IRCTC: ఐఆర్‌సీటీసీ టీడీఆర్... ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అంశాలివే

IRCTC TDR | ఇ-టికెట్‌కు మాత్రం ఆన్‌లైన్‌లోనే టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. స్టేటస్ ఆన్‌లైన్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: June 3, 2019, 4:30 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ టీడీఆర్... ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అంశాలివే
IRCTC: ఐఆర్‌సీటీసీ టీడీఆర్... ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అంశాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసేవాళ్లు టీడీఆర్ గురించి ఎక్కువగా వింటూ ఉంటారు. టీడీఆర్ గురించి తెలియక ఆ సేవల్ని ఉపయోగించుకోరు ప్రయాణికులు. అందుకే రైల్వే ప్రయాణికులు టీడీఆర్ గురించి తెలుసుకోవడం అవసరం. టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రిసిప్ట్. అంటే రీఫండ్ కోసం టికెట్ డిపాజిట్ చేసి రిసిప్ట్ పొందడం అన్నమాట. రైల్వే టికెట్లు మూడు రకాలు. ఒకటి కౌంటర్‌లో తీసుకునే టికెట్. రెండోది ఐ-టికెట్. అంటే మీరు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటారు కానీ... టికెట్ కొరియర్‌లో మీరు కోరుకున్న అడ్రస్‌కు వస్తుంది. ఇక మూడోది ఇ-టికెట్. ఆన్‌లైన్‌లో తీసుకునే టికెట్ ఇది. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఇ-టికెట్స్ తీసుకుంటారు ప్రయాణికులు. మొదటి రెండు టికెట్లకు టీడీఆర్ ఫైల్ చేయాలంటే రిజర్వేషన్ కౌంటర్‌లోనే సాధ్యం. ఇ-టికెట్‌కు మాత్రం ఆన్‌లైన్‌లోనే టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. స్టేటస్ ఆన్‌లైన్‌లో చూడొచ్చు.

Read this: IRCTC: గోవాలో బస్ ట్రిప్... జస్ట్ రూ.400 మాత్రమే

IRCTC TDR: ఐఆర్‌సీటీసీ టీడీఆర్ ఏ సందర్భాల్లో ఫైల్ చేయొచ్చు?



టీడీఆర్ వర్తించే సందర్భాలు ఇవే...
1. రైళ్లను రైల్వే క్యాన్సిల్ చేస్తే...


2. రైలు మూడు గంటలకన్నా ఎక్కువ ఆలస్యంగా నడుస్తుంటే...
3. మీరు చెల్లించిన ఫేర్‌కు... కేటాయించిన కోచ్‌కు మధ్య తేడా ఉంటే...4. ఏసీ కోచ్‌లో ఏసీ ఫెయిల్ అయితే... ఇందుకోసం టీటీఈ సర్టిఫికెట్ తప్పనిసరి.
5. టీటీఈ తప్పుగా ఛార్జీలు విధిస్తే...
6. పాక్షికంగా ప్రయాణిస్తే... (రాజధాని, శతాబ్ధి, జన్ శతాబ్ధి రైళ్లల్లో తప్ప)
7. ప్రయాణికులు ప్రయాణించకపోతే... జనరల్ టికెట్‌కు మాత్రమే

టీడీఆర్ వర్తించని సందర్భాలు ఇవే...
1. రైల్వే తప్పు లేకపోతే...
2. తత్కాల్ టికెట్ కన్ఫామ్ అయినా ప్రయాణించకపోతే...
3. ప్రయాణ తేదీ నుంచి 30 రోజుల్లో ఫైల్ చేయకపోతే...
4. ఐ-టికెట్‌కు ఆన్‌లైన్ రీఫండ్ వర్తించదు. ఐ-టికెట్ ఉన్నవాళ్లు స్టేషన్ మాస్టర్‌కు టికెట్ డిపాజిట్ చేసి టీడీఆర్ తీసుకోవాల్సి ఉంటుంది.

IRCTC TDR: ఐఆర్‌సీటీసీ టీడీఆర్ ఎలా ఫైల్ చేయాలి?


www.irctc.co.in వెబ్‌సైట్‌లో మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత My Transaction సెక్షన్‌లో File TDR అని ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లో కూడా టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత DASHBOARD పైనే మీకు File TDR ఆప్షన్ కనిపిస్తుంది.

OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

ATM: ఏటీఎంలో డబ్బులు రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి

Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

 
First published: June 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>