Covid Insurance Claim: కరోనా క్లెయిములపై గంటలోగా తేల్చండి.. ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

కరోనా క్లెయిముల విషయంలో IRDAI బీమా కంపెనీలకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందిన అనేక మంది ఇన్సూరెన్స్ క్లైయిమ్ విషయంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో డిశ్చార్జ్ అవ్వడమూ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) ఇన్సూరెన్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాష్ లెస్ కరోనా చికిత్స క్లెయిముల విషయంలో ఫైనల్ బిల్ అందిన గంటలోగా నిర్ణయం తీసుకోవాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. ఇలా చేయడంలో వల్ల సదరు పేషెంట్ త్వరగా డిశ్చార్జ్ కావడంతో పాటు ఇతర బాధితులకు బెడ్ త్వరగా లభిస్తుందని తెలిపింది. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కు సంబంధించి అంగీకారాన్ని అరగంట నుంచి 60 నిమిషాల్లో తెలపాలని బీమా సంస్థలకు సూచించాలని ఐఆర్డీఏఐకు ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయడం వల్ల వైరస్ నుంచి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేయడంలో ఆలస్యం జరగదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో IRDAI బీమా సంస్థలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
    Covid care policy: ఇంటి వద్దే కరోనా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారా?.. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్​ కోసం ఇలా చేయండి

    ఇదిలా ఉంటే.. ఢిల్లీ హై కోర్టు ఇటీవల కీలక వాఖ్యలు చేసింది. మానసిక ఆనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని బీమా సంస్థలకు స్పష్టం చేసింది. 2018 నుంచి అమల్లోకి వచ్చిన మెంటల్ హెల్త్ కేర్ చట్టం 2017 ప్రకారం బీమా సంస్థలు ఈ పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది కోర్టు. ఆయా బీమా సంస్థలు చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నాయా? లేదా? అన్న విషయాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా - ఐఆర్డీఏ(IRDA)దేనని కోర్టు స్పష్టం చేసింది. ఒక వేళ పట్టించుకోకపోతే సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుందని తెలిపింది.
    LPG Gas Cylinder: కేవలం రూ. 61కే గ్యాస్ సిలిండర్.. ఈ ఒక్క రోజే ఛాన్స్.. ఇలా బుక్ చేయండి

    స్కిజోఫ్రినియా ట్రీట్మెంట్ కు సంబంధించి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం ఇవ్వడానికి వెనకడుగు వేయడంతో ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు ఈ వాఖ్యలు చేసింది. ఐఆర్డీఏ బీమా సంస్థలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని అర్థం అవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత మహిళలకు రూ. 6.67 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఈ సందర్భంగా సదరు బీమా సంస్థను ఆదేశించింది. దీంతో పాటు మరో రూ.25 వేలను అదనంగా చెల్లించాలని తీర్పును వెల్లడించింది.
    Published by:Nikhil Kumar S
    First published: