హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRF Request: కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి నిబంధన ఉపసంహరించుకోవాలి.. గడ్కరీకి IRF లేఖ..

IRF Request: కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి నిబంధన ఉపసంహరించుకోవాలి.. గడ్కరీకి IRF లేఖ..

నితిన్ గడ్కరీ(ఫైల్ ఫొటో)

నితిన్ గడ్కరీ(ఫైల్ ఫొటో)

IRF Request: అక్టోబర్ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని రోడ్డు భద్రత సంస్థ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (IRF) కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల(MoRTH) మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India) లో కార్ల (Cars)లో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించే సంఖ్య పెరగకపోతే ఎయిర్‌బ్యాగులు (Airbags) ఉండి కూడా ప్రయోజనం లేదని రోడ్డు భద్రత సంస్థ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (IRF) తెలిపింది. లేకపోతే ఈ నిర్ణయం రక్షణ ఇవ్వదని, ప్రాణాంతకం అవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసింది. 2023 అక్టోబర్ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని రోడ్డు భద్రత సంస్థ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (IRF) కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల(MoRTH) మంత్రి నితిన్ గడ్కరీని కోరింది. ఈ నిర్ణయం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని తెలిపింది. వాహనంలోని ప్రయాణీకులు సీటు బెల్టులు ధరించకపోతే తీవ్ర గాయాల పాలవుతారని, మరణాలు సంభవించే ప్రమాదం ఉందని IRF పేర్కొంది.

* వెనుక సీటు బెల్టు ధరించే వారి సంఖ్య పెరగాలి

కారు వెనుక సీట్లలో కూర్చునేవారు సీటు బెట్లు ధరించే సంఖ్య 85 శాతానికి చేరిన తర్వాత, ప్రయాణీకుల వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో IRF పేర్కొంది. వెనుక సీటు బెల్టులు ధరించే వారి సంఖ్య భారతదేశంలో 85 శాతం దాటిన తర్వాత, ప్రభుత్వం ఈ ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల నిబంధనలు అమలు చేయాలని, లేకపోతే అది ప్రతికూలంగా మారుతుందని చెబుతున్నారు ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్(IRF) ఎమెరిటస్ అధ్యక్షుడు కె.కె.కపిల.

సీటు బెల్ట్‌లు ప్రాథమిక నియంత్రణ పరికరాలు అయితే ఎయిర్‌బ్యాగ్‌లు సప్లిమెంట్‌ సపోర్ట్‌గా ఉంటాయని పేర్కొన్నారు. సీటు బెల్ట్ లేకుండా ఎయిర్‌బ్యాగ్‌ని ఏర్పాటు చేస్తే, అది తీవ్రమైన గాయాలు, మరణానికి కూడా కారణమవుతుందని అనేక ప్రపంచ అధ్యయనాలు తెలిపాయని కపిల వివరించారు.

* తీవ్రగాయాలు, మరణానికి దారితీస్తాయి

ఇంకా కపిల మాట్లాడుతూ.. ‘సీట్ బెల్ట్‌లు, ఎయిర్‌బ్యాగ్‌లు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. సీటు బెల్ట్ లేని ఎయిర్‌బ్యాగ్ తీవ్రమైన గాయాలు, మరణానికి కూడా కారణమవుతుంది. తీవ్రమైన గాయం కాకుండా ఉండేందుకు సీటు బెల్ట్ ఉపయోగించాలి. ఎయిర్‌బ్యాగ్‌లు ప్రత్యేకంగా సీటు బెల్టులతో కలిపి ఉపయోగించేలా రూపొందించారు. 87 శాతం కారు ప్రమాద మరణాలలో బాధితులు సీటు బెల్ట్ ధరించడం లేదని అధ్యయనాల్లో తేలింది. 96 శాతం మంది కారు ప్రయాణికులు వెనుక సీటులో సీటు బెల్టులు ధరించరు. ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి సీటు బెట్లు ధరించకపోతే పొజిషన్‌లో ఉండరు. ఇలాంటప్పుడు ఎయిర్‌బ్యాగ్‌ ఓపెన్‌ అయినా లాభం లేదు.’ అని కపిల స్పష్టం చేశారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Airbags, Auto, Cars, Central Government, Nitin Gadkari

ఉత్తమ కథలు