థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కొత్త రూల్స్

వాహనానికి ఏడాదికోసారి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకునే నిబంధనను ఐఆర్‌డీఏఐ మార్చేసింది. ఇకపై ఒకేసారి మూడేళ్లు లేదా ఐదేళ్లకు థర్డ్ పార్టీ బీమా తీసుకోవాలన్న నిబంధన సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

news18-telugu
Updated: August 31, 2018, 11:25 AM IST
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కొత్త రూల్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు కొత్త బండి కొంటున్నారా? ఆ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని మీకు తెలుసా? వాహనానికి థర్డ్ పార్టీ బీమా గురించి అవగాహన చాలా తక్కువ మందికే ఉంటుంది. వాహనం కొన్నప్పుడు ఓ ఏడాదికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఏటేటా రెన్యువల్ చేయిస్తుంటారు. కొన్నాళ్ల తర్వాత అసలు థర్డ్ పార్టీ ఇన్యూరెన్స్‌ని పట్టించుకోరు కూడా. కానీ మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతీ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసి తప్పనిసరి. కానీ వాహనదారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. మొదట వాహనం తీసుకున్నప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ... రెన్యువల్ విషయానికొచ్చేసరికి సగం మంది కూడా ముందుకురారన్నది ఓ అంచనా. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇబ్బందులు పడేది వాహనదారులే. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) రంగంలోకి దిగింది. ఇకపై వెహికిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒక ఏడాది కాకుండా మూడేళ్లు లేదా ఐదేళ్లు ఇన్సూరెన్స్ తీసుకునేలా మార్పులు చేసింది. గతంలో సుప్రీం కోర్టు చెప్పింది కూడా ఇదే. కార్లకు మూడేళ్లు, టూవీలర్లకు ఐదేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా జారీచేసింది. ఈ ఆదేశాలను సెప్టెంబర్ 1 నుంచి అమలు కాబోతున్నాయి. ఈ మేరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సిద్ధమయ్యాయి. ఇకపై వాహనం కొన్నప్పుడే కారుకైతే మూడేళ్లు, టూవీలర్ అయితే ఐదేళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే.

ఈ నిర్ణయం వాహనదారులకు మేలు చేసేదే అయినా... కారుకు మూడేళ్లు, టూవీలర్‌కు ఐదేళ్ల బీమా ఒకేసారి చెల్లించాల్సి రావడంతో ఆ భారం మోయాల్సింది కూడా వాహనదారులే. ఎందుకంటే... అంతకుముందు ఒక ఏడాదికే ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు మూడేళ్లు, ఐదేళ్లకు బీమా తీసుకోవాలి కాబట్టి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిందే. ఇది వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని కంపెనీలు కలవరపడుతున్నాయి.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి?
ఒక్కసారి వాహనం రోడ్డెక్కిందంటే ప్రమాదం జరగదన్న గ్యారెంటీ ఉండదు. మీరు వాహనం జాగ్రత్తగా నడుపుతున్నా సరే... ఇతరుల పొరపాట్ల వల్ల ఒక్కోసారి ప్రమాదాలు జరగొచ్చు. మీ వాహనం ఢీకొని ఎవరైనా గాయపడొచ్చు. ఇలాంటి సందర్భంలో బాధితులకు మీ తరఫున బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. చాలామంది ఈ బీమా గురించి పెద్ద పట్టించుకోరు. ఏటేటా డబ్బులు చెల్లించడం అవసరమా అనుకుంటారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వచ్చేసరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విలువ తెలుస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో మీ వాహనం కారణంగా గాయపడ్డ వ్యక్తికి మాత్రమే పరిహారం దక్కుతుంది తప్ప... మీ వాహనంలో ప్రయాణించిన వారికి ఎలాంటి పరిహారం లభించదు. డబ్బులు మిగుల్తాయి కదా అని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే చివరకు ఇబ్బందుల్లో పడక తప్పదు. ఇకపై థర్డ్ పార్టీ బీమా ప్రీమియం ధరలు ఈ విధంగా ఉంటాయి.

కారు(మూడేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్)
1000 సీసీ కన్నా తక్కువ- రూ.5,286
1000-1500 సీసీ- రూ.9,5341500 సీసీ కన్నా ఎక్కువ- రూ.24,305

టూవీలర్ (ఐదేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్)
75 సీసీ కన్నా తక్కువ- రూ.1,045
75-150 సీసీ- రూ.3,285
150-350 సీసీ- రూ.5,453
350 సీసీ కన్నా ఎక్కువ- రూ.13,034ఇవి కూడా చదవండి:

సెప్టెంబర్ 5న షావోమీ 6 సిరీస్ ఫోన్ల లాంఛింగ్

సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఎల్జీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌ రేస్‌లో అమెజాన్

5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?
Published by: Santhosh Kumar S
First published: August 31, 2018, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading