హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price: రూ.30 వేలకే తులం బంగారం.. కొంటే కలిగే లాభాలివే.. అదొక్కటే మైనస్!

Gold Price: రూ.30 వేలకే తులం బంగారం.. కొంటే కలిగే లాభాలివే.. అదొక్కటే మైనస్!

WGC తన త్రైమాసిక నివేదికలో చైనా కఠినమైన కోవిడ్ జీరో పాలసీ, కష్టాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కలయిక వలన అక్కడ డిమాండ్ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. బంగారం ప్రధాన వినియోగదారుగా ఉన్న భారతదేశం, రూపాయి విలువ క్షీణించడం, అధిక దిగుమతి సుంకం కారణంగా తక్కువ కొనుగోలును చూడవచ్చు.

WGC తన త్రైమాసిక నివేదికలో చైనా కఠినమైన కోవిడ్ జీరో పాలసీ, కష్టాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కలయిక వలన అక్కడ డిమాండ్ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. బంగారం ప్రధాన వినియోగదారుగా ఉన్న భారతదేశం, రూపాయి విలువ క్షీణించడం, అధిక దిగుమతి సుంకం కారణంగా తక్కువ కొనుగోలును చూడవచ్చు.

Gold Rate | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే రూ.30 వేలకు కూడా 10 గ్రాముల గోల్డ్ కొనొచ్చు. 999, 916, 750 ప్యూరిటీ గోల్డ్‌తో పోలిస్తే ఈ బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఇలాంటి బంగారం కొనడం వల్ల ఎలాంటి లాభనష్టాలు ఉంటాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Today Gold Price | బంగారం కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీరు తులం బంగారం కొనాలంటే రూ. 50 వేలు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మీరు తక్కువ రేటులో కూడా బంగారు ఆభరణాలు (Gold Jewellery) కొనుగోలు చేయొచ్చు. అయితే ఇవి 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు బంగారం మాత్రం కాదు. 14 క్యారెట్ల బంగారం (Gold). మార్కెట్‌లో 14 క్యారెట్ల బంగారం కూడా అందుబాటులో ఉంది. ఇటీవల కాలంలో ఈ రకం బంగారం కొనుగోలు చేసే వారు కూడా పెరుగుతూ వస్తున్నారు. ఎందుకంటే దీనికి పలు కారణాలు ఉన్నాయి. ధర, మన్నిక, చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడం వంటి వాటి వల్ల చాల మంది మరీ ముఖ్యంగా యువత ఈ తరహా బంగారం కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా బంగారం ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఇంకొంత మంది ఈ తరహా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది 22 క్యారెట్ల లేదంటే 18 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ బంగారం కొనాలంటే రూ. 50 వేలు చెల్లించుకోవాల్సి ఉంది. అందుకే చాలా మంది 14 క్యారెట్ల బంగారం వైపు చూస్తున్నారు. దీని రేటు తులం రూ. 30 వేల వరకు ఉంది. కాగా ఈ ధరకు జీఎస్‌టీ, తయారీ చార్జీలు వంటివి అదనం అని గుర్తించుకోవాలి.

  14 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇందులో 58.3 శాతం బంగారం ఉంటుంది. దీంతో ఈ బంగారంతో చేసిన ఆభరణాలు మిగతా గోల్డ్ జువెలరీ కన్నా గట్టిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఈ పసిడి రేటు 22 శాతం, 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 36 శాతం చౌక ధరకు వస్తుంది. అలాగే ఇకపోతే మీరు ఏ బంగారం కొన్నా కూడా తయారీ చార్జీలు దాదాపు ఒకేలా ఉంటాయి. అందుబాటు ధరలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్. తనిష్క్, కాండెరే వంటి పలు సంస్థలు కూడా ఈ తరహా గోల్డ్ జువెలరీని అందిస్తున్నాయి.

  ఉద్యోగులకు హెచ్చరిక.. ఈ బిల్లులు పడేయొద్దు.. లేదంటే..

  14 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 3 వేల నుంచి ప్రారంభం అవుతోంది. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ గోల్డ్‌ను ఎక్కువగా కొంటున్నారని తనిష్క్ మియా బిజినెస్ హెడ్ శ్యామల రామనన్ తెలిపారు. అంతేకాకుండా మరో బెనిఫిట్ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో కూడా ఈ బంగారం కొనొచ్చు. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఇలాంటి జువెలరీ కొనొచ్చని కాండేరె.కామ్ ఫౌండర్, సీఈశో రూపేశ్ జైన్ తెలిపారు. లేదంటే నేరుగా జువెలరీ సంస్థల వెబ్‌సైట్ ద్వారా కొనొచ్చు. 15 రోజుల రిటర్న్ పాలసీ కూడా ఉంది. అయితే అన్నింటికీ ఇది వర్తించకపోవచ్చు. అందుకే ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు ఈ విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మియా, కాండెరే, కారట్లేన్ వంటి బ్రాండ్ల కింద మీరు 14 క్యారెట్ల బంగారం కొనొచ్చు.

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్! ఈరోజు నుంచి..

  అయితే కొంత మంది 14 క్యారెట్ల బంగారం కొనుగోలు చేయడానికి జంకుతూ ఉంటారు. దీనికి కారణం రీసేల్ ఉండదనే భయం. అయితే కంపెనీలు మాత్రం లైఫ్‌టైమ్ ఎక్స్చేంజ్ పాలసీ అందిస్తున్నాయి. అందువల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయతే కొనే ముందు ఈ విషయాన్ని కూడా ఒకసారి ధ్రువీకరించుకోండి. అలాగే మీరు బంగారం తిరిగి విక్రయించాలని భావిస్తే.. ప్యూర్ గోల్డ్ జువెలరీపై 3 శాతం తరుగు తీసేస్తారు. అలాగే డైమండ్స్, జెమ్‌స్టోన్ జువెలరీ అయితే 10 నుంచి 30 శాతం వరకు తరుగు తీసేస్తారు. 18 క్యారెట్లు, 22 క్యారెట్లకు ఇది వర్తిస్తుంది. అలాగే కారట్లేన్ వంటి సంస్థలు అయితే 2 శాతం హ్యాండ్లింగ్ చార్జీలు తీసుకుంటోంది. డబ్బులు మాత్రం ఇవ్వరు. ఇతర బంగారం కొనాల్సి ఉంటుంది.

  లోన్ పొందటం సాధ్యం కాదు

  కాగా 14 క్యారెట్ల బంగారం కొంటే ఒక్కటే మైనస్ ఉంటుంది. బంగారాన్ని బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకోవడం కుదరదు. 18 క్యారెట్లు లేదా ఆపైన స్వచ్ఛత కలిగిన బంగారం పైనే లోన్ ఇస్తున్నాయి. అందువల్ల ఈ తరహా బంగారం కొనే వారు ఈ విషయాన్ని మాత్రం గుర్తించుకోవాలి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Gold, Gold jewellery, Gold price, Gold price in hyderabad, Gold rate

  ఉత్తమ కథలు