హోమ్ /వార్తలు /బిజినెస్ /

Third Party Insurance: కార్‌, బైక్‌ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేటెస్ట్ ప్రీమియం ఇదే

Third Party Insurance: కార్‌, బైక్‌ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేటెస్ట్ ప్రీమియం ఇదే

Third Party Insurance: కార్‌, బైక్‌ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేటెస్ట్ ప్రీమియం ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Third Party Insurance: కార్‌, బైక్‌ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేటెస్ట్ ప్రీమియం ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Third Party Insurance | టూవీలర్లు, ఫోర్ వీలర్లకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేటెస్ట్ ప్రీమియం రేట్లను ప్రకటించింది ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI).

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు రక్షణ కల్పించేందుకు ఇన్సూరెన్స్‌ పాలసీలు (Insurance Policy) అవసరం. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే, ఇరు వైపులా నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌, వెహికల్‌ ఇన్సూరెన్స్‌ వంటివి లబ్ధిదారులను రక్షించినా.. ఎదుటివారి నష్టాన్ని భరించాల్సి వస్తే ఆర్థికంగా నష్టం జరిగినట్లే. ఎలాంటి పాలసీలు లేకపోతే, తమ నష్టాలను తీర్చుకుంటూ.. ఎదుటి వారికి కూడా పరిహారం అందించడం చాలా కష్టం. అందుకే భారతదేశంలో రోడ్లపై ప్రయాణించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా ఏదో ఒక రకమైన మోటార్‌ ఇన్సూరెన్స్‌ (Motor Insurance) ఉండాలి. మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం, భారతదేశంలో మోటారు వాహనానికి తప్పనిసరిగా థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ కవరేజీ చేయించాలి. ఈ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ IRDAI నిర్ణయిస్తుంది. ఇందులో ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రమేయం ఉండదు.

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?

భారతదేశంలో కారు నడపడానికి అవసరమైన మినిమం ఇన్సూరెన్స్‌ కవరేజీని థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటారు. ఏదైనా ప్రమాదంలో ఎదుటి వ్యక్తులు(థర్డ్‌ పార్టీ)కి జరిగిన ఆస్తి, ఇతర నష్టాలను ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఈ మేరకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తీసుకొన్న వ్యక్తికి.. ఇన్సూరెన్స్‌ కంపెనీకి మధ్య ఒప్పందం ఉంటుంది. ప్రమాదంలో ఎదుటివారు మరణించినా, గాయపడినా, నష్టపోయినా సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిహారం అందిస్తుంది.

Mangaluru Blast: మంగళూరులో బ్లాస్ట్... రైల్వే ఉద్యోగిని చిక్కుల్లో పడేసిన ఆధార్ కార్డ్

థర్డ్‌ పార్టీ లయబిలిటీ కవర్‌ ఫీచర్స్

ICClLombard వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. చట్టం ప్రకారం థర్డ్‌ పార్టీ లీగల్‌ కవర్‌ తప్పనిసరి. ఇది పాలసీదారుడి కార్‌ వల్ల కలిగే ఆస్తి నష్టానికి థర్డ్‌ పార్టీకి పరిహారం ఇస్తుంది. థర్డ్‌ పార్టీ వ్యక్తి గాయపడితే.. పాలసీ వారి వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. ప్రమాదం కారణంగా థర్డ్‌ పార్టీ మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం చెందితే పాలసీ లంప్‌సమ్‌ అమౌంట్‌ను చెల్లిస్తుంది.

కవరేజీ ఎలా అందుతుంది

పాలసీదారుకు ప్రమాదం జరిగిన సందర్భంలో.. థర్డ్‌ పార్టీకి కలిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీ డబ్బును అందజేస్తుంది. దీంతో పాలసీదారుడి ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్‌ను సమర్పించే ముందు, ఇన్సూరెన్స్‌ చేసిన వ్యక్తి తక్షణమే ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. కాంప్రహెన్సివ్‌ ఇన్సూరెన్స్‌ కార్‌కు పూర్తి రక్షణను అందజేస్తుంది. థర్డ్-పార్టీ ఆటో ఇన్సూరెన్స్ ఉన్న కార్‌ ప్రమాదానికి గురై.. థర్డ్‌ పార్టీకి చెందిన వారి డ్యామేజ్‌, గాయాలు, మరణం వంటివి సంభవిస్తే ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆర్థికంగా రక్షిస్తుంది.

ప్రైవేట్ కార్లకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం

ఐఆర్‌డీఏఐ రూల్స్ ప్రకారం.. 1000 cc మించని కార్‌లకు రూ.2,094 ప్రీమియం చెల్లించాలి. అదే విధంగా 1000 cc నుంచి 1500 cc లోపల ఉండే కార్‌లకు రూ.3,416, 1500 cc దాటిన కార్‌లకు రూ.7,897 చెల్లించాల్సి ఉంది.

Royal Enfield: నెలకు రూ.3,500 మీవి కాదనుకుంటే డ్రీమ్ బుల్లెట్ బైక్ మీదే

ద్విచక్ర వాహనాల ప్రీమియం

75 cc మించని ద్విచక్ర వాహనాలకు రూ.538 ప్రీమియం ఉంటుంది. 75 cc కంటే ఎక్కువ 150 cc లోపల ఉండే బైక్‌లకు రూ.714 చెల్లించాలి. 150 cc దాటి 350 cc లోపల ఉండే వాహనాలకు రూ.1,366, 350 cc దాటిన వాటికి రూ.2,804 ప్రీమియం చెల్లించాలని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ స్పష్టం చేసింది.

కొత్త ప్రైవేట్ కార్‌ త్రీ ఇయర్స్‌ సింగిల్ ప్రీమియం

1000 cc మించని కార్‌కు రూ.6,521, 1000 cc నుంచి 1500 cc లోపల ఉండే వాహనానిని రూ.10,640, 1500 cc దాటిన కార్‌కు రూ.24,596 ప్రీమియం ఉంటుంది.

కొత్త టూ వీలర్ ఫైవ్‌ ఇయర్స్‌ సింగిల్ ప్రీమియం

కొత్త టూ వీలర్ ఫైవ్‌ ఇయర్స్‌ సింగిల్ ప్రీమియం 75 cc బైక్‌కు రూ.2,901 ఉంది. అదే విధంగా 75 cc నుంచి 150 cc వరకు ఉన్న బైక్‌కు రూ.3,851, 150 cc నుంచి 350 cc వరకు ఉన్న బైక్‌లకు రూ.7,365 చెల్లించాలి. 350 cc ఉన్న బైక్‌కు రూ.15,117 ప్రీమియం చెల్లించాలని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ స్పష్టం చేసింది.

First published:

Tags: Health Insurance, Insurance, Motor insurance, Personal Finance

ఉత్తమ కథలు