IRCTC: ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లందరికీ ఈ వార్నింగ్

IRCTC Warning | ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC అకౌంట్ ఉన్నవారిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. అందుకే యూజర్లను అప్రమత్తం చేస్తోంది ఐఆర్‌సీటీసీ.

news18-telugu
Updated: March 3, 2020, 12:08 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లందరికీ ఈ వార్నింగ్
IRCTC: ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లందరికీ ఈ వార్నింగ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా? తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా? ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో రైలు టికెట్లు బుక్ చేస్తుంటారా? అయితే జాగ్రత్త అంటోంది ఐఆర్‌సీటీసీ. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని టార్గెట్ చేయడంతో పాటు మీ అకౌంట్లు ఖాళీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అందుకే అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డు నెంబర్, పిన్, సీవీవీ, యూపీఐ లాంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ కాల్స్‌, ఎస్ఎంఎస్, ఇమెయిల్స్‌లో ఎవరితో షేర్ చేయొద్దని సూచిస్తోంది. ఐఆర్‌సీటీసీ అధికారులమని, బ్యాంకు సిబ్బంది పేరుతో ఏవరైనా కాల్స్ చేసి, మీ వివరాలన్నీ సరిగ్గా చెప్పి మిమ్మల్ని నమ్మించే అవకాశముంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ మాయమాటలకు లొంగిపోకూడదు. మీ వివరాలు షేర్ చేయకూడదు. పొరపాటున మీ వివరాలు చెబితే మీ అకౌంట్‌లో డబ్బులు క్షణాల్లో ఖాళీ అయిపోపోవడం ఖాయం.


మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలని కోరుతూ తమ సిబ్బంది ఎవరూ ఫోన్‌లో, ఇమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా కాంటాక్ట్ చేయరని చెబుతోంది ఐఆర్‌సీటీసీ. మీ వ్యక్తిగత సమాచారంతో పాటు ఐఆర్‌సీటీసీ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్, ఓటీపీ లాంటి వివరాలేవీ చెప్పకూడదు. రీఫండ్స్, టీడీఎస్, ఇ-టికెట్ క్యాన్సలేషన్ లాంటివన్నీ ఆటోమెటిక్‌గా ప్రాసెస్ అవుతుంటాయి. ఐఆర్‌సీటీసీ ఇ కేటరింగ్, ఎయిర్, టూరిజం లాంటి రీఫండ్ ప్రాసెస్‌లో మానవ ప్రమేయం ఉండదు. కాబట్టి తప్పులు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ రీఫండ్ మీరు బుకింగ్ సమయంలో ఉపయోగించిన బ్యాంక్ అకౌంట్‌లోకి మాత్రమే వెళ్తుంది. రీఫండ్ ప్రాసెస్‌లో ఏవైనా అనుమానాలు ఉంటే ఐఆర్‌సీటీసీ అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారానే కంప్లైంట్ ఇవ్వాలి. అంతే తప్ప ఇతరులు ఎవరైనా కాల్ చేస్తే వివరాలు చెప్పొద్దు.


ఇక మీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. దీని వల్ల వాటిని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఐఆర్‌సీటీసీకి మీరు ఏదైనా ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే మెయిల్ ఐడీ, టోల్ ఫ్రీ నెంబర్ల కోసం గూగుల్‌లో వెతకొద్దు. ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లోని కాంటాక్ట్ డీటెయిల్స్‌ ద్వారానే కంప్లైంట్ చేయాలి.

ఇవి కూడా చదవండి:

IRCTC: రైలులో ఫుడ్ ఫ్రీ... కానీ ఓ కండీషన్

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇలా మోసపోవచ్చు జాగ్రత్త

Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: March 3, 2020, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading