ఇన్సూరెన్స్ (Insurance) ప్రయోజనాలను అన్ని వర్గాలకు అందించే దిశగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) అడుగులు వేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ సెక్టార్‌లో కీలక సంస్కరణలు తీసుకొస్తోంది. ఒకే వేదికపై అన్ని రకాల పాలసీలను అందించడం, ఆన్‌లైన్ సేవల విస్తరణకు చర్యలు, మధ్యవర్తుల ప్రమేయం నియంత్రించే నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు తాజాగా వికలాంగులు (PWD), HIV/AIDSతో బాధపడుతున్న వ్యక్తులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిర్దిష్టమైన కవర్‌ను అందించాలని జనరల్, స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలను కోరింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే..
* తక్షణమే పాలసీలు లాంచ్ చేయాలి
IRDAI ఒక సర్క్యులర్‌లో.. వికలాంగులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించాలి. IRDAI(హెల్త్ ఇన్సూరెన్స్) నిబంధనలు, 2016(HIR, 2016)కి అనుగుణంగా పాలసీ ధరను నిర్ణయించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను కోరింది. ఈ వర్గాల జనాభా నుంచి ఎటువంటి ప్రతిపాదనలు ఇన్సూరెన్స్ కవరేజీని తిరస్కరించకుండా ఉండేలా బోర్డు ఆమోదించిన పూచీకత్తు పాలసీని అమలులోకి తీసుకురావాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI సూచించింది.
ప్రొడక్ట్ పాలసీ టెన్యూర్ ఒక సంవత్సరం పాటు ఉండాలని, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం రెన్యూవల్ చేసుకునే సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది. జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయడానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేసిన జనరల్, స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు తమ సంబంధిత ప్రొడక్టులను తప్పనిసరిగా ప్రారంభించాలని సూచించింది. తక్షణమే సేవలు అందించాలని కోరింది.
ఇది కూడా చదవండి : రూ.10 లక్షలు పెడితే రూ.20 లక్షలు.. బ్యాంక్ అదిరే శుభవార్త!
* లక్ష్యాలు సాధించడానికి మరిన్ని కంపెనీలు, ప్రొడక్టులు అవసరం
ఇటీవల IRDAI ఛైర్మన్ దేబాసిష్ పాండా మాట్లాడుతూ.. 2047 నాటికి అన్ని ఇన్సూరెన్స్ లక్షాలను సాధించడానికి, భారతదేశానికి ఎక్కువ సంఖ్యలో ఇన్సూరెన్స్ ప్లేయర్‌లు, చాలా విస్తృతమైన ప్రొడక్టులు, పంపిణీ భాగస్వాములు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ రెండు దశాబ్దాల క్రితం మొదలైందని, మార్కెట్ చాలా పెద్దదిగా పెరిగిందని తెలిపారు.
ఇప్పటికీ వేగంగా, లోతైన వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గత ఐదేళ్లలో ఈ రంగం ప్రతి సంవత్సరం 10 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికీ ఇన్సూరెన్స్ వ్యాప్తి 2021లో 4.2 శాతంగానే ఉందని, ఇంకా కవర్ చేయాల్సి ఉందని అన్నారు. తాజా సర్వేలో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం అనేది మహమ్మారి తర్వాత భారతీయుల ప్రధాన జీవిత లక్ష్యంగా మారిందని, 71% మంది భారతీయులు ఇతర లక్ష్యాల కంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు.
ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ వేగవంతమైన, క్రమబద్ధమైన వృద్ధిని తీసుకురావడానికి (యాన్యుటీ, సూపర్‌యాన్యుయేషన్ చెల్లింపుల సహా), సామాన్యుల ప్రయోజనం కోసం, ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధికి దీర్ఘకాలిక నిధులను అందించడానికి IRDAI ఏర్పాటు అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, Irdai, Personal Finance