హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: ట్రైన్ టికెట్ కన్ఫామ్ కాకపోతే తర్వాతి రైలులో బెర్త్ బుక్ చేసే ఛాన్స్

IRCTC: ట్రైన్ టికెట్ కన్ఫామ్ కాకపోతే తర్వాతి రైలులో బెర్త్ బుక్ చేసే ఛాన్స్

IRCTC: ట్రైన్ టికెట్ కన్ఫామ్ కాకపోతే తర్వాతి రైలులో బెర్త్ బుక్ చేసే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: ట్రైన్ టికెట్ కన్ఫామ్ కాకపోతే తర్వాతి రైలులో బెర్త్ బుక్ చేసే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC | ట్రైన్ టికెట్ కన్ఫామ్ కాకపోతే తర్వాతి రైలులో బెర్త్ బుక్ చేసే ఛాన్స్ ఇస్తోంది భారతీయ రైల్వే. ఇందుకోసం రైలు టికెట్ బుక్ (Train Ticket Booking) చేసేప్పుడే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

సమ్మర్‌లో ఊరెళ్లేందుకు లేదా టూర్ వెళ్లేందుకు రైలు టికెట్స్ బుక్ (Train Ticket Booking) చేయాలనుకుంటున్నారా? రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెర్తులు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బెర్త్ కన్ఫామ్ కావాలంటే చాలా ముందుగానే రైలు టికెట్ల బుకింగ్ చేయాలి. మీరు కోరుకున్న రైలులో టికెట్ దొరకకపోతే తర్వాతి రైలులో బెర్త్ కన్ఫామ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా రెండోసారి బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. మొదటి బుకింగ్ పైనే తర్వాతి రైలులో కూడా బెర్త్ పొందే అవకాశం ఇస్తోంది రైల్వే. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ వికల్ప్ పేరుతో స్కీమ్ (IRCTC Vikalp Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుందో, మీరు టికెట్స్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ 2015లో వికల్ప్ ట్రైన్ టికెట్ స్కీమ్ ప్రారంభించింది. దీన్నే ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు రైలు ప్రయాణికులు ఓ రైలులో టికెట్ బుక్ చేశారనుకుందాం. ఆ రైలులో బెర్త్ కన్ఫామ్ కాకపోతే టికెట్ క్యాన్సిల్ అవుతుంది. రీఫండ్ ప్రయాణికులకు వచ్చేస్తుంది. అయితే వికల్ప్ స్కీమ్ ఎంచుకుంటే ఒక రైలులో టికెట్ దొరకనప్పుడు, అదే రూట్‌లో వెళ్లే మరో రైలులో బెర్త్ పొందే అవకాశం ఉంటుంది.

EPF Withdrawal: అర్జెంట్‌గా డబ్బులు కావాలా? ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేయండిలా

ఉదాహరణకు ఓ వ్యక్తి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు మే 6న ఒక రైలులో టికెట్ బుక్ చేశారనుకుందాం. సదరు ప్రయాణికుడికి తాను కోరుకున్న రైలులో టికెట్ దొరకకపోతే, అదే రోజు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే తర్వాతి రైలులో బెర్త్ దొరుకుతుంది. ఇలా తర్వాతి ఒక రైలులో కాదు, గరిష్టంగా 7 రైళ్లలో ఆప్షన్ ఎంచుకోవచ్చు.

రైలు ప్రయాణికులు ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ కావాలి.

మీరు వెళ్లాలనుకునే చోటికి బుకింగ్ వివరాలు ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత వికల్ప్ ఆప్షన్ ఎంచుకోవాలి.

వికల్ప్ స్కీమ్ నియమనిబంధనలు అంగీకరించాలి.

పేమెంట్ చేసి టికెట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి

మీరు బుక్ చేసిన రైలులో బెర్త్ కన్ఫామ్ కాకపోతే ఆ తర్వాతి రైలులో బెర్త్ దొరికే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ తర్వాతి రైలులో బెర్తులు ఖాళీగా ఉంటేనే బెర్త్ కన్ఫామ్ అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అన్ని రైళ్లల్లో, అన్ని క్లాసులకు వికల్ప్ స్కీమ్ వర్తిస్తుంది.

First published:

Tags: Indian Railways, IRCTC, Railways

ఉత్తమ కథలు