టికల్స్‌ను సిటీ ఇండియా నుంచి యాక్సిస్ బ్యాంక్‌కి బదిలీ చేయడం డీల్‌లో ప్రధాన భాగం. సిటీ గ్రూప్ 1902లో భారతదేశంలోకి ప్రవేశించింది. 1985లో కన్సూమర్‌ బ్యాంకింగ్ బిజినెస్‌ ప్రారంభించింది.

ట్రాన్సిషన్ పీరియడ్‌
మార్చిలో రుణదాతలు ట్రాన్సిషన్‌కు 9-18 నెలలు పడుతుందని చెప్పారు. అదనంగా ఆరు నెలల సమయం అవసరం అవ్వవచ్చని పేర్కొన్నారు. ట్రాన్సిషన్‌ వ్యయం సుమారు రూ.1,500 కోట్లు; ఇందులో రూ.1,100- రూ.1,200 కోట్లను యాక్సిస్ బ్యాంక్ చెల్లిస్తుంది. సిటీ కస్టమర్లు క్రమంగా యాక్సిస్ బ్యాంక్ ప్లాట్‌ఫారమ్‌కి మారుతారు.

సేవలపై ప్రభావం
సిటీ రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారం యాక్సిస్‌ బ్యాంక్‌తో విలీనం అయిన తర్వాత, క్రెడిట్ కార్డ్‌లు, ఇతర సేవల ప్రస్తుత ఫీచర్‌(Features)లు, ప్రయోజనాలు కస్టమర్‌లకు అలాగే ఉంటాయి. లేదా అవి మెరుగవుతాయి. కస్టమర్‌లు తమ బ్యాంక్‌లో ట్రాన్సాక్షన్‌లు చేసుకునేటప్పుడు ఎటువంటి మార్పును చూడరని, కస్టమర్ అనుభవాలు అలాగే ఉంటాయని లేదా మరింత మెరుగవుతాయని యాక్సిస్ బ్యాంక్ అధికారులు చెప్పారు. ట్రాన్సిషన్‌ ముగిసిన తర్వాత, సిటీ రిటైల్ కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్‌లు అవుతారు. కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్ టెక్నాలజీ, విస్తృత ఆఫర్‌లకు యాక్సెస్‌ పొందుతారు.

నో యువర్‌ కస్టమర్‌
విలీనం తర్వాత, KYC మళ్లీ జరుగుతుంది. ఇది రెగ్యులేటర్ అవసరం. ఈ ప్రక్రియను క్రమ క్రమంగా నిర్వహిస్తారు. ముగింపు తేదీకి ముందు ట్రాన్సిషన్‌ ప్రక్రియలలో బ్యాంకులకు నిర్దిష్ట రకమైన సమ్మతి కూడా అవసరం.

ఇదీ చదవండి: Russia-China: అమెరికాకు చెక్ పెట్టనున్నరష్యా- చైనా.. వార్ గేమ్స్ తో భారీ ప్రదర్శనకు శ్రీకారం



 శాఖలు
బ్యాంకుల శాఖలు మారవు. అవి ప్రస్తుతం ఉన్న విధంగానే ఉంటాయి. సిటీ బ్యాంక్‌కు చెందిన చాలా శాఖలు ప్రధాన స్థానాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ వాటిని కస్టమర్ల(Customers)కు సేవ చేయడానికి అలాగే కొనసాగిస్తాయని తెలిపింది.

బెస్ట్‌ డీల్
యాక్సిక్‌ బ్యాంక్‌ ఇది వరకే విడుదల చేసిన ప్రకటనలో..‘ఇది నాణ్యమైన డీల్‌. మెరుగైన క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియో, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కస్టమర్స్‌, 81 శాతం CASA, బలమైన వినియోగదారుల రుణ పోర్ట్‌ఫోలియో, లాభదాయకమైన విభాగాలుసిటీ బ్యాంక్‌కి ఉన్నాయి. కొనుగోలు తర్వాత, యాక్సిస్ బ్యాంక్ 28.5 మిలియన్ సేవింగ్స్ ఖాతాలను, 2.3 లక్షలకు పైగా బుర్గుండి కస్టమర్లను, 10.6 మిలియన్ క్రెడిట్‌ కార్డు(Credit Card)లను పొందుతుంది.’ అని పేర్కొంది.



మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్, కార్డ్స్ అండ్ పేమెంట్స్ హెడ్ సంజీవ్ మోఘే మాట్లాడుతూ.. ‘క్రెడిట్ కార్డ్‌ల జారీని Q3 (అక్టోబర్-డిసెంబర్) నుంచి పెంచుతాం. మొత్తం 9 మిలియన్ల CIF (అమలులో ఉన్న కార్డులు)తో సంవత్సరాన్ని ప్రారంభించాం. RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఇటీవల కార్ట్‌లను క్లోజ్‌ చేయడంపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఏడాది చివరిలో (మార్చి 31, 2023) దాదాపు 12 మిలియన్ కార్డ్‌ల వద్ద మొత్తం CIFని అంచనా వేస్తున్నాం. ఈ సంఖ్యలు చాలా బలంగా ఉన్నాయి. సహజంగానే, ఏదో ఒక సమయంలో, డిసెంబర్ లేదా మార్చి నాటికి, సిటీ పోర్ట్‌ఫోలియో జోడించబడినప్పుడు, అది మరో 2.5 మిలియన్ కార్డ్‌లు అవుతుంది’ అని చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: Axis bank, Citi bank, Credit card, Debit card

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు