Visakhapatnam To Assam Tour | కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. మీరు కొత్త టూర్ (Tour) ప్లాన్ చేయాలని భావిస్తే.. మీకో అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. అస్సాం, మేఘాలయ వంటి ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. విశాఖ పట్నం నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌టీసీటీ (IRCTC) టూరిజం ఈ టూర్ ప్యాకేజ్‌ను అందుబాటులో ఉంచింది. అందువల్ల ఎవరైనా మేఘాలయ, అస్సాం టూర్ ప్లాన్ చేస్తూ ఉంటే అలాంటి వారికి ఈ ఆప్షన్ చాలా అనువుగా ఉంటుంది.
వైజాగ్ నుంచి మేఘాలయ , అస్సాం టూర్ వారం రోజులు ఉంటుంది. 6 నైట్స్/ 7 డేస్ టూర్ ఇది. ఇందులో భాగంగా చిరపుంజీ, గువాహటి, కజిరంగ, షిల్లాంగ్, మౌలీనాంగ్ వంటి ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. మ్యాజికల్ అస్సాం మేఘాలయ విత్ కజిరంగ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ను అందుబాటులో ఉంచింది.
బ్యాంక్ కస్టమర్లకు అదిరే శుభవార్త.. 3 ఏళ్లలో తొలిసారిగా భారీ ఊరట!
చరిత్ర, సంస్కృతి, ప్రకృతి ప్రేమికులకు ఈ టూర్ అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే లోయలు, కొండలు, ఒంటి కొమ్ము రైనోలు ఉన్న నేషనల్ పార్క్ వంటి వాటిని చూసి రావొచ్చు. ఈ టూర్ విశాఖ పట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 21న ఈ టూర్ ప్రారంభం అవుతుందని ఐఆర్‌సీటీసీ టూరిజం పేర్కొంటోంది. సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 54,545 చెల్లించాలి. అదే డబుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 39,810 కట్టాలి. ఇక ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 37,880 పడుతుంది. ఇక చైల్డ్ విత్ బెడ్ (5 నుంచి 11 ఏళ్లు) అయితే రూ. 34,460 చెల్లించాలి. ఇక చైల్డ్ విత్‌ఔట్ బెడ్ (2 నుంచి 4 ఏళ్లు) అయితే రూ. 14740 కట్టాలి.
గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే!
విశాఖ పట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి గువాహటి వెళ్తారు. అక్కడి నుంచి కజిరంగ వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత కజిరంగ నుంచి షిల్లాంగ్ తీసుకెళ్తారు. అటుపైన షిల్లాంగ్ నుంచి చిరపుంజీ వెళ్లాలి. తర్వాత షిల్లాంగ్ నుంచి మౌలీనాగ్ వెళ్తారు. తర్వాత షిల్లాంగ్ నుంచి గువాహటి వస్తారు. ఇక గువాహటి నుంచి విశాఖ పట్నం వచ్చేస్తారు. ఈ టూర్ మొత్తం 6 నైట్స్/ 7 డేస్ ఉంటుంది. విమాన టికెట్లు, ఆరు బ్రేక్ ఫాస్ట్‌లు, 6 డిన్నర్లు, సైట్ సీయింగ్ ట్రాన్స్‌పోర్ట్, స్టేయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి అన్నీ టూర్‌లో భాగంగానే ఉంటాయి. అయితే సైట్‌సీయింగ్‌లో ఎంట్రెస్ టికెట్లు, లంచ్, ఫ్లైట్‌లో మీల్స్ వంటి వాటిని మనమే డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assam, IRCTC, IRCTC Tourism, Meghalaya, Tourism, Vizag