హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ లుక్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే

IRCTC: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ లుక్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే

IRCTC: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ లుక్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ లుక్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC New Website and Mobile App | ఇ-టికెటింగ్ వెబ్‌సైట్, రైల్ కనెక్ట్ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది ఐఆర్‌సీటీసీ. కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకోండి.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ లుక్ మారింది. టెక్నాలజీని ఉపయోగించుకొని సరికొత్త ఫీచర్స్‌ని అందిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. ఇ-టికెటింగ్ వెబ్‌సైట్ https://www.irctc.co.in/ తో పాటు ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సరికొత్త వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అప్‌గ్రేడ్ చేయక చాలారోజులైంది. 2018లో చివరగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాట్‌ఫామ్‌లో అనేక మార్పుల్ని తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. ప్యాసింజర్ ఫ్రెండ్లీగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, రైల్ కనెక్ట్ యాప్‌ను తీర్చిదిద్దింది. కొత్త వెబ్‌సైట్‌, యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టికెట్లు బుక్ చేయొచ్చని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ కొత్త వెబ్‌సైట్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నత స్థాయికి వెళ్తుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

January 2021 Bank Holidays: జనవరిలో బ్యాంకులకు 10 సెలవులు... ఎప్పుడంటే

New Rules from January 1: అందరికీ అలర్ట్... రేపటి నుంచి మారే 12 రూల్స్ ఇవే

IRCTC New Website and Mobile App: ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్, రైల్ కనెక్ట్ యాప్ ఫీచర్స్ ఇవే


వన్ క్లిక్ పేరుతో సరికొత్త ఫీచర్ అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. దీని ద్వారా రైలు వివరాలు, మీల్స్ బుకింగ్, అకామడేషన్ లాంటివన్నీ కేవలం ఒక్క క్లిక్‌తో బుక్ చేయొచ్చు. ప్రయాణికులకు ఇంటెలిజెంట్ జర్నీ, స్టేషన్ సజెషన్స్ లభిస్తాయి. రైళ్లను సెర్చ్ చేయడం గతంలో కన్నా ఇంకా ఈజీ అవుతుంది. బుకింగ్ సమయంలో అన్ని క్లాసుల్లో అందుబాటులో ఉన్న బెర్తుల వివరాలు, కన్ఫామ్ అయ్యే అవకాశాల వివరాలు ఒకేచోట కనిపిస్తాయి. ప్రయాణికులు రైలు, క్లాస్ ఎంచుకున్న తర్వాత ఒక్క క్లిక్‌తో టికెట్ బుక్ చేయొచ్చు. ఇక ప్రయాణికుల వివరాలు మళ్లీ మళ్లీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రెడిక్టీవ్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. ఇక రైలు టికెట్ల ప్రస్తుత స్టేటస్ వేగంగా, కచ్చితత్వంతో తెలుస్తుంది. టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్స్ చేయడం కూడా ఇంకా సులువవుతుంది.

Fastag: వాహనదారులకు గుడ్ న్యూస్... ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు

WhatsApp New Year Stickers: న్యూ ఇయర్ విషెస్ చెప్పాలా? కలర్‌ఫుల్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

ఇండిగ్రేటెడ్ బుకింగ్ ద్వారా అకామడేషన్ సులువుగా బుక్ చేయొచ్చు. లాస్ట్ ట్రాన్సాక్షన్స్ వివరాలు కూడా సులువుగా తెలుసుకోవచ్చు. ప్రయాణికులు రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినట్టైతే అన్ని టికెట్ల రీఫండ్ స్టేటస్ ఒకేచోట కనిపిస్తుంది.

First published:

Tags: Indian Railway, Indian Railways, Irctc, Mobile App, Railways, Technology, Train, Train tickets

ఉత్తమ కథలు