Covid19 Policy: కరోనా పాలసీల గడువు పొడగింపు.. వచ్చే ఏడాది వరకు అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా సమయంలో చాలా సంస్థలు కరోనా(Corona) పాలసీలను చేయించాయి. ప్రస్తతం ఉన్న పరిస్థితుల్లో కరోనా పాలసీలను మరో ఏడాది పొడగిస్తున్నట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేరీ అండ్ డెవెలంప్మెంట్ అథారిటీ (Insurance Regulatory and Development Authority) పేర్కొంది
కరోనా సమయంలో చాలా సంస్థలు కరోనా(Corona) పాలసీలను చేయించాయి. ప్రస్తతం ఉన్న పరిస్థితుల్లో కరోనా పాలసీలను మరో ఏడాది పొడగిస్తున్నట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేరీ అండ్ డెవెలంప్మెంట్ అథారిటీ (Insurance Regulatory and Development Authority) పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఐఆర్డీఏఐ పలు బీమా సంస్థలకు ‘కరోనా కవచ్’, ‘కరోనా రక్షక్’ పేరుతో ఆరోగ్య బీమా పాలసీలను తీసుకురావాలని ఆదేశంచింది. ఆ పాలసీలు చేసేందుకు గడువు ఈ ఏడాదితో ముగియనుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత కొలిక్కి రాకపోవడంతో ఎలక్ట్రానిక్(Electronic) పద్ధతిలో పాలసీల విక్రయాల గడువునూ ఐఆర్డీఏ వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది.
మంచి స్పందన..
కరోనా సమయంలో ప్రవేశపెట్టిన బీమా స్కీం(Scheme)లకు జనం నుంచి స్పందన వచ్చింది. చాలా మంది ఈ పాలసీలను కట్టారు. స్వల్పకాలిక కొవిడ్ పాలసీల ప్రీమియం.. రెగ్యులర్ ఆరోగ్య బీమా పాలసీలతో పోల్చితే చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని సంస్థలు చెబుతున్నాయి. ప్రజల స్పందన ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఐఆర్డీఏ గడవుపొడగించింది. అంతే కాకుండా కరోనా నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాలసీల విక్రయాల గడువునూ ఐఆర్డీఏ వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, సర్క్యూలర్(Circular)ను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. . పాలసీదారుల వద్దకు భౌతిక పత్రాల కోసం వెళ్లే ఏజెంట్లు కరోనా బారిన పడకుండా ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐఆర్డీఏఐ తెలిపింది. పలు సంస్థల నుంచి వచ్చి ఈ విజ్ఞప్తులను అమలు చేసినట్టు తెలిపింది. ఈ ఎలక్ట్రానిక్ పాలసీ గడువును కూడా మరో ఏడాది పెంచుతున్నట్టు ఐఆర్డీఐ తెలిపింది.
నూతన పాలసీ..
డిస్ప్యూటెడ్ టైటిల్(Title) డీడ్ల నుంచి ఆస్తుల కొనుగోలుదారుల రక్షణార్థం కొత్త టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రారంభించాలని జనరల్ ఇన్సూరర్లను ఐఆర్డీఏఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ విధానాన్ని తయారు చేయాలని ఆదేశించింది. డిస్ప్యూటెడ్ టైటిల్ల కారణంగా చాలా మంది వినియోగదారులు నష్టపోతున్నారు. అందుకోసంమే ఈ నూతన పాలసీని ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా వినియోగదారులు భయాలు పోతాయని అమ్మంకందారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.