హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Ticket Booking: వాయిస్ మెసేజ్‌తో రైలు టికెట్ల బుకింగ్... ఎలా చేయాలో తెలుసుకోండి

IRCTC Ticket Booking: వాయిస్ మెసేజ్‌తో రైలు టికెట్ల బుకింగ్... ఎలా చేయాలో తెలుసుకోండి

IRCTC Ticket Booking: వాయిస్ మెసేజ్‌తో రైలు టికెట్ల బుకింగ్... ఎలా చేయాలో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రంంంంంంం)

IRCTC Ticket Booking: వాయిస్ మెసేజ్‌తో రైలు టికెట్ల బుకింగ్... ఎలా చేయాలో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రంంంంంంం)

IRCTC Ticket Booking | టెక్నాలజీని ఉపయోగించుకొని రైలు టికెట్లు బుకింగ్‌ను (Train Ticket Booking) సులభతరం చేస్తోంది ఐఆర్‌సీటీసీ. వాయిస్ మెసేజ్‌తో రైలు టికెట్లు బుక్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రైలు టికెట్లు బుక్ చేయాలంటే ఒకప్పుడు రైల్వే కౌంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇ-టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. దీంతో రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే రైలు టికెట్లు బుక్ (Online Train Ticket Booking) చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకొని పేటీఎం లాంటి సంస్థలు కూడా తమ మొబైల్ యాప్స్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పుడు రైల్వే ప్రయాణికులు నిమిషాల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేయొచ్చు. రైలు టికెట్ బుకింగ్ ఇంత సులభతరం కావడానికి టెక్నాలజీనే కారణం.

ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని ఐఆర్‌సీటీసీ మరో అడుగు ముందుకేసింది. ఇంకా సులభంగా రైలు టికెట్లను బుక్ చేసేందుకు ఆస్క్ దిశ 2.0 (AskDISHA 2.0) ద్వారా ఏఐ వర్చువల్ అసిస్టెంట్ సేవల్ని అందిస్తోంది. రైల్వే ప్రయాణికులు ఈ వర్చువల్ అసిస్టెంట్ సాయంతో రైలు టికెట్లను ఇంకా సులువుగా బుక్ చేయొచ్చు. వాట్సప్‌లో ఛాటింగ్ చేసినట్టుగా వర్చువల్ అసిస్టెంట్‌తో ఛాటింగ్ చేస్తూ ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు. మరో హైలైట్ ఏంటంటే ఐఆర్‌సీటీసీ యూజర్లు వాయిస్ ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

ఆస్క్ దిశ 2.0 సాయంతో ట్రైన్ టికెట్ బుక్ చేయండిలా

ఐఆర్‌సీటీసీ యూజర్లు మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆస్క్ దిశ 2.0 ఛాట్‌బాట్ ఓపెన్ చేయాలి.

వాయిస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే వాయిస్ సర్వీస్ ఓపెన్ అవుతుంది.

మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ తేదీలో ప్రయాణించాలనుకుంటున్నారో వాయిస్ మెసేజ్ ద్వారా చెప్పాలి.

ఆ రోజున ఏఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయో జాబితా కనిపిస్తుంది.

అందులో ట్రైన్, క్లాస్ సెలెక్ట్ చేయాలి.

కన్ఫామ్ చేసిన తర్వాత ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయాలి.

మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి.

రైలు టికెట్ బుక్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

' isDesktop="true" id="1493212" youtubeid="gQcqoZvIieg" category="technology">

ఏఐ ఛాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ CoRover అందిస్తున్న టెక్నాలజీ ఇది. ఐఆర్‌సీటీసీ యూజర్లు పాస్‌వర్డ్ అవసరం లేకుండా, వాయిస్ ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. ఇంగ్లీష్, హిందీ, హింగ్లిష్ భాషల్లో ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. రైలు టికెట్లు బుక్ చేయడం మాత్రమే కాదు, ఇ-టికెట్, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయడం, రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడం, బుకింగ్ హిస్టరీ చూడటం లాంటి సేవల్ని కూడా పొందొచ్చు.

ఐఆర్‌సీటీసీ లెక్కల ప్రకారం లక్షలాది మంది యూజర్లు ఆస్క్ దిశ 2.0 ఛాట్‌బాట్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.

First published:

ఉత్తమ కథలు