హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance: రూ.1 కోటి కవరేజీ అందించే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మనకు అవసరమా..? నిపుణుల సూచనలివే..

Health Insurance: రూ.1 కోటి కవరేజీ అందించే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మనకు అవసరమా..? నిపుణుల సూచనలివే..

Health Insurance

Health Insurance

Health Insurance: సాధారణంగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు రూ.1 కోటి వరకు కవరేజీ ఉంటుంది. అయితే ఇప్పుడు హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు కూడా రూ.1 కోటి కవరేజీ లభిస్తోంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో హెల్త్ కవరేజీ నిజంగా అందరికీ అవసరమేనా అనేది అసలు ప్రశ్న. దీనిపై నిపుణుల సూచనలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారీ వైద్య ఖర్చులను కవర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) స్కీమ్స్ పరిధి ప్రస్తుతం పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ (Covid-19) తర్వాత చాలామంది హెల్త్ పాలసీలు కొనుగోలు చేస్తున్నారు. వైద్య అవసరాలకు పెద్దమొత్తంలో అయ్యే ఖర్చులను హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌లు చెల్లిస్తాయి. ఖరీదైన వైద్యం చేయించుకొని అప్పుల బారిన పడకుండా సహాయపడుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీలు తీసుకొనే వారి సంఖ్య పెరిగినా.. చాలా మందికి ఎంత ఆరోగ్య బీమా కవరేజీ అవసరం అనే దానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే చిన్నపాటి ట్రీట్‌మెంట్‌కు కూడా కొన్నిసార్లు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు రూ.1 కోటి కవరేజీ అందించే హెల్త్ పాలసీలకు డిమాండ్‌ పెరిగిందని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెబుతున్నాయి.

సాధారణంగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు రూ.1 కోటి వరకు కవరేజీ ఉంటుంది. అయితే ఇప్పుడు హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు కూడా రూ.1 కోటి కవరేజీ లభిస్తోంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో హెల్త్ కవరేజీ నిజంగా అందరికీ అవసరమేనా అనేది అసలు ప్రశ్న. దీనిపై నిపుణుల సూచనలు తెలుసుకుందాం.

* ఇంత కవరేజీ అవసరమా?

ప్రస్తుతం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల హెల్త్ కవర్ సరిపోదు. అన్ని రకాల అవసరాలను ఈ కవరేజీ అందించే పాలసీలు తీర్చలేవు. అయితే రూ.1 కోటి కవర్ అందరికీ అవసరం లేదు. ఎందుకంటే ఆస్పత్రి బిల్లులు చాలా ఎక్కువగా రావడం అనేది అరుదుగా జరుగుతుంది. వాస్తవానికి భారతదేశంలో రూ.20 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఆసుపత్రి ఖర్చులు చాలా అరుదు. అయితే ఇది అసాధ్యంగా భావించలేం.

* తెలుసుకోవాల్సిన విషయాలు..

ప్రస్తుతం హెల్త్ పాలసీలు తక్కువ ధరకు లభిస్తున్నా, భవిష్యత్తులో ఇవి ఆర్థికంగా భారం కాకుండా చూసుకోవాలి. కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ రూ.1కోటి ఆరోగ్య బీమా పాలసీలు తమకు ఆర్థికంగా లాభదాయకం కాదని బీమా సంస్థలు భావిస్తే.. ప్రీమియంలను భారీగా పెంచవచ్చు. కొన్నిసార్లు ఈ పాలసీలను నిలిపివేయవచ్చు. ఇలాంటప్పుడు ఇతర ప్రత్యామ్నాయాలను అందిస్తారు. ఇలాంటివి సాధారణంగా ఖరీదైనవిగా ఉంటాయి.

ఒక హెల్త్ పాలజీ కేవలం పెద్ద మొత్తంలో కవరేజీ అందిస్తే సరిపోదు. వివిధ వ్యాధులకు కవర్‌లో ఉన్న సబ్‌ లిమిట్స్‌, గది అద్దె పరిమితులు, వైద్య ఖర్చులు, ఇతర మినహాయింపులు కూడా ముఖ్యమే. రూ.1 కోటి కవరేజీ ఉన్నంత మాత్రాన 100 శాతం కవర్‌ అందదు. కాబట్టి కేవలం రూ.కోటి కవరేజీతో అన్ని లభిస్తాయని కాదు. ఆర్థికంగా బలంగా ఉన్న వారికి ఏ సమస్యా లేకపోయినా.. సాధారణ కుటుంబాలు ఈ విషయంలో ఆలోచించాలి. చాలా వరకు రూ.25 లక్షల కవర్ (బేస్ లేదా బేస్ + టాప్-అప్ కలయిక) సరిపోతుంది.

ఇది కూడా చదవండి : రైలు ఆలస్యమైతే మీరు ఈ సర్వీస్ ను ఫ్రీగా పొందవచ్చు.. అది మీ హక్కు..!

* ఎంత ఆరోగ్య బీమా అవసరం?

ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబానికి, చాలా సందర్భాలలో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల కవర్ సరిపోతుంది. అటువంటి కవర్‌ను రెండు విధాలుగా తీసుకోవచ్చు. ముందు రూ.10 లక్షల చిన్న బేస్ ప్లాన్ తీసుకోండి. తర్వాత రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన సూపర్-టాప్ అప్ కవర్‌తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

ఈ టాప్-అప్‌లు చాలా చౌకగా ఉంటాయి. అందుకే ఆర్థికంగా భారంగా అనిపించవు. రూ.25 లక్షల కంటే కవర్‌ని మరింత పెంచుకోవడానికి బేస్ ప్లాన్, టాప్-అప్ పరిధిని మరింత పెంచుకోవచ్చు. లార్జ్ హెల్త్ కవర్‌ ఉండటం మంచిది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది. ఇది ప్రతి ఒక్కరూ ఎక్కువ ప్రీమియం చెల్లించడానికి ఇష్టపడరు. కాబట్టి రూ.1 కోటి పాలసీకి ప్రీమియం భరించగలరా, ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితులకు అవసరమా? లేదా? అనేది పరిశీలించాలి. ఉన్న అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, ఇతర నిబంధనల గురించి క్షుణ్నంగా తెలుసుకుని, అవసరమైన కవరేజీని ఎంచుకోవాలి. ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health Insurance, Personal Finance

ఉత్తమ కథలు