Home /News /business /

IRDAI TO ALLOW LIFE INSURANCE COMPANIES TO OFFER HEALTH INSURANCE POLICIES SOON THIS DECISION WILL BENEFIT LIFE INSURANCE CORPORATION OF INDIA SS

Health Insurance: ఎల్ఐసీ నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు... IRDAI కీలక నిర్ణయం?

Health Insurance: ఎల్ఐసీ నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు... IRDAI కీలక నిర్ణయం?
(ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance: ఎల్ఐసీ నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు... IRDAI కీలక నిర్ణయం? (ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance | త్వరలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ అమ్మనున్నాయి. దీనిపై ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) నిర్ణయం తీసుకోనుంది.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందించే లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు చాలా పాపులర్. లైఫ్ ఇన్స్యూరెన్స్ విషయంలో ఇండియన్ మార్కెట్‌లో ఎల్ఐసీదే హవా. అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీల విషయానికి వచ్చేసరికి ఎల్ఐసీ చాలా వెనకబడి ఉంది. ఇందుకు కారణం ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) విధించిన నిషేధమే. లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ అమ్మకూడదని ఐఆర్‌డీఏఐ ఆరేళ్ల క్రితం నిషేధం విధించింది. దీంతో ఎల్ఐసీతో పాటు ఇతర లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలేవీ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలను అమ్మట్లేదు. ఎల్ఐసీ దగ్గర కేవలం రెండు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలను మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఆరేళ్ల క్రితం విధించిన నిషేధాన్ని ఐఆర్‌డీఏఐ ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్టు CNBC-TV18 వార్తా కథనం పబ్లిష్ చేసింది. నిషేధం ఎత్తేస్తే లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు అమ్మొచ్చు. జీవిత బీమా కంపెనీలు హెల్త్ ప్లాన్స్ అందించడానికి సాధ్యత, వ్యాపార పరిధిని పరిశీలించడానికి 2020 ఫిబ్రవరిలో ఎల్ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్, న్యూ ఇండియా అష్యూరెన్స్ మాజీ ఛైర్మన్ జీ శ్రీనివాసన్ నేతృత్వంలో 9 మంది సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏడాదిన్నర క్రితమే తమ సిఫార్సులను కూడా పంపించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా హెల్త్ పాలసీలు అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని సూచించింది.

Gas Subsidy: గ్యాస్‌పై కేంద్రం ప్రకటించిన రూ.200 సబ్సిడీ కావాలా? అయితే ఈ స్కీమ్‌లో చేరండి

అప్పటి నుంచి ఈ సూచనలు అలాగే ఉన్నాయి. అమలులోకి రాలేదు. ఇటీవల ఐఆర్‌డీఏఐకి దేబాషిష్ పాండా ఛైర్మన్‌గా వచ్చారు. దీంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఇటీవల మార్కెట్లో లిస్ట్ అయిన ఎల్ఐసీకి ఓ గొప్ప అవకాశం రానుంది. ఇప్పటికే గ్రామగ్రామానికి విస్తరించిన ఎల్ఐసీకి బిజినెస్ పెంచుకోవడానికి ఇది ఓ మంచి అవకాశం కానుంది. అది ఎల్ఐసీకి లాభమే. పరోక్షంగా ప్రభుత్వానికి కూడా లాభమే.

కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ప్రజల్లో హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకోవాలన్న స్పృహ పెరుగుతుండటంతో హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ఆదాయం బాగా పెరిగింది. అయితే లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు హెల్త్ ప్లాన్స్ అమ్మేందుకు అనుమతి ఇస్తే హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు, జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల ఆదాయానికి దెబ్బ పడే అవకాశం ఉంది. వారి ఫిర్యాదులను కూడా ఐఆర్‌డీఏఐ పరిగణలోకి తీసుకోనుంది.

Ooty Tour: ఊటీ వెళ్తారా? తక్కువ రూ.10,000 లోపే తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ

నేషనల్ ఇన్స్యూరెన్స్ అకాడమీ గత నెలలో రిలీజ్ చేసిన పరిశోధనా పత్రం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం మొత్తం రూ.73,330 కోట్లు వచ్చింది. గతేడాది ఈ ప్రీమియం రూ.58,572 కోట్లు మాత్రమే. 24శాతం వృద్ధి కనిపించింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Health Insurance, LIC, LIC IPO, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు