Crypto Investment: భారత్‌లో క్రిప్టో కరెన్సీ చట్టబద్దమైనదేనా? బిట్‌కాయిన్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ కరెన్సీ కొనుగోలులో భారతీయులు ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటికే దేశంలో 10 కోట్ల మంది క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేశారని బ్రోకర్ చూజ్ ( BrokerChoose) పరిశీలనలో తేలింది.

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థల చర్చల్లో క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ వర్చువల్ కరెన్సీ (Virtual Currency)పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీని భారతీయులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అయితే మన దేశంలో బిట్ కాయిన్ కొనుగోళ్లకు చట్టబద్దత ఉందా? ఒక వేళ బిట్ కాయిన్ (Bitcoin) కొనుగోలు చేసి నష్టపోతే ప్రభుత్వం అండగా నిలుస్తుందా? అసలు బిట్ కాయిన్ కొనుగోలు ఎలా చేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

క్రిప్టో కరెన్సీ కొనుగోలులో భారతీయులు ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటికే దేశంలో 10 కోట్ల మంది క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేశారని బ్రోకర్ చూజ్ ( BrokerChoose) పరిశీలనలో తేలింది. మన దేశంలో క్రిప్టో కరెన్సీ కొనుగోళ్లకు చట్టబద్దత లేదు. ఎవరైనా క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తే మాత్రం దానిపై వచ్చే లాభనష్టాలకు వారే బాధ్యులు. ఇందుకు కేంద్ర ప్రభుత్వంగానీ, ఆర్బీఐగాని ఎలాంటి బాధ్యత వహించవు.

పాత కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి

దూసుకుపోతున్న క్రిప్టో కరెన్సీ
మన దేశంలో గత ఏడాది రూ.1500 కోట్లు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టగా అది ఈ ఏడాది రూ.3 లక్షల కోట్లకు ఎగబాకినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో క్రిప్టో కరెన్సీ పై పార్లమెంటులో చట్టం చేయాలని భావిస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఆలోచన కూడా మారినట్టు అర్థం అవుతోంది.

Xiaomi: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి త్వరలోనే Electric Car విడుదల...

క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకం కాదని, దీనిపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. రియల్ ఎస్టేట్, షేర్స్, బంగారం కొనుగోలు తరహాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ను కూడా చట్టబద్దం చేసి దాన్ని అమ్మినప్పుడు వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వసూలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

* క్రిప్టో కరెన్సీ ఎక్కడ కొనుగోలు చేయాలి?
భారతీయులు ప్రతి రోజూ వందల కోట్ల రూపాయలను క్రిప్టో కరెన్సీ కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీల ద్వారా ఆన్ లైన్లో ఈ వ్యవహారం మొత్తం సాగిపోతోంది. మన దేశంలో వాజిర్ ఎక్స్ (WazirX), కాయిన్ డీసీఎక్స్ (CoinDCX), జెబ్ పే (Zebpay), యునోకాయిన్ (Unocoin) ఎక్స్ఛేంజీల ద్వారా క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేయవచ్చు.

Top electric scooters in india 2021: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..టాప్ 5 చాయిస్ ఇవే...

* క్రిప్టో ఎక్స్ఛేంజ్ ద్వారా ఎలా పెట్టుబడి పెట్టాలి
పెట్టుబడిదారులు ఏదైనా క్రిప్టో ఎక్స్ఛేంజ్ సైట్ ఓపెన్ చేసి ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తో రిజిస్టర్ చేసుకోవాలి. అథెంటిఫికేషన్ కోసం కేవైసీ వివరాలు ఇవ్వాలి. తరువాత వెరిఫికేషన్ పూర్తవుతుంది. అనంతరం నిధులను క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ట్రాన్స్ ఫర్ చేసి ట్రేడింగ్ ప్రారంభించవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published: