IS CENTRAL GOVERNMENT CHANGE INTEREST RATES FOR SMALL SAVINGS SCHEMES HERE IS THE DETAILS HSN GH
Interest rates- Small Savings Schemes: బడ్జెట్ ఎఫెక్ట్.. పాపులర్ సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీ విషయంలో కేంద్రం నిర్ణయం ఇదేనా..?
ప్రతీకాత్మక చిత్రం
రానున్న ఆర్థిక సంవత్సరం 2021-22 (FY22) స్మాల్ సేవింగ్స్ స్కీమ్ నుంచి వచ్చే ఫండింగ్ సుమారు 3.9 లక్షల కోట్లు అంటే ఫిస్కల్ డెఫిసిట్ లో 26శాతం ఉంటుందనే అంచనాలున్నాయి. దీన్నిబట్టి కేంద్రం చిన్న మొత్తాల పొదుపుపై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈకారణంగా ఇలాంటి పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లు..
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై చెల్లించే వడ్డీని కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచుంతుందని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. Public Provident Fund (PPF) పై కేంద్ర బడ్జెట్ లో పన్నులు బాదిన నేపథ్యంలో ఇలాంటి స్మాల్ సేవింగ్స్ పై కేంద్రం మరింత దూకుడుకు వెళ్లకపోవచ్చనే బలమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఇది చిన్న మొత్తాల్లో పొదుపు చేసే కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, పీపీఎఫ్ నిధులనే కేంద్రం ఫిస్కల్ డెఫిసిట్ కోసం వినియోగించాల్సి ఉండటమే దీనికి కారణం. 2021 ఫిస్కల్ ఇయర్ విషయానికి వస్తే కేంద్ర కనీసం 2.40 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇలాంటి పథకాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుందని కేంద్ర అంచనా వేసింది. కానీ ఈ ఫిస్కల్ ఇయర్ లో చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా 4.80 లక్షల కోట్లు సేకరించాల్సి రావటంతో PPF, NSC వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
రానున్న ఆర్థిక సంవత్సరం 2021-22 (FY22) స్మాల్ సేవింగ్స్ స్కీమ్ నుంచి వచ్చే ఫండింగ్ సుమారు 3.9 లక్షల కోట్లు అంటే ఫిస్కల్ డెఫిసిట్ లో 26శాతం ఉంటుందనే అంచనాలున్నాయి. దీన్నిబట్టి కేంద్రం చిన్న మొత్తాల పొదుపుపై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈకారణంగా ఇలాంటి పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచకపోతే ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మళ్లుతారనే భయం కేంద్రానికి ఉంది.
వడ్డీ సవరింపు 3 నెలలకోమారు..
ఇలాంటి పథకాలపై కేంద్ర ఆర్థికశాఖ ప్రతి మూడు నెలలకు ఓసారి త్రైమాసిక వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ఫిస్కల్ ఇయర్ 2021 లో లాస్ట్ క్వార్టర్ లో పీపీఎఫ్ పై చెల్లించే 7.1శాతం, ఎన్ ఎస్ సీపై చెల్లించే 6.8శాతం వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా కొనసాగించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీములపై చెల్లించే 7.4శాతం వడ్డీని యథాతథంగా కేంద్రం చెల్లిస్తోంది.
పాపులర్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే..
FY21జనవరి-మార్చ్ క్వార్టర్ లో సుకన్యా సమృద్ధి యోజనపై చెల్లించే వడ్డీ 7.6శాతం ఉండగా కిసాన్ వికాస్ పత్రాపై 6.9శాతం వడ్డీని కేంద్రం చెల్లించింది. ఈ వడ్డీ రేట్లను FY21ఫస్ట్ క్వార్టర్ లో 140బీపీఎస్ కు తగ్గించి, ఆతరువాత వీటిని యథాతథంగా ఉంచింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో పాపులర్ గవర్నమెంట్ సేవింగ్స్ స్కీమ్స్ గా పేరుగాంచిన PPF, Atal Pension Yojana, National Savings Certificates, Post Office Savings Accountలు మనదేశంలో అన్ని వర్గాల ప్రజలనుంచి అత్యధిక ఆదరణ చూరగొంటోంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్ (POMIS), Sukanya Samriddhi Yojanaవంటివి వాటిలో కొన్ని పథకాలు.