Cashless Insurance claims: క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు తిరస్కరిస్తే చర్యలు.. బీమా కంపెనీలకు సర్క్యూలర్

ప్రతీకాత్మక చిత్రం

కరోనా పేషెంట్ల క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను తిరస్కరిస్తున్న ఆస్పత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీలను ఐఆర్డీఏఐ కోరింది. ఈ మేరకు జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సర్కులర్ జారీ చేసింది.

  • Share this:
    ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆప్‌ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ఇన్సూరెన్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జరీచేసింది. క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు తిరస్కరిస్తున్న ఆస్పత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీమీ కంపెనీలను కోరింది. ఈ మేరకు జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సర్క్యూలర్ జారీ చేసింది. కొన్ని ఆస్పత్రులు క్యాష్‌లెస్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఐఆర్డీఏఐ తెలిపింది. ఇదిలా ఉంటే.. నగదు రహిత క్లెయిమ్ లను తిరస్కరించే బీమా కంపెనీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఐఆర్డీఏఐ చైర్మన్ కుంతియాను అంతకు ముందు నిర్మలా సీతారామన్ కోరారు. కొన్ని ఆస్పత్రులు క్యాష్ లెస్ బీమాను తిరస్కరిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు ఆమె చెప్పారు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఐఆర్డీఏ చైర్మన్ ను కోరినట్లు మంత్రి చెప్పారు. ముఖ్యంగా కరోనా క్లైమ్ లను ప్రాధాన్యం తీసుకుని వేగంగా సెటిల్ చేయాలని బీమా కంపెనీలను ఐఆర్డీఏ కోరినట్లు మంత్రి తెలిపారు. ఏవైనా ఆస్పత్రులు నగదు క్యాష్ లెస్ క్లెయిమ్ లను తిరస్కరిస్తే వెంటనే బీమా కంపెనీకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు మంత్రి సూచించారు.

    ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌ 20 నాటికి 9 లక్షల కరోనా సంబంధిత ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను బీమా కంపెనీలు సెటిల్‌ చేశాయి. తద్వారా రూ.8,642 కోట్లు విడుదల చేశాయి. గత సంవత్సరం మార్చిలోనే కరోనాను కూడా కాంప్రహెన్సివ్‌ హెల్త్‌ స్కీమ్‌లో చేర్చారు. తద్వారా నెట్‌వర్క్‌ ఆస్పత్రులతోపాటు తాత్కాలిక కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ క్యాష్‌లెస్‌ చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఫోన్‌ కన్సల్టేషన్‌కు అయిన ఖర్చులను కూడా క్లెయిమ్‌ చేసుకునే అవకాశం కలిగింది. అయితే.. దీనిని అమలు చేయని ఆస్పత్రులపై పాలసీదారులు సంబంధిత బీమా కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

    ఇదిలా ఉంటే.. భారత్‌లో హెల్త్ ఇన్సూరెన్సులకు ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటు పడుతున్నారు. ఇంతకు ముందు ఉన్న పాలసీల్లో కోవిడ్-19 చికిత్స ఖర్చులను భర్తీ చేసేవి లేవు. ఈ నేపథ్యంలో ప్రతి కంపెనీ కరోనా కవచ్ లేదా స్టాండర్డ్ కోవిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కచ్చితంగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వివిధ సంస్థలు కరోనా చికిత్సకు ప్రత్యేకంగా పాలసీలను అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులకు ఇవి కవరేజీ కల్పిస్తున్నాయి. వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి కలిపి రూ.5 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు లేదా తొమ్మిదిన్నర నెలల కాల వ్యవధికి పాలసీని కొనుగోలు చేయవచ్చు. కరోనా కవచ్ పాలసీలను కొనుగోలు చేసే విండోను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
    Published by:Nikhil Kumar S
    First published: