Home /News /business /

IRDI HAS BROUGHT NEW MOTOR INSURANCE POLICIES WITH MANY MORE BENEFITS TAKE A LOOK UMG GH

Motor Insurance Riders: కొత్త మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు తెచ్చిన ఐఆర్డీఏఐ.. వాటితో మరెన్నో లాభాలు ..! ఓ లుక్కేయండి

కొత్త మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు తెచ్చిన ఐఆర్డీఏఐ.. వాటితో మరెన్నో లాభాలు ..! లుక్కేయండి

కొత్త మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు తెచ్చిన ఐఆర్డీఏఐ.. వాటితో మరెన్నో లాభాలు ..! లుక్కేయండి

ఇన్సూరెన్స్‌(insurance) పాలసీలను టెక్నాలజీ మార్చేసింది. దీంతో దేశంలోని ప్రతి ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈ మార్పులను అందిపుచ్చుకునేలా చూస్తోంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI). ఈ క్రమంలో మూడు కొత్త మోటర్ ఇన్సూరెన్స్ రైడర్‌లను కూడా ప్రవేశపెట?

ఇంకా చదవండి ...
ఇన్సూరెన్స్‌( Insurance)పాలసీలను టెక్నాలజీ మార్చేసింది. దీంతో దేశంలోని ప్రతి ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈ మార్పులను అందిపుచ్చుకునేలా చూస్తోంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI). ఈ క్రమంలో మూడు కొత్త మోటర్ ఇన్సూరెన్స్ రైడర్‌లను కూడా ప్రవేశపెట్టింది. ‘కొత్త యాడ్‌ ఆన్స్‌తో మోటార్ ఓన్ డ్యామేజ్ కవర్‌కు చాలా ప్రయోజనాలు అందుతాయి. ఇన్సూరెన్స్ కవరేజీ కూడా పెరుగుతుంది.’ ఐఆర్‌డీఏఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త రైడర్స్ ఏంటి, వాటి ప్రయోజనాలు ఏవి, అవి ఎలా పనిచేస్తాయి.. వంటి వివరాలు తెలుసుకుందాం.

Pay as you drive
‘పే యాస్‌ యు డ్రైవ్‌’ విషయంలో.. నిర్దిష్ట కిలోమీటర్లు ప్రయాణించే వరకు ఇన్సూరెన్స్‌ పాలసీ వర్తిస్తుంది. వాహనాలను అరుదుగా ఉపయోగించే వారికి ఈ ప్రీమియం స్టాండర్డ్‌ ప్లాన్‌ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఒక కస్టమర్(customer)తన వాహనాన్ని నడుపుతున్న కిలోమీటర్ల సంఖ్య ఆధారంగా ఇన్సూరెన్స్‌ కోరుకుంటే ఈ కవర్‌ను ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు అవసరాలకు మరింత సూక్ష్మమైన విధానాన్ని IRDAI ప్రవేశపెట్టింది. డ్రైవ్ యాస్-యు-డ్రైవ్ మోడల్ అనేది కిలోమీటర్ల సంఖ్య లేదా నడిచే దూరం ఆధారంగా వర్తించే ఆప్షనల్‌ రైడర్. కాబట్టి, అందరికీ ఫ్లాట్ రేట్‌కు కట్టుబడి ఉండాల్సిన బదులు వినియోగాన్ని బట్టి ఒకరు ప్రీమియం చెల్లిస్తారు. ఇంటి నుంచి పని చేసే వారికి లేదా ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉన్న వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


Pay how you drive
డ్రైవింగ్ అలవాట్లు.. ఇన్సూరెన్స్‌ అవసరాల గురించి బహిర్గతం చేయగలవు. బాధ్యతాయుతమైన డ్రైవర్ ప్రమాదానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈ పొటెన్షియల్‌ను అర్థం చేసుకుని, పాలసీలో చేర్చే వ్యవస్థ ఏదీ లేదు. రెగ్యులేటర్ ఇటీవల ఆమోదించిన 'పే హౌ యు డ్రైవ్' మోడల్ ఇన్సూరెన్స్‌ అంశాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. పాలసీదారు డ్రైవింగ్ అలవాట్లకు అనుగుణంగా ప్లాన్‌లు ఉంటాయి. డ్రైవింగ్ నియమాలను అనుసరించి నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి సాధారణం కంటే తక్కువ ప్రీమియంలను పొందే అవకాశం ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ గౌరవించడం, సూచించిన వేగంతో డ్రైవింగ్ చేయడం వంటివి కీలకమవుతాయి. ఇది సాధారణంగా వాహనంలోని GPS ట్రాకర్‌ని ఉపయోగించి లెక్కిస్తారు. వ్యక్తిగత డ్రైవర్లకు సరైన ప్రీమియంను సిఫార్సు చేసే అల్గారిథమ్‌లు బ్యాకెండ్‌లో ఉన్నాయి. ఈ రైడర్ కారు యజమానికి సరసమైన ఒప్పందాన్ని అందించడమే కాకుండా, నియమాలు, నిబంధనలను గౌరవించేలా ఇతర డ్రైవర్లను ప్రోత్సహిస్తుంది.



ఫ్లోటర్ పాలసీలు
ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉంటే.. వాటిలో ప్రతిదానికి ప్రత్యేక ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకోవడం విసుగు కలిగించవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పాలసీలను మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది. ఇతరుల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి తెలివిగల పరిష్కారం ఫ్లోటర్ పాలసీ. ఇది మల్టిపుల్‌ వెహికల్స్ కోసం ఒక మిక్స్‌డ్ పాలసీగా పనిచేస్తుంది. పాలసీదారులకు తక్కువ ప్రీమియం ఖర్చు అవుతుంది. ఎక్కువ వాహనాలకు పాలసీ ప్రయోజనాలను విస్తరిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Drivers, Insurance, Irdai, New policy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు